"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కెపాసిటర్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Capacitor 019.jpg
P.F.ను పెంచు కెపాసిటర్

పరిశ్రమలకు కెపాసిటర్ వాడకంపై సూచనలు

అది చింతపల్లిలో నెలకు 10 లక్షలకు పైగా కరెంటు బిల్లు చెల్లిస్తున్న ఇండస్ట్రీ. ఒక కరెంటు బిల్లుల గురించి తెలిసిన పెద్దమనిషి వీరి బిల్లు చూసి మీ P F 0. 8 ఉంది దాని వల్ల ప్రతి నెల 2 లక్షల వరకు ఎక్కువగా చెల్లిస్తున్నారని చెప్పాడు. మిల్లు యజమాని బిల్లంతా చదివి అలా అని ఎక్కడా లేదే అని అడిగాడు. అదే విద్యుత్తు శాఖలో ప్రవేశపెట్టిన కొత్త బిల్లింగ్ పద్ధతిలోని మాయాజాలం. వివరాల్లోకి వెళితే. . . . . . .

విద్యుత్తు వినియోగం లెక్కింపు కొరకు రెండు పద్ధతులున్నాయి. ఒకటి యాక్టివ్ పవర్ లేదా KWh (kilowatt hour) పద్ధతి రెండవది ఆపరెంట్ పవర్ లేదా KVAh (kilowatt amphre hour) పద్ధతి. ఈ KWh, KVAh ల నిష్పత్తిని మనం PF అంటాము. 31-3-2011 వరకు బిల్లులన్నీ KWh ఆధారంగా లెక్కించేవారు. PF 0. 95 కంటే తక్కువ ఉంటే తక్కువైన ప్రతి 0. 01 PF కి 0. 5% నుండి 2. 0% పెనాల్టిగా వసూలు చేసేవారు. ప్రతి వినియోగదారునికి ఎంత PF (power Factor) ఉండాలన్నది తెలిసేది. కానీ. . . . . . .

01. 04. 2011 నుండి విద్యుత్ శాఖ మనం చెప్పుకున్న రెండవ పద్ధతిని సరైన ప్రచారం లేకుండానే అమల్లో పెట్టింది. అదే KVAh బిల్లింగు. బిల్లులో పెనాల్టి కనిపించదు కాని బిల్లు మాత్రం ఎక్కువగా వస్తుంది. PF ఎంత వచ్చిందో వుంటుంది కాని పెనాల్టి ఉండదు. దానివల్ల రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారు. పోతూనే ఉన్నారు. విద్యుత్ శాఖ అమలు చేసిన కొత్త విధానం వల్ల ట్రాన్స్. కో. వినియోగదారున్ని PF సరిగ్గా (1. 0) ఉంచుకోమని వత్తిడి చేయనక్కరలేదు. ఎందుకంటే దాని వల్ల నష్టపోయేది వినియోగాదారుడే మరి.

అసలు PF ని లెక్క వేయాల్సిన అవసరం ఏమిటి. . . . . మనం మోటర్లాంటి యంత్ర సామగ్రికి విద్యుత్ సరఫరా చేసినప్పుడు అందులో చాలా భాగం అయస్కాంత శక్తిగా మారుతుంది. అదే మోటారు తిరగడానికి ఉపయోగపడుతుంది. మనం వాడే మోటారు రకాన్ని బట్టి, వైండిగ్ బట్టి, బేరింగు బట్టి, ఇది మారుతూ ఉంటుంది. ఇలా నిజంగా మోటారు ఉపయోగించిన విద్యుత్తునే మనం యాక్టివ్ పవర్ అంటాము. ఈ యాక్టివ్ పవరుకు మనం నిజంగా పంపిణి చేసిన విద్యుత్తు (ఆపరెంట్ పవర్) కు ఉన్న నిష్పత్తినే మనం ఆ మోటారు యొక్క సామర్థ్యం అంటారు. దాన్నే కరెంటు భాషలో PF అంటారు. ఇది 1. 0 కంటే ఎంత తగ్గుతూ ఉంటే మనకు అంత నష్టం వచ్చినట్లే. మరి ఒక మోటారును 100% సామర్థ్యంతో పని చేయిమ్చడం సాధ్యమా అంటే లేదనే చెప్పాలి.

మరి మనం ఇలా నష్ట్పోవాల్సిన్దేనా ?. . . . . . . . అవసరం లేదు. . . . . . . విద్యుత్తుకు ఉన్న ఒక గొప్ప గుణం వాళ్ళ మనం ఇది సాధించావచ్చు. అది సరియైన సామర్థ్యం ఉన్న కెపాసిటర్ ని ఆ మోటారుకు గాని అన్ని మోటార్లకు కలిపి గాని అమర్చడమే. ఇలా అమర్చడం ద్వారా దాదాపుగా 1. 0 PFని మనం సాదినచవచ్చ్చు. తద్వారా ఈ కనిపించని నష్టాల నుండి బయట పడవచ్చు.

ఎంత కెపాసిటర్ అనేది ఎలా తెలుస్తుంది?. . . . . . . . . విద్యుత్తు శాఖ వారి అంచానాల ప్రకారం ప్రతి 3HP మోటారుకు 1KVAR కెపాసిటర్ ని బిగించాల్సి ఉంటుంది. కాని ఇలా బిగించి దీన్ని సాధించిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఈ విషయంలో డక్కా మొక్కీలు తిన్న వినియోగదారుల అనుభవాల ప్రకారం ప్రతి 3 మోటారుకు 2KVAR కెపాసిటర్ ని బిగిస్తేనే ఇది సాధ్యమని రుజువయ్యింది. మరి ఇలా అదనంగా బిగించడం వల్ల బిల్లు పెరిగే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే కావాల్సిన సామర్థ్యం కంటే ఎక్కువ బిగించినా PF 1. 0 కంటే ఎక్కువ రికార్దయ్యే అవకాశం లేదు. అలా అని మన మోటార్లు నడవనప్పుడు కెపాసిటర్లని ఆన్ చేసి ఉంచడం మంచిది కాదు. దాని చార్జింగ్ కరెంటు వల్ల బిల్లు పెరిగుతుంది.

ఐతే. . . . . ప్రత్యేక ట్రాన్సుఫారం ఉండి 50HP కంటే ఎక్కువ లోడు ఉన్న వినియోగదారులు అనుసరించాల్సిన విధానం వేరుగా ఉంటుంది. వీరు ప్రతి 3 మోటారుకు 2KVAR కెపాసిటర్ కి తోపాటు ప్రతి 100KVA కెపాసిటి ఉన్న ట్రాన్సుఫారానికి 15KVAR కెపాసిటర్ని అదనంగా అమర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రాన్సుఫారంకూడా ఒక మోటారు లాంటిదే. ట్రాన్సుఫారం ఎల్లప్పుడూ సర్వీసులో ఉంటుంది కనుక దానికి అమర్చే కెపాసిటర్ కూడా ఎల్లప్పుడూ సర్వీసులో ఉండాల్సిందే. అందుకే వీటిని మాత్రం మెయిన్ స్విచ్చ్చుకు ముందే అమర్చాలి. మోటర్ల కొరకు అమర్చే కెపాసిటర్లు అవి నడచి నప్పుడే సర్వీసులో ఉండే విధంగా మెయిన్ స్విచ్చ్చుకు తర్వాత ఉండాలి. ఎందుకంటే వీటి చార్జింగ్ కొరకు కొంత విద్యుత్తు వృధా అవుతుంది.

అన్నీ బాగున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు కొన్ని కెపాసిటర్లు ఉత్సవ విగ్రహాల్ల ఉంటాయి కాని పని చేయవు. మరి ఒక కేపాసిటర్ పనిచేస్తున్నది లేనిది తెలిసేదెలా?. . . . . . . . . . ఒక 10KVAR కెపాసిటర్ మంచిగా పనిచేస్తుంది అంటే అది దాదాపుగా 13 ఆంపియర్ల కరెంటు తీసుకుంటుంది. అంతకంటే తగ్గిందంటే దాని సామర్థ్యం తగ్గినట్లే. అలా ఒక 10KVAR కెపాసిటరును 10 ఆంపియర్ల కరెంటు తీసుకొనే వరకు వాద్వాచ్చ్చు. అంతకన్నా తగ్గితే మాత్రం అది ఒక్క తీగలో అయినా సరే తప్పని సరిగా మార్చాల్సిందే.

మరి ఈ కరెంటును కొలిచేదే లా?. . . . . . . . . ప్రతి కరెంటు వస్తువులమ్మే షాపులో “క్లాంపు మీటర్లు” అని దొరుకుతాయి. దీన్ని బ్రోటన వ్రేలు చూపుడు వ్రేలు కలిపినట్లు వైరు చుట్టూ పెట్టడం ద్వారా నేరుగా విద్యుత్తు వైరును తాకకుండానే అందులో ప్రవహించే కరెంటును కొలవచ్చ్చు. దీని ధర కూడా రూ.400 నుండి రూ.1000 వరకు ఉంటాయి. ఇక కేపాసిటర్లయితే కంపెనీని బట్టి ప్రతి KVAR కు రూ. 700నుండి రూ.1300 వరకు ఉంటాయి.

సరైన కేపాసిటరుని వాడకం ఉన్న వేళల్లో వినియోగించడం ద్వారా కనిపించని సర్ చార్జి నుండి అధిక బిల్లుల నుండి బయట పడవచ్చ్చు. ఈ విషయం అర్థం చేసుకోఅవడమే కాదు ఇతరులకి అర్థమయ్యేలా చెప్పి అందరూ లబ్ధి పొందడి. ఈ విషయంలో మరిన్ని సలహాలకు, సందేహాలకు హెల్ప్ డెస్క్ /కు వ్రాయండి. మా నిపుణులు మీకు సలహాలు ఇస్తారు. అత్యవసరమయితే మాత్రం 9550215017 కి ఫోన్ చేయండి.