కె.సదాశివరెడ్డి

From tewiki
Jump to navigation Jump to search

కె. సదాశివరెడ్డి (మ. ఫిబ్రవరి 6, 2016) మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు. ఆయన 1994 నుంచి 1999 వరకు సంగారెడ్డి(టీడీపీ) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

జీవిత విశేషాలు

ఆయన 1981 నుంచి 1986 వరకు పటాన్‌చెరు సమితికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుంచి 1990 వరకు సహకార సంఘం అధ్యక్షుడిగా రైతులకు సేవలందించారు. 1970 నుంచి 1981 వరకు పటాన్‌చెరు సర్పంచ్‌గా ఉన్నారు.[1] 1994 నుంచి 1999 వరకు సంగారెడ్డి(టీడీపీ) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో పటాన్‌చెరు నియోజకవర్గమంతా సంగారెడ్డిలో ఉండేది. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌గా ఉన్న పి.రామచంద్రారెడ్డిపై సదాశివరెడ్డి అత్యధిక మెజార్టితో గెలుపొంది రికార్డు సాధించారు.[2]

అప్పటి ప్రభుత్వం ఆయన్ను ఏపీఐఐసీ, ఏపీఐడీసీ డెరైక్టర్ పదవుల్లో నియమించింది. అలాగే ఆయన హుడా సభ్యుడిగా హైదరాబాద్ అభివృద్ధి కోసం సేవలందించారు. ఆ తర్వాత నుంచి పటాన్‌చెరులోనే తన సొంతింట్లో కుటుంబ సభ్యులతోపాటు ఉంటున్నారు.

మరణం

ఫిబ్రవరి 6, 2016 మధ్యాహ్నం సదాశివరెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన మదీనగూడలోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.[3]

మూలాలు

  1. "మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి కన్నుమూత". సాక్షి. 7 February 2016. Retrieved 7 February 2016.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1994". http://www.elections.in/. Retrieved 7 February 2016. External link in |website= (help)
  3. "మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సదాశివరెడ్డి ఇక లేరు". Archived from the original on 2016-02-09. Retrieved 2016-02-07.

ఇతర లింకులు