"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కేంద్రపాలిత ప్రాంతం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
భారతదేశంలో ఒక ప్రాంతం. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించబదుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకున్న హక్కులు, అధికారాలు లేవు. దేశమంతటిలో విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వము గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వముచే పాలించవల్సి వచ్చిన ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా యేర్పరిచారు. అలాగే జమ్మూ కాశ్మీర్ కి శాసనసభ ఉన్నప్పటికీ ఇంకా ఎన్నికలు జరగలేదు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రులుగా ఒమర్ అబ్దుల్లా ( కొడుకు) ఫరూక్ అబ్దుల్లా (తండ్రి), మెహబూబా ముక్తి ఉన్నారు. ( వీళ్ళందరూ కాశ్మీరీ పార్టీల నేతలు)
కేంద్ర ప్రభుత్వం ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తుంది. ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసనసభలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో ముఖ్య మంత్రి పదవి కూడా వుంటుంది. అరవింద్ కేజ్రీవాల్ (అప్ (AAP) ) ఢిల్లీ ముఖ్యమంత్రిగా, నారాయణస్వామి (కాంగ్రెస్ (INC) ) పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు
2019 నాటికి భారతదేశంలో 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుత జాబితా:
- అండమాన్ నికోబార్ దీవులు - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
- చండీగఢ్ - పంజాబ్, హర్యానాల మధ్య ఎవరికి చెందాలనే వివాదముతో కేంద్రపాలిత ప్రాంతమయ్యింది. పంజాబ్ ఒడంబడిక ప్రకారం దీనిని పంజాబ్ కు ఇవ్వడం జరిగింది కానీ, బదిలీ ఇంకా పూర్తవలేదు. అంతదాకా కేంద్రపాలిత ప్రాంతంగానే కొన్సాగుతుంది
- దాద్రా, నగర్ హవేలీ - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
- డామన్, డయ్యూ - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
- లక్షదీవులు - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
- ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం - జాతీయ రాజధాని ప్రాంతం
- పాండిచ్చేరి - ఫ్రెంచి సాంస్కృతిక వారసత్వం. ఈ కేంద్రపాలిత ప్రాంతం మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉంది.అవి తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రం, కేరళ.
రాజ్యాంగ ప్రకారం ఢిల్లీ 1991 నుంచి "జాతీయ రాజధాని ప్రాంతం" హోదా కలిగి ఉంది, కానీ వ్యావహారికంగా ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించవచ్చు. 2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి ఉంది అవి ఒకటి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 2019 అక్టోబరు 31 నుంచి ఉనికిలోకి వచ్చాయి.
అలాగే డామన్ డయ్యు, దాద్రా, నాగర్ హవేలీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అలాగే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి జమ్ము, శ్రీనగర్ రాజధానులుగా, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతంకి లేహ్ రాజధానిగా, అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతానికి ఫోర్ట్ బ్లెయర్, లక్షా దీవులకు కరావట్టి రాజధానిగా, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి పాండిచ్చేరి ఢిల్లీ న్యూఢిల్లీ రాజధానిగా దాద్రా నగర్ హవేలీకి దాద్రా అలాగే డామన్ డయ్యుకు సిల్వర్స రాజధానులుగా కొనసాగుతున్నాయి.
గణాంకాలు
సంఖ్య | కేంద్రపాలిత ప్రాంతం | రాజధాని | విస్తీర్ణం (చ.కి.మీ) |
జనాభా 2001 |
జనసాంద్రత 2001 |
అక్షరాస్యత (%) 2001 |
ప్రధానభాషలు |
---|---|---|---|---|---|---|---|
1 | అండమాన్ నికోబార్ దీవులు | పోర్ట్ బ్లెయిర్ | 8, 249 | 356, 152 | 43 | 81.18 | హిందీ |
2 | చండీగఢ్ | చండీగఢ్ | 144 | 9, 00, 635 | 7, 900 | 81.76 | హిందీ, పంజాబీ |
3 | దాద్రా, నగర్ హవేలీ | సిల్వాస్సా | 491 | 220, 490 | 491 | 60.03 | గుజరాతీ, హిందీ |
4 | డామన్ డయ్యు | డామన్ | 122 | 158, 204 | 1, 411 | 81.09 | గుజరాతీ |
5 | ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం | ఢిల్లీ | 1, 483 | 13, 850, 507 | 9, 294 | 81.82 | హిందీ |
6 | లక్షదీవులు | కవరత్తి | 32 | 60, 650 | 1, 894 | 87.52 | మలయాళం |
7 | పాండిచ్చేరి | పాండిచ్చేరి | 492 | 9, 74, 345 | 2, 029 | 81.49 | తమిళం |