"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కె.రాఘవ

From tewiki
Jump to navigation Jump to search
కె. రాఘవ
200px
కె. రాఘవ
జననం
కోటిపల్లి రాఘవ

(1913-12-09)డిసెంబరు 9, 1913
మరణంజులై 31, 2018(2018-07-31) (వయస్సు 104)[1]
హైదరాబాదు
మరణ కారణంగుండెపోటు
వృత్తితెలుగు సినీనిర్మాత, స్టంట్ మాస్టర్, నటుడు
ఉద్యోగంప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
సురరిచితుడురఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత
జీవిత భాగస్వాములుహంసారాణి
పిల్లలుప్రశాంతి, ప్రతాప్‌మోహన్
తల్లిదండ్రులు
 • నారాయణస్వామి (తండ్రి)
 • నాగమ్మ (తల్లి)

కె. రాఘవ ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత.[2] మూకీ చిత్రాలనుండి సుమారు తొంభై ఏళ్లకు పైగా సినిమా రంగంతో మమేకమైన వ్యక్తి. ట్రాలీ తోసే కార్మికుడిగా జీవితం ప్రారంభించి నిర్మాతగా ఎదిగాడు. ప్రతాప్ ఆర్ట్స్ అనే సంస్థ పేరుమీదు చిత్రాలు నిర్మించాడు. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ ఈ సంస్థ ద్వారానే దర్శకులుగా పరిచయమయ్యారు.

విశేషాలు

రాఘవ కాకినాడ సమీపంలోని కోటిపల్లి[3] అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో 1913, డిసెంబరు 9న జన్మించాడు[4]. నాగమ్మ, నారాయణస్వామి ఇతని తల్లిదండ్రులు. ఈయన ఎనిమిదేళ్ళ వయసులో ఇంటిలో నుండి పారిపోయి కలకత్తాలో ఈస్టిండియా ఫిలిం కంపెనీలో ట్రాలీ పుల్లర్‌గా చేరాడు.[4] అలా ట్రాలీ బాయ్ గా ఆయన పనిచేసిన మొదటి చిత్రం ప్రహ్లాద.

మూడేళ్ళ తరువాత నిర్మాత మోతీలాల్ చమ్రియా వద్ద సహాయకుడిగా, కస్తూరి శివరావు వద్ద సహాయకుడిగా, రఘుపతి వెంకయ్య నాయుడు వద్ద ఆఫీస్ బాయ్‌గా, టంగుటూరి ప్రకాశంవద్ద క్లీనర్‌గా, మిర్జాపురం రాజావారి శోభనాచల స్టూడియోలో ఫిలిం డెవలపర్‌గా, సి.పుల్లయ్య వద్ద ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటులో ఇలా పలుచోట్ల పలురకాల పనిచేశాడు. జెమినీ స్టూడియోస్ నిర్మించిన సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేశాడు. పాతాళ భైరవి, రాజు పేద సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేశాడు[3]. ఎం. జి. ఎం. స్టూడియో వాళ్ళు 'టార్జాన్ గోస్ ఇండియా' ఆంగ్ల చిత్రం తీస్తూ ఎక్కువ భాషలు తెలిసిన ప్రొడక్షన్ మేనేజర్‌ కోసం వెదికి ఏడు భాషలు తెలిసిన ఇతడిని ఆ ఉద్యోగంలో నియమించారు.[3] ఈ సినిమా నిర్మాణం కోసం ఆయన రోమ్‌ నగరానికి కూడా వెళ్లే అవకాశం చిక్కింది. ఈ చిత్రం ద్వారా ఇతడు 20వేల డాలర్లు పారితోషికం పొందాడు. ఈయన 2018, జూలై 31వ తేదీ తెల్లవారు ఝామున హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 105వ యేట గుండెపోటుతో మరణించాడు.[5].

చిత్ర నిర్మాణం

రోమ్‌లో ఉన్నప్పుడు ఇతడు చూసిన ఇంగ్లీషు సినిమాల ప్రేరణతో తెలుగులో సినిమాలు తీయాలనే కోరిక కలిగింది. చేతిలో 20 వేల డాలర్లు ఉండడంతో ఏకాంబరేశ్వరరావు, సూర్యచంద్ర అనే మరో ఇద్దరు భాగస్వాములతో ఫల్గుణ ఫిలిమ్స్ సంస్థను నెలకొల్పి జగత్ కిలాడీలు అనే సినిమాను నిర్మించాడు.[3] ఆ సినిమా విజయవంతం కావడంతో జగత్ జెట్టీలు, జగత్ జెంత్రీలు నిర్మించాడు. తరువాత ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి దాసరి నారాయణరావును దర్శకునిగా పరిచయం చేస్తూ తాత మనవడు చిత్రాన్ని నిర్మించాడు. ఇతడు ఇంకా కోడి రామకృష్ణను, రచయిత రాజశ్రీని, గుహనాథన్‌, కె.ఆదిత్య, కొమ్మినేని కృష్ణమూర్తి, బందెల ఈశ్వరరావులను దర్శకులుగా సినిమాలలో తొలి అవకాశం ఇచ్చాడు.[4]

చిత్రసమాహారం

నిర్మాతగా

 1. సుఖదుఃఖాలు (భాగస్వామి)
 2. జగత్ కిలాడీలు
 3. జగత్ జెట్టీలు
 4. జగత్ జెంత్రీలు
 5. తాత మనవడు
 6. సంసారం-సాగరం
 7. తూర్పు పడమర
 8. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
 9. తరంగిణి
 10. సూర్యచంద్రులు
 11. చదువు సంస్కారం
 12. అంతులేని వింతకథ
 13. త్రివేణి సంగమం
 14. ఈ ప్రశ్నకు బదులేది
 15. యుగకర్తలు
 16. అంకితం

నటుడిగా

 1. బాలనాగమ్మ
 2. చంద్రలేఖ

స్టంట్ మాస్టర్‌గా

 1. పల్నాటి యుద్ధం
 2. పాతాళ భైరవి
 3. రాజు పేద

ప్రొడక్షన్ మేనేజర్‌గా

 1. కీలుగుర్రం
 2. టార్జాన్ గోస్ ఇండియా - ఆంగ్లచిత్రం
 3. వీరపాండ్య కట్టబొమ్మన్ - తమిళచిత్రం
 4. భలే పాండ్య - తమిళచిత్రం
 5. దిల్ తేరా దీవానా - హిందీ చిత్రం

కుటుంబం

రాఘవ పాండిచ్చేరికి చెందిన నిర్మాత ఎం. కె. రాధా చెల్లెలు హంసారాణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రశాంతి అనే కూతురు, ప్రతాప్‌మోహన్ అనే కుమారుడు ఉన్నారు[4].

మూలాలు

 1. ప్రముఖ నిర్మాత కె. రాఘవ గుండెపోటుతో మృతి - నమస్తే తెలంగాణా
 2. "ప్రతాప్ ఆర్ట్స్ కె. రాఘవ ఇక లేరు!". eenadu.net. ఈనాడు. 1 August 2018. Archived from the original on 1 August 2018. Retrieved 1 August 2018.
 3. 3.0 3.1 3.2 3.3 వినాయకరావు (1 September 2010). "ఫోజు కొట్టే ఆర్టిస్టులు, దర్శకులు అక్కర్లేదనుకున్నాను - రాఘవ (ప్రముఖ నిర్మాత)". నవ్య వీక్లీ: 7–10. Retrieved 6 February 2018.
 4. 4.0 4.1 4.2 4.3 రాజిరెడ్డి (4 March 2012). "పారిపోయిన పిల్లాడు". సాక్షి ఫన్‌డే. |access-date= requires |url= (help)
 5. సినీ నిర్మాత కె.రాఘవ కన్నుమూత

బయటిలింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).