కేంద్ర నిఘా సంస్థ

From tewiki
Jump to navigation Jump to search
సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజన్సీ
Seal of the Central Intelligence Agency.svg
Official Seal of the CIA
సంస్థ వివరాలు
స్థాపన సెప్టెంబర్ 18, 1947
Preceding agency Central Intelligence Group
ప్రధానకార్యాలయం Langley, Virginia United States 38°57′06″N 77°08′48″W / 38.951796°N 77.146586°W / 38.951796; -77.146586
ఉద్యోగులు Classified[1]

20,000 estimated[2]

వార్షిక బడ్జెట్ Classified[3][4]

$27 billion in 1998[1]

కార్యనిర్వాహకులు Leon Panetta, Director
Stephen Kappes, Deputy Director
Stephanie O`Sullivan, Associate Deputy Director
వెబ్‌సైటు
www.cia.gov
CIA ప్రధాన కార్యాలయం యొక్క ప్రవేశద్వారం

కేంద్ర నిఘా సంస్థ (CIA ) అనేది అమెరికా సంయుక్తరాష్ట్రాల ప్రభుత్వమునకు చెందిన ఒక పౌర నిఘా సంస్థ. అమెరికా సంయుక్తరాష్ట్రాల సీనియర్ విధాన రూపకర్తలకు జాతీయ భద్రతకు సంబంధించిన గూఢ సమాచారమును ఇది అందిస్తుంది. అంతేకాక అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడి వినతిని అనుసరించి రహస్య కార్యకలాపాలను కూడా CIA చేపడుతుంది.[5]

అమెరికా సంయుక్తరాష్ట్రాల సైన్యంలోని విభాగాల్లో గూఢచర్య కార్యకలాపాలను సమన్వయ పరచడానికి ప్రపంచ యుద్ధం II సమయంలో ఏర్పాటు చేసిన వ్యూహాత్మక సేవల కార్యాలయం(OSS) తర్వాత ఇది అవతరించింది. 1947 జాతీయ భద్రతా చట్టం ద్వారా CIA ఏర్పాటు చేయబడింది. "స్వదేశంలో గానీ లేదా విదేశంలో గానీ పోలీసు లేదా చట్టపరమైన (బలవంతపు) అమలు కార్యక్రమాలు చేపట్టకుండా" దీనిని తొలుత నియంత్రించారు. ఏడాది తర్వాత, ఈ ఆదేశాన్ని[clarification needed] "విద్రోహ, విద్రోహ వ్యతిరేక, కూల్చివేత మరియు (జనాల) తరలింపు చర్యలు.....కూలదోయడం [మరియు] గూఢ ప్రతిఘటన ఉద్యమాలు, గెరిల్లాలు మరియు శరణార్థ విమోచన ఉద్యమాలను చేర్చే విధంగా విస్తరించడం జరిగింది. అలాగే స్వేచ్ఛా ప్రపంచంలోని బెదిరింపులకు గురయ్యే దేశాల్లో గూఢచార కమ్యూనిస్ట్ వ్యతిరేక కార్యకలాపాలకు సాయపడే విధంగా కూడా".[6]

CIA యొక్క ప్రాథమిక విధి విదేశీ ప్రభుత్వాల, కార్పొరేషన్‌ల మరియు వ్యక్తులకు సంబంధించిన సమచారాన్ని సేకరించడం. అలాగే ప్రభుత్వ విధాన రూపకర్తలకు సలహాలు అందించడం. ఈ సంస్థ రహస్య కార్యకలాపాలు మరియు పారామిలిటరీ (సైనికదళం) చర్యలు చేపడుతుంది. అలాగే తన యొక్క ప్రత్యేక కార్యకలాపాల విభాగం ద్వారా విదేశీ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తుంది. CIA మరియు దాని బాధ్యతలు 2004లో చెప్పుకోదగ్గ విధంగా మార్పు చెందాయి. డిసెంబరు, 2004 ముందు CIA అనేది US ప్రభుత్వం యొక్క ప్రధాన గూఢచార సంస్థగా ఉండేది. అది తన యొక్క సొంత కార్యకలాపాలను సమన్వయపరుచుకోవడం మరియు పరిశీలించడమే కాక US నిఘా వర్గం (IC) కార్యకలాపాలను కూడా చూసుకునేది. గూఢచార సంస్కరణ మరియు తీవ్రవాద నిరోధక చట్టం 2004 ద్వారా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌ (DNI) కార్యాలయం ఏర్పాటైంది. ఇది కొన్ని ప్రభుత్వ మరియు IC-సంబంధిత కార్యకలాపాలను స్వీకరించింది. ICని మరియు తద్వారా గూఢచార చక్రం నిర్వహణను DNI చేపట్టింది. DNIకి బదిలీయైన కార్యకలాపాల్లో 16 IC సంస్థల యొక్క సంఘటిత అభిప్రాయ అంచనాలను సిద్ధం చేయడం మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాల అధ్యక్షుడు కోసం పలు విషయాలకు సంబంధించి అధికారపత్రాలను తయారు చేయడం వంటివి ఉన్నాయి.

ఇతర దేశాలు, నిఘా సంస్థలతో పాటు CIA నేడు సాధారణంగా పలు కార్యకలాపాలను ఇప్పటికీ నిర్వహిస్తోంది. విదేశీ గూఢచార సంస్థలతో సంబంధాలను చూడండి. CIA ప్రధాన కార్యాలయం పొటోమాక్ నది వెంట వాషింగ్టన్, D.C.కి పశ్చిమంగా కొన్ని మైళ్ల దూరంలో అంటే వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ,[7]లో అంతర్భూతం చేయని లాంగ్లీలోని మెక్‌లీన్‌లో ఉంది.

CIA అనేది కొన్ని సందర్భాల్లో ఆక్షేపించలేని విధంగా ప్రభుత్వ మరియు సైనిక పరిభాషలో ఇతర ప్రభుత్వ సంస్థలు (OGA )గా పేర్కొనబడుతుంది. ప్రత్యేకించి, దాని కార్యకలాపాలు ఒక నిర్దుష్ట ప్రాంతంలో బహిరంగ రహస్యమైనప్పుడు.[8][9] దానిని పిలవడానికి వాడే ఇతర పదాలు ది కంపెనీ [10][11][12][13], మరియు ది ఏజెన్సీ .

Contents

సంస్థ

CIA ప్రస్తుతం ఒక కార్యనిర్వాహక కార్యాలయం మరియు వివిధ సంస్థ వారీ కార్యకలాపాలు మరియు నాలుగు అతిపెద్ద డైరెక్టరేట్లను కలిగి ఉంది.

 • డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌ అనేది అన్ని రకాల గూఢచార పరిశోధన మరియు విశ్లేషణకు బాధ్యత వహిస్తుంది.
 • నేషనల్ క్లాండిస్టైన్ సర్వీస్ (జాతీయ ప్రచ్ఛన్న సేవ) గతంలో డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్‌గా పిలవబడేది. ఇది ప్రచ్ఛన్న గూఢచార సమాచార సేకరణ మరియు రహస్య కార్యకలాపాలను చేపడుతుంది.
 • డైరెక్టరేట్ ఆఫ్ సపోర్ట్
 • డైరెక్టరేట్ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ

బడ్జెట్

US గూఢచార బడ్జెట్‌ మొత్తాన్ని ఇటీవలే వర్గీకరించడం జరిగింది. సాధారణ సమాచార[14] సేకరణకు అసంఖ్యాక ప్రయత్నాలు జరిగాయి మరియు అప్రయత్నంగా పలు బహిర్గతాలు[15] కూడా జరిగాయి. ఉదాహరణకు, CIA మాజీ మహిళా అధికారి మరియు 2005లో సమాచార సేకరణ కోసం నియమించిన నేషనల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్‌యైన మేరీ మార్గరెట్ గ్రహం వార్షిక నిఘా బడ్జెట్ $44 బిలియన్లు అని ప్రకటించడం.

కార్యనిర్వాహక సంస్థ

డైరెక్టర్ ఆఫ్ ది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (D/CIA) నేరుగా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌ (DNI)కు సమాచారాన్ని నివేదిస్తుంది. ఆచరణాత్మకంగా, అతను/ఆమె DNI, కాంగ్రెస్ (సాధారణంగా ఆఫీస్ ఆఫ్ కాంగ్రెసనల్ ఎఫైర్స్) మరియు వైట్ హౌస్ (శ్వేత సౌధం)తో సంప్రదింపులు జరుపుతాడు. డిప్యూటీ డైరెక్టర్ మాత్రం అంతర్గత కార్యనిర్వాహకుడి పాత్ర పోషిస్తాడు. CIAపై కాంగ్రెస్ (అమెరికా కాంగ్రెస్) విచారణ అనేది ప్రధానంగా సలహా పాత్రే అయినప్పటికీ, అధికంగా ఉంటుంది.[citation needed]

US సైనికదళంకు CIA మద్దతును కార్యనిర్వాహక కార్యాలయం తాను సేకరించిన సమాచారం మరియు సైనిక గూఢచార సంస్థల ద్వారా సమాచారాన్ని సేకరించడం ద్వారా సులభతరం చేస్తుంది. అలాగే క్షేత్ర కార్యకలాపాల్లోనూ సహకారం అందిస్తుంది. ఇద్దరు సీనియర్ కార్యనిర్వాహకులు బాధ్యత కలిగి ఉంటారు. వారిలో ఒకరు CIA-వ్యాప్తంగా మరియు మరొకరు నేషనల్ క్లాండెస్టైన్ సర్వీస్‌ బాధ్యత చూసుకుంటాడు. సీనియర్ సైనికాధికారియైన మిలిటరీ సపోర్ట్ అసోసియేట్ డైరెక్టర్ CIA మరియు యూనిఫైడ్ కాంబేటెంట్ కమాండ్ల మధ్య సంబంధాన్ని నిర్వహిస్తాడు. అవి ప్రాంతీయ/కార్యకలాపాల గూఢచార సమాచారాన్ని అందించడం మరియు జాతీయ గూఢచారాన్ని వినియోగిస్తాయి. అన్ని సైనిన విభాగాలకు సహకారం అందించడంలో అతనికి సైనిక వ్యవహారాల కార్యాలయం సాయపడుతుంది.[16]

ఇక జాతీయ రహస్య కార్యకలాపాల విషయానికొస్తే, సైనిక వ్యవహారాల[17]కు సంబంధించిన ఒక అసోసియేట్ డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఆపరేషన్స్ ప్రత్యేకమైన క్లాండెస్టైన్ హ్యూమన్-సోర్స్ ఇంటెలిజెన్స్‌ను చూసుకుంటాడు. అలాగే సైనిక చర్యల సాయంతో రహస్య చర్యకు ఉపక్రమిస్తాడు.

అంతేకాక జాతీయస్థాయి నిఘా సమాచారాన్ని వ్యూహాత్మక సంస్థలకు సాధారణంగా వాటి సకల వనరు నిఘా గ్రూపుకు అందుబాటులో ఉండే విధంగా CIA చేస్తుంది.[18]

కార్యనిర్వాహక సిబ్బంది

వివిధ సాధారణ బాధ్యతలు కలిగిన సిబ్బంది కార్యాలయాలు కార్యనిర్వాహక కార్యాలయానికి సమాచారాన్ని నివేదిస్తాయి.అంతేకాక సేకరించిన సమాచారాన్ని సిబ్బంది కార్యనిర్వాహక కార్యాలయానికి పంపుతుంది.

సాధారణ ప్రచురణలు

CIAకి చెందిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇంటెలిజెన్స్‌ సంస్థ యొక్క చారిత్రక పుస్తకసామగ్రి నిర్వహణ మరియు గూఢచార అధ్యయనాన్ని ఒక చట్టబద్ధమైన విభాగంగా ప్రచారం చేస్తోంది.[19]

2002లో CIA యొక్క షెర్మాన్ కెంట్‌ స్కూల్ ఫర్ ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్‌ వర్గీకరించని కెంట్ సెంటర్ అకేషనల్ పేపర్స్‌ను ముద్రించడం ప్రారంభించింది. "గూఢచార విశ్లేషణ సిద్ధాంతం మరియు సాధనపై చర్చ మరియు దానిని విస్తరించే దిశగా గూఢచార నిపుణులు మరియు ఆసక్తి ఉన్న సహోద్యోగులకు అవకాశం కల్పించడం దీని ప్రధానోద్దేశ్యం."[20]

సాధారణ మండలి మరియు విచారణ

చట్టబద్ధత మరియు కచ్చితమైన కార్యకలాపాలపై రెండు కార్యాలయాలు డైరెక్టర్‌కు సలహా ఇస్తాయి. సాధారణ మండలి కార్యాలయం CIA డైరెక్టర్‌‌గా అతని పాత్రకు సంబంధించిన అన్ని రకాల చట్టపరమైన విషయాలపై CIA డైరెక్టర్‌కు సలహాలిస్తుంది. అది CIA చట్టపరమైన మండలికి ప్రధాన వనరు.

ఆఫీస్ ఆఫ్ ఇన్స్‌పెక్టర్ జనరల్‌ సంస్థ పాలనా కార్యకలాపాల్లో సమర్థత, చురుకుదనం మరియు జవాబుదారీతనాన్ని నింపుతుంది. అలాగే మోసం, వృథా, దూషణ మరియు తప్పుడు నిర్వహణను గుర్తించడం మరియు అరికట్టడం చేస్తుంది. ఇన్స్‌పెక్టర్ జనరల్ యొక్క కార్యకలాపాలు సంస్థలోని ఇతర విభాగాల కంటే స్వతంత్రంగా ఉంటాయి. అతను సంస్థకు సంబంధించిన సమాచారాన్ని CIA డైరెక్టర్‌కు నేరుగా నివేదిస్తాడు.[21][22]

ప్రజా సంబంధాలు

CIA డైరెక్టర్‌కు అన్ని రకాల ప్రసార మాధ్యమాలు, ప్రజా విధానం మరియు అతని పాత్రకు సంబంధించిన ఉద్యోగుల సమాచారాలపై ప్రజా సంబంధాల కార్యాలయం సలహా ఇస్తుంది. వినోద పరిశ్రమతో కలిసి పనిచేయడం కూడా ఈ కార్యాలయం కార్యకలాపాల్లో ఒకటి.[citation needed]

డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్

డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌ అనేది కీలకమైన విదేశీ వివాదాలకు సంబంధించిన అన్ని వనరుల గూఢచార విశ్లేషణ ఇస్తుంది.[23] ఇది నాలుగు ప్రాంతీయ విశ్లేషణ గ్రూపులు, బహుళజాతి సమస్యలపై ఆరు గ్రూపులు మరియు రెండు సహాయక విభాగాలను కలిగి ఉంది.[24]

ప్రాంతీయ గ్రూపులు

ఇరాక్‌ సమస్యలకు పూర్తిగా అంకితమైన ఒక కార్యాలయం ఉంది. అలాగే ప్రాంతీయ విశ్లేషణ కార్యాలయాలు దిగువ పేర్కొనబడినవి:

బహుళజాతి గ్రూపులు

ఆఫీస్ ఆఫ్ టెర్రరిజం ఎనాలిసిస్‌ [25] అనేది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలోని తీవ్రవాద నిరోధక కేంద్రానికి సాయమందిస్తుంది. CIA బహుళజాతి తీవ్రవాద నిరోధక కార్యకలాపాలను వీక్షించండి.

ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్‌నేషనల్ ఇష్యూస్ [26] (బహుళజాతి సమస్యల కార్యాలయం) US జాతీయ భద్రతకు ప్రస్తుతం గుర్తించిన మరియు భవిష్యత్ ముప్పును అంచనా వేస్తుంది. తలపండిన విధాన రూపకర్తలు, సైనిక వ్యూహకర్తలు మరియు చట్టపరమైన అమలుకు విశ్లేషణ, హెచ్చరిక మరియు సంక్షోభ సాయాన్ని అందిస్తుంది.

CIA క్రైమ్ అండ్ నార్కోటిక్స్ సెంటర్‌ [27] (CIA నేర మరియు మాదకద్రవ్యాల కేంద్రం) అనేది విధాన రూపకర్తలు మరియు చట్టాన్ని అమలు చేసే వర్గానికి అవసరమైన అంతర్జాతీయ నేరానికి సంబంధించిన సమాచారంపై పరిశోధన చేస్తుంది. CIAకు చట్టపరమైన దేశీయ విధాన సంస్థ లేకపోవడంతో అది సాధారణంగా తన యొక్క విశ్లేషణను FBI మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాల న్యాయ శాఖకు చెందిన డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఇతర చట్ట అమలు సంస్థలకు పంపుతుంది.

వెపన్స్ ఇంటెలిజెన్స్‌ (ఆయుధాల గూఢచర్యం), నాన్‌ప్రొలిఫెరేషన్‌ (అణ్వస్త్రవ్యాప్తి నిరోధక) అండ్ ఆర్మ్స్ కంట్రోల్ సెంటర్ (ఆయుధాల నియంత్రణ కేంద్రం) [28] అనేది జాతీయ మరియు జాతీయేతర ముప్పులకు సంబంధించి అవసరమైన గూఢచార సహకారాన్ని అందిస్తుంది. అలాగే ముప్పు తగ్గింపు మరియు ఆయుధాల నియంత్రణకు కూడా సాయపడుతుంది. జాతీయ సాంకేతిక పరిశీలన/0} ద్వారా ఫలితం పొందుతుంది.

కౌంటర్‌ఇంటెలిజెన్స్ సెంటర్ ఎనాలిసిస్ గ్రూప్ [29] (నిఘా కార్యకలాపాల కేంద్ర విశ్లేషణ బృందం) అనేది US ప్రభుత్వ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే జాతీయ మరియు జాతీయేతర విదేశీ గూఢచార సంస్థల ప్రయత్నాలను గుర్తించడం, పర్యవేక్షించడం మరియు విశ్లేషిస్తుంది. ఇది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌కు చెందిన నేషనల్ కౌంటర్‌ఇంటెలిజెన్స్ ఎగ్జిక్యూటివ్ యొక్క FBI అధికారులతో కలిసి పనిచేస్తుంది.

ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ సెంటర్ ఎనాలిసిస్ గ్రూప్‌ [30] (సమాచార కార్యకలాపాల కేంద్ర విశ్లేషణ బృందం) అనేది US కంప్యూటర్ వ్యవస్థ యొక్క ప్రమాదాలపై దృష్టి సారిస్తుంది. ఈ విభాగం DNI కార్యకలాపాలకు సాయపడుతుంది.

సహాయక మరియు సాధారణ విభాగాలు

ఆఫీస్ ఆఫ్ కలెక్షన్ స్ట్రాటజీస్ అండ్ ఎనాలిసిస్‌ (సేకరణ వ్యూహాలు మరియు విశ్లేషణ కార్యాలయం) అనేది నిపుణులైన నిఘా అధికారులను డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సీనియర్ ఏజెన్సీ మరియు నిఘా వర్గ అధికారులు మరియు కీలక జాతీయ విధాన రూపకర్తలకు పంపుతుంది.

ఆఫీస్ ఆఫ్ పాలసీ సపోర్ట్‌ (విధాన మద్దతు కార్యాలయం) డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విశ్లేషణకు అవసరమైన మార్పులు చేసి, దానిని భిన్నమైన విధాన, చట్ట అమలు, సైనిక మరియు విదేశీ అక్రమసంబంధ గ్రహీతలకు సమర్పిస్తుంది.

నేషనల్ క్లాండెస్టైన్ సర్వీస్

2004లో సంస్థకు అత్యంత ముఖ్యమైనదిగా భావించే US హ్యూమన్ ఇంటెలిజెన్స్ మొత్తం బాధ్యతను CIAకి అప్పగించారు.[citation needed] తర్వాత నేషనల్ క్లాండెస్టైన్ సర్వీస్‌ (NCS; గతంలో డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్‌) అనేది విదేశీ గూఢచార సమాచారాన్ని ప్రధానంగా రహస్య HUMINT వనరుల నుంచి మరియు రహస్య కార్యకలాపాలు చేపడుతుంది. కొత్తగా వచ్చిన పేరు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ HUMINT అసెట్స్ నుంచి వచ్చినదిగా ప్రతిబింబిస్తుంది. NCS అనేది పలుకుబడి, మనస్తత్వం మరియు బడ్జెట్ పరంగా అమెరికా సంయుక్తరాష్ట్రాల రక్షణ శాఖ మరియు CIA మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న శత్రుత్వాన్ని ముగించడానికి ఏర్పాటు చేశారు. రక్షణ శాఖ డిఫెన్స్ HUMINT సర్వీస్‌[31]ను నిర్వహించింది. అధ్యక్ష నిర్ణయంతో చేపట్టిన అది NCSలో భాగమైపోయింది.

ప్రస్తుతమున్న సూక్ష్మమాన NCS సంస్థ వర్గీకరించబడింది.[32]

డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ అనేది సాంకేతిక సేకరణ విభాగాలు మరియు సంపత్తి పరిశోధన, ఏర్పాటు మరియు నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడింది. దాని యొక్క పలు నవ్యతలు బహిరంగమవడంతో వాటిని ఇతర నిఘా సంస్థలకు లేదా సైనిక సేవలకు బదిలీ చేయడం జరిగింది.

ఉదాహరణకు, U-2 అత్యంత ఎత్తులో ఎగిరే గస్తీ విమానం తయారీని అమెరికా సంయుక్తరాష్ట్రాల వైమానిక దళం సహకారంతో రూపొందించారు. U-2 యొక్క అసలు లక్ష్యం సోవియట్ యూనియన్ వంటి అనుమతి లేని ప్రాంతాలపై రహస్య వ్యూహాత్మక గూఢచర్యం చేపట్టడం.[citation needed] తర్వాత దానికి సిగ్నల్స్ ఇంటెలిజెన్స్‌ మరియు మెజర్‌మెంట్ అండ్ సిగ్నేచర్ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యాలను కల్పించడం జరిగింది. దానిని ప్రస్తుతం వైమానిక దళం నడుపుతోంది.

U-2 మరియు పర్యవేక్షణ ఉపగ్రహాలు సేకరించిన వ్యూహాత్మక గూఢచార సమాచారాన్ని నేషనల్ ఫోటోఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ (NPIC)గా పిలిచే ఒక DS&T సంస్థ చేత విశ్లేషించబడుతుంది. అందులో CIA మరియు సైనిక కార్యకలాపాలు రెండింటికి చెందిన విశ్లేషకులు ఉంటారు. తర్వాత NPICని నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (NGA)కి బదిలీ చేశారు.

CIA తన సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా సాంకేతికతలో వస్తున్న కొత్త మార్పులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై అత్యంత ఆసక్తిని కనబరుస్తోంది. ఈ ఆసక్తికి చారిత్రాత్మకంగా రెండు ప్రాథమిక లక్ష్యాలున్నాయి:

 • తన సొంత ప్రయోజనాల కోసం సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించడం
 • సోవియట్ అభివృద్ధి చేయగలిగే ఎలాంటి కొత్త నిఘా టెక్నాలజీలనైనా ఎదుర్కోవడం.[33]

1999లో In-Q-Tel అనే వెంచర్ కేపిటల్ సంస్థను CIA ఏర్పాటు చేసింది. అది సంస్థ ప్రయోజనాలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలకు నిధులు సమకూర్చడం మరియు అభివృద్ధి చేయడంలో తోడ్పడుతుంది.[34] IC విధానం అనేది దీర్ఘకాలంగా పర్యవేక్షణ విమానం మరియు ఉపగ్రహాలు వంటి భారీ అభివృద్ధి కోసం వాడుతున్నది.

డైరెక్టరేట్ ఆఫ్ సపోర్ట్

డైరెక్టరేట్ ఆఫ్ సపోర్ట్ అనేది వ్యక్తిగత, భద్రత, సమాచార మరియు ఆర్థిక కార్యకలాపాల వంటి పలు సంప్రదాయ సంస్థాగత పరిపాలక కార్యకలాపాలను కలిగి ఉంటుంది. అయితే అత్యంత సున్నితమైన కార్యకలాపాల పరంగా అది ఎప్పుడూ ఏకరీతిగా ఉంటుంది. విశిష్టమైన విభాగాలు దిగువ పేర్కొనబడినవి

 • ఆఫీస్ ఆఫ్ సెక్యూరిటీ (భద్రతా కార్యాలయం)
 • ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (సమాచార ప్రసారాల కార్యాలయం)
 • ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతిక కార్యాలయం)

శిక్షణ

ఆఫీస్ ఆఫ్ ట్రైనింగ్‌ (శిక్షణా కార్యాలయం) కొత్తగా చేరిన ఉద్యోగులకు జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. అంతేకాక వివిధ ప్రత్యేక విభాగాలకు సంబంధించిన కోర్సులను కూడా నిర్వహిస్తుంది. తుది భద్రతా అనుమతిని పొందని ఉద్యోగులు ప్రాథమిక కోర్సును తీసుకోవచ్చు. అందువల్ల ప్రధాన కార్యాలయ భవనంలో వారికి రక్షణ లేని ప్రవేశాన్ని కల్పించరు. వర్జీనియాలోని ఆర్లింగ్టన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయ భవనాల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు.[citation needed]

తర్వాత స్టూడెంట్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ శిక్షణ ఇస్తారు. విలియమ్స్‌బర్గ్‌, వర్జీనియా సమీపంలోని క్యాంప్ పియర్రీ వద్ద కనీసం ఒక వర్గీకృత శిక్షణ కేంద్రం ఉంటుంది. విద్యార్థులను ఎంపిక చేయడం మరియు OSS నుంచి సంక్రమించిన విధంగా వారి యొక్క పురోభివృద్ధిని అంచనా వేస్తారు. తర్వాత అసెస్‌మెంట్ ఆఫ్ మెన్, సెలక్షన్ ఆఫ్ పర్శనల్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్ పేరుతో దానిని ఒక పుస్తకంగా ముద్రిస్తారు.[35]

ఇతర గూఢచార వనరులతో సంబంధం

మూస:Refimprovesect

CIA అనేది ప్రాథమిక అమెరికన్ HUMINT, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌గా మరియు సాధారణ విశ్లేషణా సంస్థగా వ్యవహరిస్తుంది. అమెరికా సంయుక్తరాష్ట్రాల గూఢచార వర్గం యొక్క 16 మంది సభ్యుల సంస్థలను ఆదేశించడం లేదా సమన్వయపరిచే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కింద అది పనిచేస్తుంది. అదనంగా, ఇతర US ప్రభుత్వ గూఢచార సంస్థలు, వాణిజ్య సమాచార వనరులు మరియు విదేశీ గూఢచార సేవల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది.

ఇతర US గూఢచార సంస్థలు

అనేక గూఢచార సంస్థలు సంపూర్ణంగా లేదా పాక్షికంగా అమెరికా సంయుక్తరాష్ట్రాల రక్షణ కార్యదర్శి లేదా అమెరికా సంయుక్తరాష్ట్రాల అటార్నీ జనరల్ వంటి ఇతర కేబినెట్ అధికారుల నిధుల నియంత్రణలో ఉంటాయి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ యొక్క బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్‌ మరియు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA)కి చెందిన విశ్లేషణాత్మక విభాగం వంటి US గూఢచార వర్గానికి చెందిన ఇతర విశ్లేషణాత్మక సభ్యులు చేసే విధంగా ఇమేజినరీ ఇంటెలిజెన్స్ (వ్యూహాత్మక గూఢచర్యం) (IMINT) సహా CIA యొక్క ముడి సమాచారం జాతీయ పర్యవేక్షణ కార్యాలయం (NRO)కు చెందిన వైమానిక మరియు అంతరిక్ష వ్యవస్థల ద్వారా సేకరించబడుతుంది. ఈ ప్రక్రియను నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (NGA), నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) యొక్క సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ (SIGINT) మరియు DIA MASINT సెంటర్‌కు చెందిన మెజర్‌మెంట్ అండ్ సిగ్నేచర్ ఇంటెలిజెన్స్ (MASINT) చేపడుతాయి.

ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్

2004లో గూఢచార వర్గం పునర్వ్యవస్థీకరణ వరకు, CIA సమకూర్చిన ఒకానొక "ఉమ్మడి అనుబంధ సేవల"లో ఫారిన్ బ్రాడ్‌క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌ (FBIS)కు చెందిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్‌ ఒకటి.[36] డాక్యుమెంట్లను అనువదించే[37] సైనిక సంస్థ జాయింట్ పబ్లికేషన్ రీసెర్చ్ సర్వీస్‌ను చేర్చుకున్న FBIS డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కింద నేషనల్ ఓపెన్ సోర్స్ ఎంటర్‌ప్రైజ్‌లోకి ప్రవేశించింది.

CIA ఇప్పటికీ విభిన్నమైన వర్గీకరించని మ్యాపులు మరియు నమూనా డాక్యుమెంట్లను ఇంటెలిజెన్స్ వర్గం మరియు ప్రజలకు అందిస్తోంది.[38]

గూఢచార సమాచారాన్ని సేకరించే తన విద్యుక్త ధర్మంలో భాగంగా CIA సమాచారం కోసం ఎక్కువగా ఆన్‌లైన్ (ఇంటర్నెట్)ను వినియోగించుకుంటూ సామాజిక మాధ్యమం యొక్క అతిపెద్ద వినియోగదారుగా అవతరించింది. CIA ప్రధాన కార్యాలయంలోని DNI ఓపెన్ సోర్స్ సెంటర్‌ (OSC) డైరెక్టర్ డౌ నక్విన్‌ ఇలా అన్నాడు,"విశిష్టమైన మరియు తగినంత కచ్చితమైన సమాచారం కోసం మేము YouTubeను ఆశ్రయిస్తున్నాం." "ఐదేళ్ల ముందు అందుబాటులో లేని చాటింగ్ రూమ్‌లను వాడుకుంటున్నాం. అలాగే ముందుండటానికి ప్రయత్నిస్తున్నాం."[39]

అవుట్‌సోర్సింగ్

ఒక్క CIA మాత్రమే కాక గూఢచార వర్గం కార్యకలాపాలకు సంబంధించిన పలు విధులు మరియు కార్యక్రమాలు అవుట్‌సోర్సింగ్ (కాంట్రాక్టు ద్వారా తృతీయ పక్షానికి అప్పగించడం) మరియు ప్రైవేటీకరించబడ్డాయి. నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ మైక్ మెక్‌కొనెల్‌ కాంగ్రెస్ (అమెరికా కాంగ్రెస్) కోరిన విధంగా US గూఢచార సంస్థలు అవుట్‌సోర్సింగ్ చేసిన దర్యాప్తు నివేదికకు ప్రచారం కల్పించాలనుకున్నాడు.[40] అయితే అప్పట్లో దానిని వర్గీకరించారు.[41][42] అయితే ఈ నివేదిక దిగువ నివేదించిన విధంగా CIA అవసరాలను కలిగి ఉందని హిల్‍హౌస్ ఊహాగానాలను సృష్టించింది:[41][43]

 • ప్రభుత్వ ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లకు వేర్వేరు ప్రమాణాలు
 • ప్రభుత్వ కార్మికులకు మాదిరిగానే కాంట్రాక్టర్లకు కూడా ఒకే విధమైన సేవలు అందించడం
 • కాంట్రాక్టర్లు vs. ఉద్యోగుల యొక్క వ్యయాల విశ్లేషణ
 • అవుట్‌సోర్సింగ్ కార్యకలాపాల సముచితత్వ అంచనా
 • కాంట్రాక్టులు మరియు కాంట్రాక్టర్ల గణన
 • కాంట్రాక్టర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య నష్టపరిహార తేడా
 • ప్రభుత్వ ఉద్యోగుల ఘర్షణ విశ్లేషణ
 • ఉద్యోగ నమూనాకు తిరిగి మార్చాల్సిన పదవుల వివరణలు
 • జవాబుదారీతనం గల యంత్రాంగాల విశ్లేషణ
 • "కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్టు వ్యక్తుల నేరపూరిత ఉల్లంఘనలు, దుర్వ్యయం, మోసం లేదా ఇతర దూషణల నిర్ధారణ మరియు విచారణపై పర్యవేక్షణ"కు అవసరమైన ప్రక్రియల విశ్లేషణ మరియు
 • "సర్వీసు కాంట్రాక్టుల పరిధిలోని జవాబుదారీతనం కలిగిన యంత్రాంగాల యొక్క ఉత్తమ విధానాల గుర్తింపు"

పరిశోధనాత్మక పాత్రికేయుడు టిమ్ షోరాక్‌ ప్రకారం:

...what we have today with the intelligence business is something far more systemic: senior officials leaving their national security and counterterrorism jobs for positions where they are basically doing the same jobs they once held at the CIA, the NSA and other agencies — but for double or triple the salary, and for profit. It's a privatization of the highest order, in which our collective memory and experience in intelligence — our crown jewels of spying, so to speak — are owned by corporate America. Yet, there is essentially no government oversight of this private sector at the heart of our intelligence empire. And the lines between public and private have become so blurred as to be nonexistent.[44][45]

2008 మార్చి 30 నాటికి ఒక అవుట్‌సోర్సింగ్ నివేదికను కాంగ్రెస్‌ కోరింది.[43]

The Director of National Intelligence has been granted the authority to increase the number of positions (FTEs) on elements in the Intelligence Community by up to 10% should there be a determination that activities performed by a contractor should be done by a US government employee."[43]

ICలోని ఉద్యోగుల సంఖ్యపై కాంగ్రెస్ ఆంక్షల కారణంగా కొంత కాంట్రాక్టు సమస్య తలెత్తింది. హిల్‌హౌస్ ప్రకారం, దీని ఫలితంగా CIA యొక్క నేషనల్ క్లాండిస్టైన్ సర్వీస్‌కు చెందిన 70% మంది సిబ్బంది కాంట్రాక్టర్లుగా తయారవుతున్నారు. "ఏళ్ల తరబడి చేసిన సేవల వల్ల కాంట్రాక్టర్లపై విశ్వాసం పెరగడంతో కాంగ్రెస్ ప్రస్తుతం కాంట్రాక్టర్లను ఫెడరల్ ప్రభుత్వోద్యోగులుగా మార్చే విధంగా ఒక ముసాయిదాను సిద్ధం చేస్తోంది."[43]

పలు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సరంజామా తయారీ తరచూ కాంట్రాక్టు ద్వారా నిర్వహించబడుతోంది. వైమానిక మరియు అంతరిక్ష సెన్సార్ల అభివృద్ధి మరియు ఆపరేషన్‌కు బాధ్యత వహించే జాతీయ పర్యవేక్షణ కార్యాలయం (NRO)ను దీర్ఘకాలంగా CIA మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాల రక్షణ శాఖ సంయుక్తంగా నడిపిస్తున్నాయి. అలాంటి సెన్సార్ల రూపకల్పలో NROకు విశిష్టత ఉంది. అయితే DCI అథారిటీ కింద ఉన్న అప్పటి NRO అనేక రూపకల్పనలను కాంట్రాక్టుకు ఇవ్వడం సంప్రదాయంగా పెట్టుకుంది. అంతేకాక అపారమైన పర్యవేక్షణ అనుభవం లేని బోయింగ్‌ వంటి కాంట్రాక్టర్‌కు కూడా కాంట్రాక్టులను అప్పగించేవారు. ఈ కాంట్రాక్టు ఫలితమే భావి తరం శాటిలైట్ ఫ్యూచర్ ఇమేజినరీ ఆర్చిటెక్చర్‌ ప్రాజెక్టు. దాని వ్యయం $4 బిలియన్ల కంటే మించిపోవడంతో అది లక్ష్యాలను చేరుకోలేకపోయింది.[46][47]

వ్యక్తిగత ప్రాజెక్టులకు విభాజిత భద్రతా విధానాలను అంగీకరించని ఒక సంస్థ లేదా ఒక సంస్థ పరిధిలోని గ్రూపు ద్వారా తలెత్తిన గూఢచార సంబంధిత వ్యయ సమస్యల వల్ల ఖరీదైన నకలు అవసరమైంది.[48]

విదేశీ గూఢచార సేవలు

పలు గూఢచార సేవలు ఉమ్మడిగా ఉంటాయి. పైకి విరుద్ధ దేశాలకు కనిపించే వాటికి తిరస్కరించదగిన కమ్యూనికేషన్స్ మార్గం ఉండొచ్చు.

CIA పాత్ర మరియు విధులు దాదాపు యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌ (MI6), కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS), ఆస్ట్రేలియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌(ASIS), రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌(Sluzhba Vneshney Razvedki)( (SVR), పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), ఇండియన్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్‌ (RAW), ఫ్రాన్స్ దేశపు విదేశీ గూఢచార సర్వీస్ Direction Générale de la Sécurité Extérieure (DGSE) మరియు ఇజ్రాయెల్ యొక్క మోసాద్‌కు దగ్గరగా ఉంటాయి. అంతకుముందు సంస్థలు సమాచర సేకరణ మరియు విశ్లేషణ చేసేవి. అందులో US స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్‌వంటి కొన్ని పూర్తిగా విశ్లేషణాత్మక సంస్థలు. గూఢచార సంస్థల జాబితాను చూడండి.

ఇతర విదేశీ గూఢచార సంస్థలతో US IC యొక్క అత్యంత దగ్గరి సంబంధాలు కలిగిన ఆంగ్ల దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్. గూఢచార సంబంధిత సందేశాలను గుర్తించే సంకేతాలకు సంబంధించిన ప్రత్యేక సంభాషణలు ఈ నాలుగు దేశాల మధ్య జరుగుతాయి.[49] ప్రధాన US సైనిక కమ్యూనికేషన్స్ నెట్‍‌వర్క్ పరిధిలో ఒక కొత్త సందేశ పంపిణీ లేబుల్ సృష్టి అనేది అమెరికా సంయుక్తరాష్ట్రాల సన్నిహిత క్రియాత్మక సహకారానికి ఒక సూచన వంటిది. కాగా, అంతకుముందు ఏవైనా USయేతర దేశాలు సమాచారాన్ని అందుకుని ఉన్న యెడల NOFORN (నో ఫారిన్ నేషనల్స్) గుర్తింపుకు కారణభూతం యొక్క అవసరముండేది. USA/AUS/CAN/GBR/NZL ఐస్ ఓన్లీ అనే ఒక కొత్త కేవియట్‌ను గూఢచార సందేశాలపై ప్రాథమికంగా ఉపయోగించేవారు. ఆస్ట్రేలియా, కెనడా, గ్రేట్ బ్రిటన్ మరియు న్యూజిలాండ్‌లకు సమాచార పంపకాన్ని తెలియజేయడానికి అది మార్గాన్ని మరింత సులభతరం చేస్తుంది.

సంస్థాగత చరిత్ర

కేంద్ర నిఘా సంస్థను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. జాతీయ భద్రతా చట్టం 1947కు అధ్యక్షుడు హ్యారీ S. ట్రూమ్యాన్‌ ఆమోదం తెలపడం ద్వారా అది కార్యరూపు దాల్చింది. ప్రపంచ యుద్ధం II సమయంలోని ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్ (OSS) ద్వారా ఇది సంక్రమించింది. OSSను అక్టోబరు, 1945లో రద్దు చేసి, దాని కార్యకలాపాలను ప్రభుత్వ మరియు యుద్ధ శాఖలకు బదిలీ చేశారు. పదకొండు నెలల ముందు, 1944లో OSS సృష్టికర్త విలియం J. డొనావన్‌ అధ్యక్షుడి చేత నేరుగా పర్యవేక్షించే విధంగా ఒక కొత్త సంస్థ ఏర్పాటు కోసం అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ D. రూస్‌వెల్ట్‌కు ప్రతిపాదించాడు. ఇది "బహిరంగ మరియు రహస్య పద్ధతుల ద్వారా గూఢచార సమాచారాన్ని అందిస్తుంది. అదే సమయంలో గూఢచార సలహాలు, జాతీయ గూఢచార లక్ష్యాల తీర్మానం మరియు అన్ని ప్రభుత్వ సంస్థలు సేకరించిన గూఢచార సమాచారాన్ని సహసమన్వయపరుస్తుంది."[50] అతని ప్రణాళిక కింద, ఒక శక్తివంతమైన కేంద్రీకృత పౌర సంస్థ అన్ని గూఢచార సేవలను సమన్వయపరిచి ఉండేది. అంతేకాక ఈ సంస్థకు "ప్రమాదకరమైన విదేశీ కార్యకలాపాలు" చేపట్టే అధికారమివ్వాలని, అయితే "పోలీసు లేదా చట్టపరమైన అమలు చర్యలు ఉండరాదు, అది స్వదేశంలో గానీ లేదా విదేశంలో గానీ" అని కూడా అతను ప్రతిపాదించాడు.[51]

మరణించిన 83 మంది CIA అధికారులను అసలు ప్రధాన కార్యాలయ భవనం వద్ద ఉన్న CIA స్మారక స్థూపంపై 83 నక్షత్రాలతో తెలుపుతున్న దృశ్యం

CIA అధికారులు విధులు నిర్వర్తిస్తూ మరణించారు. వారిలో కొందరు ప్రమాదాల్లోనూ మరియు మరికొందరు శత్రువుల చేత హతమార్చబడ్డారు. CIA ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న స్మారకస్థూపంపై కొంతమంది అధికారుల పేర్లు రాయలేదు. రహస్య అధికారి ఎవరో తెలిసిపోయే ప్రమాదముందనే ఆలోచనతోనే ఆ విధంగా చేశారు.[52] ప్రపంచవ్యాప్తంగా ఇతర సంస్థల మాదిరానే OSS మరియు దాని ప్రతిరూప బ్రిటీషు విభాగాలు రహస్య గూఢచార సమాచార సేకరణ, నిఘా కార్యకలాపాలు మరియు రహస్య చర్యల పరంగా కచ్చితమైన సంస్థాగత సమతుల్యతను సాధించడంలో ఇబ్బంది పడుతున్నాయి.[citation needed]

తక్షణ పూర్వాధికార సంస్థలు, 1946–47

ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్‌ అనేది తొలి స్వతంత్ర US గూఢచార సంస్థ. దీనిని ప్రపంచ యుద్ధం II కోసం అధ్యక్షుడు హ్యారీ S. ట్రూమ్యాన్ ఏర్పాటు చేశాడు. అయితే యుద్ధం ముగియగానే 1945 సెప్టెంబరు 20న అది కూడా విచ్ఛిన్నమైపోయింది. ప్రత్యేక ఉత్తర్వును అతను ఆమోదించడం ద్వారా సంస్థ విచ్ఛిన్నం అనేది 1945 అక్టోబరు 1 నాటికి 'అధికారిక'మైంది. తదనంతరం శరవేగంగా చేపట్టిన పునర్వ్యవస్థీకరణలు వనరుల కోసం అధికారిక సంబంధమైన పోటీని సాధారణంగా తెలియజేసింది. అయితే రహస్య (ప్రచ్ఛన్న) గూఢచార సమాచార సేకరణ మరియు రహస్య (కోవర్టు) చర్య (అంటే, పారామిలిటరీ మరియు మనస్తత్వ చర్యలు) యొక్క కచ్చితమైన సంబంధాలను వివరించడానికి కూడా ప్రయత్నించాయి.[citation needed] అక్టోబరు, 1945లో OSS కార్యకలాపాలను ప్రభుత్వ మరియు యుద్ధ శాఖల మధ్య విభజించారు:

కొత్త విభాగం పర్యవేక్షణ OSS కార్యకలాపాలు
స్ట్రాటజిక్ సర్వీసెస్ యూనిట్‌ (SSU) యుద్ధ శాఖ సీక్రెట్ ఇంటెలిజెన్స్ (SI) (అంటే, రహస్య గూఢచార సమాచార సేకరణ) మరియు ప్రతిగూఢచర్యం (X-2)
ఇంటరిమ్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (IRIS) స్టేట్ డిపార్ట్‌మెంట్ పరిశోధన మరియు విశ్లేషణ విభాగం (అంటే, గూఢచార విశ్లేషణ)
సైకలాజికల్ వార్‌ఫేర్ డివిజన్ (PWD) (గత OSSకు విశిష్టమైనది కాదు) యుద్ధ శాఖ, సాధారణ సైనిక సిబ్బంది కార్యకలాపాల గ్రూపులకు చెందిన స్టాఫ్ అధికారులు, ఆపరేషన్ జెడ్‌బర్గ్‌, మోరల్ ఆపరేషన్స్ (నలుపు ప్రచారం)

ఈ విభాగం కొద్ది నెలల్లోనే ముగిసింది. "కేంద్ర నిఘా విభాగం" విధానం మరియు పరిభాష యొక్క మొదటి సూచన US సైనిక మరియు నావికా కమాండ్ పునర్నిర్మాణ ప్రతిపాదనలో చోటు చేసుకుంది. దానిని జిమ్ ఫోరెస్టల్‌ మరియు ఆర్థర్ రాడ్‌ఫోర్డ్‌లు U.S. సెనేట్‌ యొక్క సైనిక వ్యవహారాల కమిటీకి 1945 చివర్లో సమర్పించారు.[53] మిలిటరీ వ్యవస్థ నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌ మరియు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI),[50] అధ్యక్షుడు ట్రూమ్యాన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (CIG)ను జనవరి, 1946లో ఏర్పాటు చేశాడు. అది CIAకి ప్రత్యక్ష పూర్వాధికార సంస్థ.[54] CIG అనేది అధ్యక్ష అధికారం కింద ఏర్పాటు చేసిన ఒక తాత్కాలిక అథారిటీ. ప్రస్తుతం రహస్య (ప్రచ్ఛన్న) గూఢచారానికి క్రమబద్ధీకరించిన "కేంద్రకం"గా నియోగించబడిన SSU ఆస్తులను 1946 మధ్యకాలంలో CIGకి బదిలీ చేశారు. తర్వాత దానిని ఆఫీస్ ఆఫ్ స్పెషల్ ఆపరేషన్స్‌ (OSO)గా పునస్థాపించారు.

ప్రారంభ CIA, 1947–1952

సెప్టెంబరు, 1947లో జాతీయ భద్రతా చట్టం 1947 జాతీయ భద్రతా మండలి మరియు కేంద్ర నిఘా సంస్థ రెండింటినీ ఏర్పాటు చేసింది.[55] కేంద్ర నిఘా సంస్థ తొలి డైరెక్టర్‌గా రేర్ అడ్మిరల్ (ఫ్లాగ్ ఆఫీసర్) రోస్కో H. హిలెన్‌కోయిటర్‌ నియమితుడయ్యాడు.

అసలు ప్రధాన కార్యాలయ భవనం యొక్క లాబీలోని [121] వ్యాసం కలిగిన CIA సీలు

18 జూన్ 1948 (NSC 10/2)న ఆఫీస్ ఆఫ్ స్పెషల్ ప్రాజెక్టులపై జాతీయ భద్రతా మండలి ఆదేశం "శత్రు దేశాలు లేదా గ్రూపులకు వ్యతిరేకంగా లేదా మిత్ర దేశాలు లేదా గ్రూపుల సాయంతో కోవర్టు ఆపరేషన్లు చేపట్టే విధంగా CIAకు అధికారం లభించింది. అయితే US ప్రభుత్వం బాధ్యత వహించే వ్యూహరచన చేసిన మరియు చేపట్టిన ఆపరేషన్లు అనధికార వ్యక్తులకు స్పష్టం కాలేదు."

1949లో కేంద్ర నిఘా సంస్థ చట్టం (ప్రజా చట్టం 81-110) అంతరంగిక ఆర్థిక మరియు పరిపాలనా విధానాలను ఉపయోగించుకునే అధికారాన్ని సంస్థకు కల్పించింది. అంతేకాక ఫెడరల్ నిధుల వినియోగంపై ఉన్న పలు సాధారణ పరిమితుల నుంచి దానిని మినహాయించింది. అలాగే CIA తన "సంస్థ, కార్యకలాపాలు, అధికారులు, శీర్షికలు, జీతాలు లేదా ఉద్యోగుల సంఖ్య"ను బహిర్గతం చేయడం నుంచి కూడా మినహాయించింది. డైరెక్టర్లు మరియు వెలుపల సాధారణ వలస నిబంధనల కిందకు వచ్చే ఇతర "ముఖ్యమైన విదేశీయుల" నిర్వహణకు "PL-110" అనే కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. అలాగే అలాంటి వ్యక్తులకు ప్రత్యేక కథనాల సదుపాయం మరియు ఆర్థిక మద్దతును కూడా కల్పించింది.[56]

నిర్మాణ స్థిరీకరణ, 1952

ప్రత్యేకమైన అధ్యక్ష స్ధాయి విశ్వాసాన్ని చూరగొన్న అప్పటి DCI వాల్టర్ బీడెల్ స్మిత్‌ ప్రపంచ యుద్ధం II సమయంలో డివైట్ D. ఐసెన్‌హోవర్‌ యొక్క ప్రాథమిక చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించాడు. CIA– లేదా కనీసం ఒకే ఒక్క శాఖ– OPC మరియు OSOను ఆదేశించే విధంగా చూడమని అతను గట్టిగా విజ్ఞప్తి చేశాడు.[citation needed] అలాంటి సంస్థతో పాటు కొన్ని చిన్న కార్యకలాపాల ద్వారా 1952లో డైరెక్టరేట్ ఆఫ్ ప్లాన్స్‌ అవతరించింది.

1952లో అమెరికా సంయుక్తరాష్ట్రాల ప్రత్యేక సైనిక దళాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని కార్యక్రమాలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లాన్స్‌ను ఆవరించాయి. సాధారణంగా, CIAకి సొంతంగా ప్రత్యేకమైన ఆపరేటర్లు ఉన్నప్పటికీ, ప్రత్యేక దళాల నుంచి అవసరమైన వనరులను తీసుకునే అవకాశం దానికి లభించింది.[citation needed]

ప్రారంభ ప్రచ్ఛన్న యుద్ధం, 1953–1966

లాక్‌హీడ్ U-2 "డ్రాగన్ లేడీ", మొదటి తరం అంతరిక్ష సమీప పర్యవేక్షక విమానం

మూస:Refimprovesect ప్రపంచ యుద్ధం II సమయంలో స్విట్జర్లాండ్‌లో కీలక OSS ఆపరేషన్ల అధికారియైన అలెన్ డ్యూల్స్‌‌ US యొక్క కమ్యూనిస్ట్ వ్యతిరేక విధానం తీవ్రతరమైనప్పుడు స్మిత్ నుంచి పగ్గాలు అందుకున్నాడు. దానికి అనేక ఆధారాలు లభించాయి. వాటిలో సెనేటర్ జోసెఫ్ మెక్‌కార్తీ యొక్క దూషణలు మరియు అతను చేపట్టిన దర్యాప్తులు అత్యంత దృగ్గోచరమైనవి. అలాగే జార్జ్ కెన్నాన్, బెర్లిన్ ముట్టడి మరియు కొరియా యుద్ధం ద్వారా దైహికమైన అణచివేత సిద్ధాంతం బలపడింది. అదే సమయంలో డ్యూల్స్ సోదరుడు జాన్ ఫోస్టర్ డ్యూల్స్‌ సెక్రెటరీ ఆఫ్ స్టేట్‌గా ఉండటంతో అతనికి స్వేచ్ఛ ఎక్కువయింది.

సోవియట్ యూనియన్‌ మరియు కొందరు ఏజెంట్లు చొచ్చుకుని పోయే ప్రమాదమున్న దాని సమీప సమాజం నుంచి సమాచార సేకరణ యొక్క క్లిష్టతకు సంబంధించిన ఆందోళన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలకు దారితీసింది. లాకీడ్ U-2 విమానం ద్వారా తొలి విజయం సొంతమైంది. అది చిత్రాలను తీయడంతో పాటు సోవియట్ వైమానిక రక్షణ దళాల స్థాయి కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఎలక్ట్రానిక్ సంకేతాలను కూడా సేకరించగలదు. 1960లో అంతర్జాతీయ ప్రమాదానికి కారణమైన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలు ఛేదించే SA-2 క్షిపణి చేత గ్యారీ పవర్స్ హతమార్చబడిన తర్వాత దాని స్థానంలో కొత్తగా SR-71ని రూపొందించారు.

CIA యొక్క A-12 OXCART నుంచి అభివృద్ధి చేసిన USAF యొక్క SR-71 బ్లాక్‌బర్డ్‌

ఇదే సమయంలో వనరుల జాతీయతావాదం మరియు సమాజవాదంకు వ్యతిరేకంగా అనేక కోవర్టు చర్యలను చేపట్టారు. ఇరాన్ తన పెట్రోలియం నిల్వలపై నియంత్రణకు పూనుకోవడంతో ఆపరేషన్ అజాక్స్‌ సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని CIA తొలిసారిగా దింపేసింది. బాటిస్టా నిరంకుశత్వాన్ని పూర్తిగా దెబ్బతీసిన తర్వాత కొన్ని అతిపెద్ద ఆపరేషన్లు క్యూబా లక్ష్యంగా సాగాయి. వాటిలో ఫిడేల్ కాస్ట్రోపై హత్యా యత్నాలు మరియు విఫలమైన బే ఆఫ్ పిగ్స్ దాడి కూడా ఉన్నాయి. US-UK ఫిరాయింపుదారుడు ఒలెగ్ పెన్కోవ్‌స్కీ ద్వారా తాము ఎంత పేలవంగా రాజీపడ్డామని క్యూబా పరోక్షంగా గ్రహించిన సమయంలో దానిపై సోవియట్ క్షిపణి దాడులకు ప్రయత్నించనుందనే సూచనలు అందాయి.[57]

SR-71 వంటి పర్యవేక్షక విమానాన్ని నడపడానికి మరియు తర్వాత ఉపగ్రహాల కోసం సైన్యంతో కలిసి ఉమ్మడి జాతీయ పర్యవేక్షణ కార్యాలయం (NRO)ను CIA ఏర్పాటు చేసింది. NRO ఉనికి "యొక్క వాస్తవం" మాదిరిగా అమెరికా సంయుక్తరాష్ట్రాలు పర్యవేక్షక ఉపగ్రహాలను ఆపరేట్ చేసే "వాస్తవం" అనేది పలు ఏళ్లుగా అత్యంతగా వర్గీకరించబడింది.

ప్రారంభ CORONA/KH-4B ఇమేజినరీ IMINT శాటిలైట్

ఇండో-చైనా మరియు వియత్నాం యుద్ధం(1954–1975)

వియత్నాం యుద్ధం మరియు ఫోనిక్స్ ప్రోగ్రామ్‌ కూడా చూడండి.

ప్రపంచ యుద్ధం II ముగింపు సమయానికి OSS ప్యాటీ మిషన్ (యంత్రాంగం) వియత్నాం చేరుకుంది. హో చి మిన్‌ సహా పలు వియత్నాం వర్గాలకు చెందిన నేతలతో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపింది.[58] ఫ్రాన్స్ లేదా అమెరికా సంయుక్తరాష్ట్రాలు బదిలీ భాగస్వామిగా, దశల వారీ స్వతంత్రానికి హో చేసిన ప్రతిపాదనలను ప్యాటీ మిషన్ నివేదించింది. దాంతో US అణచివేత విధానం సాధారణంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకించింది.[citation needed]

ఇండోచైనా యొక్క తొలి CIA యంత్రాంగం సైగాన్ మిలిటరీ మిషన్‌ అనే రహస్య పేరుతో 1954లో ప్రవేశించింది. దీనికి ఎడ్వర్డ్ లాన్స్‌డేల్‌ నాయకత్వం వహించాడు. అదే సమయంలో USకి చెందిన విశ్లేషకులు షెడ్యూలు ప్రకారం రూపొందించిన రెఫరెండమ్ ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల విలీనాన్ని లేదా US కక్షిదారైన దక్షిణ ప్రాంతాన్ని స్వతంత్రంగా విడిచిపెట్టడాన్ని ఎంచుకుంటుందా? అన్న విషయాలు రెండింటికీ సంబంధించిన రాజకీయ శక్తి యొక్క పరిణామక్రమాన్ని ఎత్తిచూపడానికి ప్రయత్నించారు.[citation needed] ప్రాథమికంగా, ఆగ్నేయాసియాలో US దృష్టి వియత్నాం కంటే లావోస్‌పైనే పడింది.[citation needed]

వియత్నాం యుద్ధంలో US పోరాడుతున్న సమయంలో రాబర్ట్ మెక్‌నమారా నేతృత్వంలోని రక్షణ శాఖ, CIA మరియు మిలిటరీ అసిస్టెన్స్ కమాండ్ వియత్నాం గూఢచార సిబ్బంది యొక్క పురోగతిపై చెప్పుకోదగ్గ వాదన జరిగింది.[59] సాధారణంగా, CIA కంటే సైన్యమే అత్యంత ఆశావహదృక్పథంతో ఉంది. వాస్తవిక శత్రు నష్టాన్ని అంచనా వేసే CIA జూనియర్ విశ్లేషకుడు శామ్ ఆడమ్స్‌ అంతర్గతసంస్థ మరియు శ్వేతసౌధం యొక్క రాజకీయ కారణాల వల్ల అంచనాలు మారిపోయాయంటూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ రిచర్డ్ హెల్మ్స్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేసిన అనంతరం తన పదవికి రాజీనామా చేశాడు.[citation needed] ఆడమ్స్ తర్వాత వార్ ఆఫ్ నంబర్స్ అనే పుస్తకాన్ని రాశాడు.

CIA అధికార దూషణలు, 1970–1990 దశకాలు

1970 దశకాల మధ్యకాలంలో అంటే వాటర్‌గేట్‌ కళంకం తలెత్తినప్పుడు పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి.[citation needed] ఆ సమయంలో తలెత్తిన రాజకీయ జీవితం యొక్క ప్రబలమైన అంశాన్ని US ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగమైన US అధ్యక్షత పర్యవేక్షణను నొక్కి చెప్పడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు. హత్యాయత్నాలు, విదేశీ నేతల (ప్రముఖంగా ఫిడేల్ కాస్ట్రో)పై జరిగిన హత్యాప్రయత్నాలు మరియు US పౌరులపై చట్టవ్యతిరేకంగా స్వదేశీ నిఘా వేయడం వంటి ముగిసిన CIA కార్యకలాపాలకు సంబంధించిన విషయాలు బహిర్గతమవడం ద్వారా US గూఢచార కార్యకలాపాలపై కాంగ్రెస్ పర్యవేక్షణ అమలుకు పలు అవకాశాలు ఏర్పడ్డాయి.[60]

డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వాటర్‌గేట్ ప్రధాన కార్యాలయంలో CIA మాజీ ఏజెంట్లు దోపిడీకి పాల్పడటం మరియు దానికి సంబంధించి FBI చేపట్టిన దర్యాప్తును అడ్డుకోవడానికి అధ్యక్షుడు రిచర్డ్ మిక్సన్‌ CIAని విరివిగా ఉపయోగించుకోవడం వంటి కారణాల వల్ల CIA గొప్పదనం శరవేగంగా దెబ్బతినడానికి కారణమయ్యాయి.[citation needed] ఒక కీలక "ఆధారం" (నేరానికి సంబంధించినది) అధ్యక్షుడు నిక్సన్ రాజీనామాకు దారితీసింది. అనంతరం వాటర్‌గేట్‌ తదుపరి దర్యాప్తు క్యూబాపై బే ఆఫ్ పిగ్స్ దాడికి సంబంధించిన "నిందితుల జాబితాను బయటకు తీస్తుంది" అని CIAకి చెప్పమని తన సిబ్బంది చీఫ్‌ H. R. హాల్డీమన్‌ను నిక్సన్ ఆదేశించాడు.[61] ఈ క్రమంలో నిక్సన్ మరియు హల్డీమన్ CIA యొక్క #1 మరియు #2 హోదా అధికారులు రిచర్డ్ హెల్మ్స్ మరియు వెర్నాన్ వాల్టర్స్‌లు మెక్సికోలోని CIA వ్యవహర్తలను FBI బహిర్గతం చేసే అవకాశమున్నందున దోపిడీదారుల మొదలుకుని అధ్యక్షుడిని తిరిగి ఎన్నుకునే కమిటీ వరకు FBI మనీ ట్రెయిల్‌ (సాధారణంగా ఒక రాజకీయవేత్తకు నిధులు అందించే వ్యక్తులు లేదా సంస్థలను తెలపడానికి దీనిని వాడతారు)సమకూర్చి పెట్టేను చేపట్టకుండా దాని డైరెక్టర్ L. ప్యాట్రిక్ గ్రేతో సంప్రదింపులు జరిపారని వారు నిశ్చయించుకున్నారు.[citation needed] తమకు సంబంధించిన సమాచార వనరులను ఎట్టి పరిస్థితిల్లోనూ బహిర్గతం చేయరాదని FBI మరియు CIA మధ్య ఉన్న దీర్ఘకాల ఒప్పందం మేరకు FBI తొలుత దీనికి అంగీకరించింది. అయితే FBI రెండు వారాల్లోనే లిఖతపూర్వకంగా డిమాండ్ చేసింది. అయితే ఎలాంటి లాంఛనప్రాయ విజ్ఞప్తి అటువైపు నుంచి రాకపోవడంతో FBI మనీ ట్రయల్‌పై దర్యాప్తును పునరుద్ధరించింది. అయితే, ఆధారాల టేపులను బహిరంగపరచడంతో CIA ఉన్నతాధికారుల పట్ల ప్రజల్లో ఉన్న భావనకు మరియు CIA మొత్తానికి తీవ్ర నష్టం వాటిల్లింది.[62]

1973లో అప్పటి DCI జేమ్స్ R. షెల్‌సింగర్‌ సంస్థ యొక్క చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై "ఫ్యామిలీ జ్యుయల్స్"–గా పిలిచే నివేదికల–కు ఆదేశించారు. డిసెంబరు, 1974లో పరిశోధనాత్మక పాత్రికేయుడు సేమోర్ హెర్ష్‌ "ఫ్యామిలీ జ్యుయల్స్‌"కు సంబంధించిన వార్తలను ది న్యూయార్క్ టైమ్స్‌ పత్రికలోని ప్రధాన వ్యాసంలో బహిర్గతం చేశాడు. విదేశీ నేతలను CIA హతమార్చిందని, యుద్ధ వ్యతిరేక ఉద్యమం (ఆపరేషన్ CHAOS)లో పాల్గొన్న సుమారు 7,000 మంది US పౌరులపై చట్టవిరుద్ధంగా నిఘా వేసిందని అందులో పేర్కొన్నాడు.[60] LSD (ఇతర వాటిల్లో ఒకటి)ను తెలియకుండా తీసుకున్న వారిపై కూడా CIA ప్రయోగాలు చేసింది.[60]

1975లో కలవరపెట్టే అభియోగాలపై కాంగ్రెస్ స్పందించింది. CIAపై సెనేటర్ ఫ్రాంక్ చర్చ్‌ (D-ఇదాహో) అధ్యక్షత వహించిన చర్చి కమిటీ ద్వారా సెనేట్‌లోనూ మరియు ప్రతినిధుల సభలో కాంగ్రెస్ సభ్యుడు ఓటిస్ పైక్(D-NY) అధ్యక్షత వహించిన పైక్ కమిటీ ద్వారా విచారణకు ఆదేశించింది.[60] అదనంగా, అధ్యక్షుడు గెలార్డ్ ఫోర్డ్‌ రాకీఫెల్లర్‌ మిషన్‌,[60] ను ఏర్పాటుతో పాటు విదేశీ నేతల హత్యలను నిషేధించే ఒక ప్రత్యేక ఉత్తర్వును కూడా జారీ చేశాడు. CIAపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లన నేపథ్యంలో తన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండబోదని అమెరికన్లకు ఫోర్డ్ ఈ విధంగా హామీ ఇచ్చాడు. "వ్యక్తిగతంగా నాకు తెలియని CIAతో సంబంధమున్న వారెవరూ ప్రస్తుతం శ్వేతసౌధంలో నియమించబడలేదు." [60]

ఇరాన్-కోంట్రా ఎఫైర్‌ ఆయుధాల అక్రమ రవాణా కుంభకోణం పరోక్ష ఫలితాల్లో 1991లో ఏర్పాటు చేసిన గూఢచార అధీకృత చట్టం కూడా ఒకటి.[citation needed] US బహిరంగంగా గానీ లేదా స్పష్టంగా నిమగ్నమైన భౌగోళిక రాజనీతి సంబంధ ప్రాంతాల్లోని కోవర్టు చర్యలను రహస్య కార్యకలాపాలుగా అది నిర్వచించింది. ఒక అధికారి, అధ్యక్ష ధ్రువీకరణ నివేదిక మరియు ప్రతినిధుల సభ మరియు సెనేట్ గూఢచార కమిటీల వెల్లడి సహా అధికారమిచ్చే ఆదేశాలతో పాటు అధికారం మరియు బాధ్యతా క్రమం దీనికి అవసరమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో "సమయోచితమైన ప్రకటన" మాత్రమే ఇది కోరుతుంది.

2004, CIA ఉన్నతస్థాయి కార్యకలాపాలను DNI చేపట్టడం

గూఢచార సంస్కరణ మరియు తీవ్రవాద నిరోధక చట్టం 2004 అనేది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌ (DNI) కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గతంలో CIA చేపట్టే కొన్ని ప్రభుత్వ మరియు ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ(IC) వారీ కార్యకలాపాలను చేపడుతుంది. DNI అమెరికా సంయుక్తరాష్ట్రాల గూఢచార వర్గాన్ని నిర్వహిస్తున్న కారణంగా గూఢచార వ్యవస్థను నిర్వహించగలుగుతోంది. DNIకి బదిలీయైన కార్యకలాపాల్లో 16 IC సంస్థల సంఘటిత అభిప్రాయాన్ని ప్రతిబింబింపజేసే విధంగా గణాంకాల (అంచనాల) తయారీ మరియు అధ్యక్షుడి కోసం వివరాలను సిద్ధం చేయడం ఉన్నాయి. 30 జులై 2008న అధ్యక్షుడు బుష్‌ ప్రత్యేక ఉత్తర్వు 13470[63] ను జారీ చేశాడు. అది DNI పాత్రను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ఉత్తర్వు 12333కు సవరణ చేయడానికి ఉద్దేశించినది.[64]

అంతకుముందు, అధ్యక్షుడి ప్రధాన గూఢచార సలహాదారుయైన గూఢచార వర్గాన్ని పర్యవేక్షించే డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ (DCI) అదనంగా CIA అధిపతిగా కూడా వ్యవహరిస్తోంది. DCI పేరు ప్రస్తుతం "డైరెక్టర్ ఆఫ్ ది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ" (DCIA)గా మారింది. ఇది CIA అధిపతిగా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం, CIA తన నివేదికలను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌కు పంపుతోంది. DNI స్థాపనకు ముందు CIA తన నివేదికలను అధ్యక్షుడికి నివేదించేది. అలాగే అనధికారిక వివరాలను కాంగ్రెస్ కమిటీలకు కూడా సమర్పించేది. జాతీయ భద్రతా సలహాదారు జాతీయ భద్రతా మండలి యొక్క శాశ్వత సభ్యుడు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ తదితరమైనవి సహా అన్ని US గూఢచార సంస్థలు సేకరించిన యుక్తమైన సమాచారానికి సంబంధించిన వివరాలను అధ్యక్షుడికి నివేదించే బాధ్యతను కలిగి ఉంటాడు. 16 గూఢచార వర్గ సంస్థలు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అథారిటీ కింద పనిచేస్తాయి.

యంత్రాంగ (మిషన్) సంబంధిత విషయాలు మరియు వివాదాలు

మూస:Refimprovesect కోవర్టు చర్య సహా CIA చరిత్ర అనేక విషయాలను వివరిస్తుంది. ప్రచ్ఛన్న మరియు బహిరంగ గూఢచార సమాచార సేకరణ, గూఢచార విశ్లేషణ, నివేదన మరియు తన కార్యకలాపాలకు వ్యూహరచన పరమైన మరియు సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తుంది. డిసెంబరు, 2004లో చేపట్టిన గూఢచార వర్గం (IC) పునర్వ్యవస్థీకరణకు ముందు వరకు IC వారీ గూఢచార అంచనాల సహకారాలకు కూడా ఇది బాధ్యత వహించేది.

ఈ కథనాలను రెండు విభిన్నమైన మార్గాల్లో నిర్వహించడం జరిగింది : భౌగోళిక ప్రాంతం వారీగా (ఒక దేశం లేదా ఒక ప్రాంతము)నకు పరిమితమైన ప్రభుత్వ నటులు లేదా ప్రభుత్వేతర నటులు) మరియు బహుళజాతి అంశం వారీగా (ప్రభుత్వేతర నటులకు సంబంధించినది).

CIA యొక్క ప్రాంతం, దేశం మరియు తేదీ వారీ కార్యకలాపాలను దిగువ కథనాల్లో సవివరంగా వివరించడం జరిగింది :

CIA విశ్లేషించే ప్రబలుతున్న అంటురోగముల ప్రభావం మరియు జన విధ్వంస ఆయుధాల గుర్తింపు వంటి విషయాలు అంతర్గతంగా బహుళజాతికి సంబంధమైనవి మరియు వాటిని దిగువ పేర్కొన్న కథనాల్లో వివరించడం జరుగుతుంది. CIA ఆపరేషన్లు మరియు కోవర్టు ఆపరేషన్ల (ఉదాహరణకు, NSDD 138 శత్రువులపై ప్రత్యక్ష చర్యకు అధికారమిస్తుంది)కు కచ్చితమైన, అధికారాలు వంటి అంశాలను బహుళజాతి టాపిక్ ద్వారా దిగువ తెలిపిన వికీపీడియా కథనాల్లో వివరించారు:

అదనంగా, ప్రత్యేకించి పరిపాలనా విధాన మార్పు చర్యలను గుర్తించిన US కోవర్టు కార్యకలాపం యొక్క వ్యూహాన్ని దిగువ తెలిపిన వికీపీడియా కథనంలో వివరించడం జరిగింది :

ఈ విభాగానికి అవసరమైన సమాచారాన్ని అమెరికా సంయుక్తరాష్ట్రాల యొక్క వరుస ప్రచురణలకు సంబంధించిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌ నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మరియు జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ, CIAలోని ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పఠనాశాల, US కాంగ్రెస్ విచారణలు, బ్లూమ్ పుస్తకం[65] మరియు వీనర్ పుస్తకం[66] వంటి అతిపెద్ద వనరుల నుంచి తీసుకోబడింది. వీనర్ పుక్తకం,[67] లోని క్లెయిమ్‌లపై CIA స్పందించిన విషయాన్ని గుర్తించుకోవాలి. నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్‌కు చెందిన జెఫ్రీ రిచెల్సన్ కూడా దానిని విమర్శించాడు.[68]

చట్టవిరుద్ధమైన వివాద అంశాలు, మానవులపై సమ్మతి లేకుండా ప్రయోగాలు, రసాయనిక పద్ధతుల్లో సమాచారాన్ని బయటకు తీయడం లేదా మనుషులను అంగవైకల్యానికి గురిచేయడం వంటి చట్టవిరుద్ధమైన చర్యలు. మరో అంశం హింస మరియు రహస్య నిర్బంధం. ఆయా దేశ పౌరులచే CIA ఆదేశాలతో విదేశీ నేతల హత్యలకు మద్దతు మరియు హత్యాప్రయత్నాలు జరిగాయి. అంతేకాకుండా కొందరి హత్యల్లో దీని మద్దతు ఉంది, కొంతవరకు భిన్నమైన ఒక న్యాయ విభాగంలో ఈ చర్యలు సాధారణ యుద్ధ చట్టాలు, తీవ్రవాద నేతల హత్యల పరిధిలోకి వస్తాయి.

భద్రత మరియు నిఘా కార్యకలాపాల వైఫల్యాలు

కాలక్రమంలో పేర్లు మారుతుండటంతో, CIA మరియు దాని ఆపరేషన్లకు రక్షణ కల్పించడానికి రెండు ముఖ్యమైన భద్రతా కార్యకలాపాలు ఏర్పాటయ్యాయి. డైరెక్టరేట్ ఫర్ సపోర్ట్‌లోని ఆఫీస్ ఆఫ్ సెక్యూరిటీ CIA భవనాల భౌతికపరమైన భద్రత, సమాచార రక్షణ మరియు వ్యక్తిగత భద్రతా అనుమతులకు బాధ్యత వహిస్తుంది. ఇవి అంతర్గతంగా సంస్థను ఆదేశిస్తాయి.

నేషనల్ క్లాండిస్టైన్ సర్వీస్‌ ప్రస్తుతం నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అత్యంత వివాదాస్పదమైన జేమ్స్ జీసస్ ఆంగ్లిటన్‌ ఆధ్వర్యంలో నిఘా కార్యకలాపాల సిబ్బంది ఈ బాధ్యతను నిర్వర్తిస్తోంది. గూఢచారులుగా ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ (FIS)కు సమాచారాన్ని అందించే సిబ్బంది అన్వేషణ వంటి పలు కార్యక్రమాలు దీని కిందకు వస్తాయి. ఫారిన్ HUMINT అసెట్స్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు మరియు FISతో వారి సంబంధాలను తనిఖీ చేయడం మరో పాత్ర. అలాగే శత్రు గూఢచారి లేదా రహస్య గూఢచారి (రెండు విరుద్ధ దేశాల తరఫున పనిచేసేవాడు)గా వారు CIAలో ప్రవేశించి, దాని సిబ్బంది మరియు విధానాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారా? అన్న విషయాన్ని కూడా పరిశీలించడం.

ఈ సంస్థ విభాగం ప్రమాదకర నిఘా కార్యకలాపాలను కూడా చేపట్టవచ్చు. అంటే అది FIS ఆపరేషన్లలో జోక్యం కల్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. విధులను నిర్వర్తిస్తున్న CIA అధికారులు తరచూ ప్రమాదకర నిఘా కార్యకలాపాలను చేపట్టడం మరియు ప్రచ్ఛన్న (రహస్య) గూఢచార సమాచార సేకరణ వంటి బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది.

భద్రతా వైఫల్యాలు

దేశీయ చట్ట అమలులో CIA జోక్యంపై నిషేధాన్ని ఆఫీస్ ఆఫ్ సెక్యూరిటీ ఉల్లంఘించిందని "ఫ్యామిలీ జ్యుయల్స్" మరియు ఇతర నివేదికలు వెల్లడించాయి. కొన్నిసార్లు CIA భవనాల వద్ద కాపలా కాస్తున్న స్థానిక పోలీసు సంస్థలకు సాయపడాలనే ఉద్దేశ్యంతో కూడా అలా ఉల్లంఘనకు పాల్పడినట్లు అవి పేర్కొన్నాయి.

30 డిసెంబరు 2009న ఆఫ్గనిస్తాన్‌లోని ఖోస్త్‌ ప్రావిన్స్‌లో ఉన్న అతిపెద్ద CIA స్థావరం ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ చాప్‌మన్ దాడిపై ఫిదాయి దాడి జరిగింది. ఆ దాడిలో స్థావరం యొక్క చీఫ్ సహా ఏడుగురు CIA అధికారులు హతమార్చబడ్డారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం స్థావరం యొక్క భద్రతా చర్యలను అధిగమించి, ఆత్మాహుతి దళ సభ్యుడు ఏ విధంగా దాడి చేశాడనే దానిపై CIA విచారణ మొదలుపెట్టింది.[69]

నిఘా కార్యకలాపాల వైఫల్యాలు

బహుశా నిఘా కార్యకలాపాలకు సంబంధించిన అత్యంత గడ్డుకాలంగా సోవియట్ ఫిరాయింపుదారుడు అనాటోలీ గోలిట్సిన్‌ ప్రకటనల ఆధారంగా జేమ్స్ జీసస్ ఆంగ్లీటన్ చేపట్టిన గూఢచారి అన్వేషణను చెప్పుకోవచ్చు. రెండో ఫిరాయింపుదారుడు యూరీ నోసెన్కో గోలిట్సిన్ వాదనలను సవాలు చేశాడు. సోవియట్ రహస్య గూఢచారులుగా ఒకరినొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.[70] పలువురు CIA అధికారులు తమ ఉద్యోగాలను పోగొట్టుకునే విధంగా అనుమానించబడ్డారు. నోసెన్కో మరియు గోలిట్సిన్ ప్రకటనల వెనుక వాస్తవాలు మరియు అవాస్తవాలు ఎప్పుడూ బహిర్గతం కాలేదు లేదా వాస్తవానికి సంపూర్ణంగా అవగతం చేసుకోబడలేదు. ఆరోపణల పర్వం ఏకంగా అట్లాంటిక్‌ను దాటి గూఢచార అన్వేషణల వల్ల బాగా దెబ్బతిన్న బ్రిటీష్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు కూడా పాకింది.[71]

24 ఫిబ్రవరి 1994న 1985 నుంచి సోవియట్ యూనియన్‌కు రహస్యంగా సమాచారాన్ని అందిస్తున్నాడన్న అభియోగం కింద సీనియర్ అధికారి అల్‌డ్రిచ్ అమీస్‌ను ఖైదు చేయడంతో సంస్థ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయింది.[72]

ఇతర ఫిరాయింపుదారుల్లో క్షేత్ర కార్యకలాపాల అధికారియైన ఎడ్వర్డ్ లీ హోవర్డ్ మరియు CIA 24-గంటల కార్యకలాపాల కేంద్రంలో పనిచేసే తక్కువ హోదా కార్మికుడు విలియం క్యాంపైల్స్‌ ఉన్నారు. KH-11 పర్యవేక్షక ఉపగ్రహం యొక్క ఆపరేషన్‌కు సంబంధించిన సంపూర్ణ వివరాలతో కూడిన మ్యాన్యువల్‌ను క్యాంపైల్స్ సోవియట్లకు విక్రయించాడు.[73]

గూఢచార విశ్లేషణా వైఫల్యాలు

ఒక గూఢచార సమాచార సేకరణ సంస్థగా తగినంత సామర్థ్యం కలిగి లేదంటూ ఏజెన్సీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత మాజీ DCI రిచర్డ్ హెల్మ్స్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు, "మిగిలిన ఒకే ఒక ప్రభావవంతమైన సంస్థకు ప్రపంచంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడంలో గానీ, గూఢచార కార్యకలాపం యొక్క నిర్వహణ మరియు దానిని చేపట్టడంలో గానీ తగినంత ఆసక్తి లేదు."[74] అంతేకాక సోవియట్ యూనియన్ పతనంను అంచనా వేయడంలోనూ విఫలమైందని కూడా CIA తీవ్ర విమర్శను ఎదుర్కొంది.

సాధ్యపర వైఫల్యాలపై చర్చించి తదనుగుణంగా విశ్లేషకులకు తగిన యాంత్రికీకరణ సహకారాన్ని అందించడానికి గూఢచార విశ్లేషణా నిర్వహణ యొక్క సమాచార సాంకేతిక విభాగంను చూడండి. అలాగే వాటిలో కొన్నింటిని సేకరించడానికి IC వారీ ప్రోగ్రామ్ కోసం A-స్పేస్‌. విశ్లేషణ ఎందుకు వైఫల్యం కాగలదనే దానిని CIA పరిశీలించే ఏరియాల్లో కాగ్నిటివ్ ట్రాప్స్ ఫర్ ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్‌ను ఉపయోగిస్తారు.

విధాన రూపకర్తలకు ఒకప్పుడు మార్గదర్శిగా వ్యవహరించిన CIA ఇప్పుడు దీర్ఘకాల వ్యూహాత్మక గూఢచార సమాచారాన్ని సేకరించలేకపోతోందని సంస్థ సీనియర్లు[ఎవరు?] ధ్వజమెత్తారు. అక్టోబరు, 2000-సెప్టెంబరు, 2004 మధ్యకాలంలో కేంద్ర నిఘా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ మరియు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరించిన జాన్ మెక్‌లాఫ్లిన్‌ ఈ విధంగా అన్నాడు, తక్షణ సమాచారం కోసం శ్వేతసౌధం మరియు పెంటగాన్ నుంచి వచ్చిన డిమాండ్ల వల్ల CIA నిర్వీర్యమైపోయింది, "గూఢచార విశ్లేషకులు వాషింగ్టన్ వికీపీడియా మాదిరిగా ముగించారు."[75] గూఢచార విశ్లేషణ కథనం ఓరియంటింగ్ వన్‌సెల్ఫ్ టు ది కన్సూమర్స్‌లో విధాన రూపకర్తల అవసరాలకు గూఢచర్యం అనేది అత్యంత ప్రతిస్పందకం కాగలదనే విషయాలను తెలుపుతుంది.

ఈ వైఫల్యాలు మీడియాకు అత్యంత ఆసక్తికరంగా మారాయి. విడుదల చేసిన పలు నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్లు అనేక దేశాల ప్రవర్తనను అంచనా వేయడానికి ప్రయత్నించాయి. అయితే అవి వార్తలకు అనుగుణమైన రీతిలో అంత ఆకర్షణీయంగానూ లేదా అత్యంత విశిష్టంగానూ లేకపోవడమే కాక సంఘటన జరిగినప్పుడు బహిరంగం కాలేదు. CIA సాధించిన విజయాల్లో U-2 మరియు SR-71 ప్రోగ్రామ్‌లు మరియు 1980 దశకాల మధ్యకాలంలో[citation needed] ఆఫ్గనిస్తాన్‌లో చేపట్టిన సోవియట్‌ వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయి.

తొలి విశ్లేషణాత్మక వైఫల్యాల్లో, అంటే CIAకు సొంతంగా సమాచారాన్ని సేకరించే సామర్థ్యం లేక ముందు కొరియాకు చైనా దళాలు పంపకపోవచ్చని అధ్యక్షుడు హ్యారీ S ట్రూమన్‌కు 13 అక్టోబరు 1950న అది హామీ ఇచ్చింది. ఆరు రోజుల అనంతరం, సుమారు మిలియన్‌ (10 లక్షలు)కు పైగా చైనా దళాలు అక్కడకు చేరుకున్నాయి.[76] విశ్లేషణా వైఫల్యంను చూడండి; అలాగే రెండు కొరియాలు మరియు చైనాకు సంబంధించిన పరిసర మూలగ్రంథం మరియు కొరియా యుద్ధానికి ముందు కాల వ్యవథిని కూడా చూడండి. అంతకుముందు, ఉత్తరకొరియా దాడిని గుర్తించడంలో గూఢచార వర్గం విఫలమైంది. అందుకు కారణం కొరియాకు చెందిన పెనిన్సులా[citation needed]లో SIGINT కవరేజీకి ఉద్యోగులను (వనరులు) అనుమతించకపోవడం.

ఫ్రెంచ్ ఇండోచైనా మరియు అప్పటి రెండు వియత్నాంలతో పోల్చితే US గూఢచర్యం సుదీర్ఘమైనది మరియు సంక్లిష్టమైనది. పెంటగాన్ పత్రికలు శ్వేత సౌధ హోదాలతో సంఘర్షించే విధంగా తరచూ ఆశావహ CIA విశ్లేషణలను కలిగి ఉంటాయి. అందులో కొన్ని అంచనాలు పెంటగాన్ మరియు శ్వేతసౌధ ఆలోచనలను ప్రతిబింబించే విధంగా మార్పు చెందినట్లు కన్పిస్తాయి.[59] 1945 (అంటే CIAకి ముందు) నుంచి అటు తర్వాత గూఢచార మరియు కోవర్టు కార్యకలాపాలకు సంబంధించిన వివరణాత్మక చర్చల కోసం ఆసియా మరియు పసిఫిక్‌‌లో CIA కార్యకలాపాలు చూడండి.

1974లో భారతదేశ అణ్వస్త్ర పరీక్షలను అంచనా వేయడంలో వైఫల్యం చెందడం మరో విమర్శకు దారితీసింది. భారతదేశ అణు కార్యక్రమానికి సంబంధించిన అనేక విశ్లేషణల యొక్క సమీక్ష ఎట్టకేలకు పరీక్షకు సంబంధించిన కొన్ని అంశాలను అంచనా వేసింది. అంటే 1965 నాటి నివేదిక పేర్కొన్నట్లుగా, భారతదేశం గనుక బాంబును తయారు చేస్తే, అది కచ్చితంగా "శాంతియుత కార్యకలాపాల కోసమే".

సెప్టెంబరు 11 దాడులను ముందుగా పసిగట్టలేకపోవడం మరో అతిపెద్ద విమర్శ. 9/11 కమీషన్ నివేదిక IC మొత్తం వైఫల్యాలను గుర్తించింది. ఉదాహరణకు, ఒక సమస్యగా తన వికేంద్రీకృత క్షేత్ర అధికారులకు సమాచార పంపకం చేయడం ద్వారా FBI "వనరులను ఒకటి చేయడం"లో విఫలమైంది. అయితే ఈ నివేదిక CIA విశ్లేషణ మరియు ప్రతిబంధకమైన వారి దర్యాప్తు రెండింటినీ విమర్శించింది[citation needed].

CIA కార్యాలయ ఇన్స్‌పెక్టర్ జనరల్ జాన్ హెల్జర్‌సన్ 21 ఆగస్టు 2007న విడుదల చేసిన సంగ్రహ నివేదిక ప్రకారం, 11 సెప్టెంబరు 2001 దాడులకు ముందు అల్‌ఖైదా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని అడ్డుకునే విధంగా మాజీ DCI జార్జ్ టెనెట్‌ సంస్థను సిద్ధం చేయలేకపోయాడు. జూన్, 2005లో పూర్తయిన ఆ నివేదిక ప్రస్తుత DCI జనరల్ మైఖేల్ హేడెన్‌ అభ్యంతరాలపై కాంగ్రెస్‌తో ఒప్పందం ద్వారా పాక్షికంగా మాత్రమే బహిర్గతం చేయబడింది. దాని ప్రచురణ "కాలహరణం చేసేది గానూ మరియు ఇప్పటికే పక్కాగా సిద్ధమైన విషయంపై తిరిగి పరిశీలించే విధంగానూ" ఉందని హేడెన్ వ్యాఖ్యానించాడు.[77] అల్‌ఖైదాకు సంబంధించిన తన వ్యూహాత్మక ప్రయత్నాలు ప్రయోగాత్మకంగా 1999 నుంచే మొదలయ్యాయంటూ నివేదిక యొక్క తీర్మానాలతో టెనెట్ విభేదించాడు.[78]

ప్రశ్నార్థక/వివాదాస్పద ఎత్తుగడలు

CIA తన యంత్రాంగాల (మిషన్లు)ను చేపట్టడానికి పలు సందర్భాల్లో అనుసరించిన ఎత్తుగడలు ప్రశ్నార్థకమయ్యాయి. సందర్భోచితంగా, ఎత్తుగడల్లో వేధింపులు, నిధులు సమకూర్చడం మరియు సమూహాలు మరియు సంస్థలకు శిక్షణ ఇవ్వడం, మానవ ప్రయోగీకరణం మరియు లక్ష్యనిర్దేశిత హత్యలు మరియు హత్యలు కూడా ఉన్నాయి. శిక్షణ తీసుకున్న వారు తర్వాత పౌరులు మరియు ఇతర పోరాటేతరులను హతమార్చడంలో పాల్గొనడం మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ప్రయత్నించడం లేదా విజయవంతమవుతారు.

మానవ హక్కుల పరంగా CIA యొక్క పాత్రను అవగతం చేసుకోవడంలో సవాలుతో కూడిన అనేక నైతిక సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. CIA అధికారి జాన్ స్టాక్‌వెల్ సంస్థను వీడి, ప్రజా విమర్శకుడుగా మారిన అతను CIA క్షేత్ర అధికారుల గురించి ఈ విధంగా అన్నాడు, "వారు ఎప్పుడు కూడా వీధుల్లోని మృత్య బృందాలతో తలపడరు. వాస్తవానికి వారు అక్కడ ప్రజలను ముక్కలు ముక్కలు చేయడం లేదా వారిని వీధుల్లో పడవేసి, వారి తలలపై వాహనాలను నడుపుతారు. శాన్ సాల్వోదర్‌లోని CIA అధికారులు పోలీసు ఉన్నతాధికారులను మరియు మృత్యు బృందాలను నడిపే వారిని కలుస్తారు. అలాగే వారితో సంబంధం పెట్టుకుంటారు. అంతేకాక గృహాల యొక్క ఈత కొలనుల పక్కన వారిని కలుసుకుంటారు. అది తప్పుదారి పట్టించే (లౌక్యంతో కూడిన) మరియు నాగరికతతో కూడిన సంబంధం. మరియు వారు UCLA లేదా హార్వర్డ్ మరియు ఇతర స్కూళ్లకు వెళ్లే తమ పిల్లల గురించి మాట్లాడుతారు. అంతేగానీ భయానక లేదా ఆందోళనకర పరిస్థితులపై మాత్రం వారు ప్రస్తావించరు. అది వాస్తవం కాదన్నట్లుగా వారు నటిస్తారు".[79]

బాహ్య దర్యాప్తులు మరియు డాక్యుమెంట్ విడుదలలు

CIA స్థాపన మొదలుకుని పలు సందర్భాల్లో CIA చర్యలపై US ప్రభుత్వం సమగ్రమైన నివేదికలను విడుదల చేసింది. 1947 నుంచి CIA ఎలా తన యొక్క అనిశ్చిత కార్యకలాపాలను పూర్తిచేయడానికి సంబంధించిన చారిత్రాత్మక పరీవాహక ప్రాంతాలను అది గుర్తించింది. అంతర్గత/అధ్యక్ష అధ్యయనాల, కాంగ్రెస్ కమిటీల లేదా US ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాల యొక్క బాహ్య దర్యాప్తులు లేదా CIA విడుదల చేసిన సాధారణ రిలీజులు మరియు కుదించిన భారీ పరిమాణాల డాక్యుమెంట్ల ఫలితమే ఈ నివేదికలు.

వివిధ దర్యాప్తులు (ఉదాహరణకు, చర్చి కమిటీ, రాకీఫెల్లర్ కమీషన్, పైక్ కమిటీ మొదలైనవి), అదే విధంగా విడుదల చేసిన పత్రాలు సందర్భోచితంగా CIA తన పరిధి బయట పనిచేసిందన్న విషయాన్ని బహిర్గతం చేశాయి. వాటర్‌గేట్ వంటి మరికొన్ని సందర్భాల్లో ఇది శ్వేతసౌధ సిబ్బంది యొక్క అసందర్భ వినతుల కారణంగా బయటపడింది. ఇరాన్-కాంట్రా వ్యవహారం వంటి ఇతర కేసుల్లో కాంగ్రెస్ ఉద్దేశ్యం ఉల్లంఘించబడింది. పలు కేసుల్లో ఈ నివేదికలు ఇలాంటి చర్యలకు సంబంధించిన అధికారిక చర్చను మాత్రమే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి.

ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేయడం మరియు చట్టపరమైన అమలు

ఇక్కడ లెక్కలేనన్ని పరిస్థితులు కన్పిస్తాయి. ఇక్కడ ఒక చిన్న వాదన ఉంది, ఉదాహరణకు, రాజకీయ మరియు భద్రతాపరమైన దర్యాప్తులను చేపట్టే శ్వేతసౌధ సిబ్బందికి సాంకేతిక సహకారాన్ని అందించడంలో CIA అసమంజసంగా వ్యవహరించడం. ఇలా చేయడానికి ఎలాంటి చట్టపరమైన అధికారం లేదు. చట్టపరమైన అమలు అనేది ప్రచ్ఛన్న కార్యకలాపాలన్ని బహిర్గతం చేయవచ్చనే పరిస్థితి తలెత్తడంతో పరిస్థితులు మరింత సందిగ్ధంగా మారాయి. అంటే ఈ సమస్య గూఢచర్యానికి విశిష్టమైనదేమీ కాదు. అయితే విభిన్న చట్టపరమైన అమలు సంస్థల్లోనూ ఇది కన్పిస్తుంది. ఒక సంస్థ విచారణను కోరితే మరొకటి దర్యాప్తులను కొనసాగించాలని అనుకుంటుంది. సాధ్యమైనంత వరకు కుట్రలో అత్యున్నత స్థాయిలను చేరుకుంటుంది.[80]

మాజీ నాజీ మరియు జపాన్ యుద్ధ నేరస్థులతో

యుద్ధ నేరస్థులను విచారించడంలో అమెరికా సంయుక్తరాష్ట్రాలు పాలుపంచుకున్నాయి లేదా కొనసాగుతున్న గూఢచార లేదా ఇంజినీరింగ్ (ఉదాహరణకు, ఆపరేషన్ పేపర్‌క్లిప్‌)లో భాగమ్యయ్యాయి. US సైన్యం మరియు గూఢచార సంస్థలు సాంకేతిక లేదా గూఢచార సమాచారాన్ని పొందాలని కొందరు యుద్ధ నేరస్థులను కాపాడాయి. పలు US గూఢచార సంస్థలు పాలుపంచుకున్నాయి మరియు వీటిలో పలు సంబంధాలు 1947లో CIA స్థాపనకు ముందే రూపుదాల్చాయి. కొన్ని సందర్భాల్లో CIA ఈ సంబంధాలను నియంత్రించింది. వాటిని సుమారు 60 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచింది.[citation needed]

అల్‌ఖైదా మరియు తీవ్రవాదంపై యుద్ధం

విదేశాల్లో పుట్టిన తీవ్రవాదంపై CIA దీర్ఘకాలంగా పోరాటం జరుపుతోంది. 1986లో ఈ సమస్యను ఎదుర్కోవడానికి తీవ్రవాద నిరోధక కేంద్రం)ను ఏర్పాటు చేసింది. తొలుత లౌకిక (మతప్రమేయం లేని) తీవ్రవాదంతో పోరాటం జరిపింది. తర్వాత ముస్లీం తీవ్రవాదం బలోపేతమవడాన్ని సంస్థ గుర్తించింది.

అల్‌ఖైదా (ప్రధాన స్థావరం)గా వెలుగులోకి వచ్చిన ఆ నెట్‌వర్క్ సోవియట్లు మరియు 1980 దశకాల్లో ఆఫ్గనిస్తాన్‌లోని వారి కీలుబొమ్మ ప్రభుత్వాలపై పోరాడిన అరబ్ వాలంటీర్ల ప్రేరణతో మరింత విస్తరించింది. వాలంటీర్లు బాగా తెలియడంతో 1984లో అబ్దుల్లా అజామ్‌ మరియు ఒసామా బిన్ లాడెన్‌ పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆఫీస్ ఆఫ్ సర్వీసెస్‌గా పిలిచే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. "ఆఫ్గన్ అరబ్బుల"కు సహకారం మరియు ఆర్థిక సాయం అందించడం కోసం దీనిని స్థాపించారు.

ఆపరేషన్ సైకిల్‌గా పిలిచే కోవర్టు ఆపరేషన్ ద్వారా US సాయాన్ని పాకిస్తాన్ ద్వారా ఆఫ్గనిస్తాన్ ప్రతిఘటన పోరాటయోధులకు CIA అందించింది. అయితే ఆఫ్గన్‌యేతర పోరాటయోధులు లేదా బిన్ లాడెన్‌తో ప్రత్యక్ష సంబంధాలను అది తోసిపుచ్చింది.[81] అయితే సైనిక శిక్షణ కోసం ఆఫ్గన్లు మరియు అరబ్బులు ఇరువురినీ సంస్థ అమెరికా సంయుక్తరాష్ట్రాలకు తీసుకెళ్లిందని అనేక అథారిటీలు పేర్కొన్నాయి.[82][83] అజామ్ మరియు బిన్ లాడెన్ "అల్‌-ఖిఫా" పేరుతో USలో నియామక కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇది బ్రూక్లిన్ యొక్క అట్లాంటిక్ అవెన్యూలోని ఫరూఖ్ మాస్క్యూ కేంద్రం. ఇది "ఆపరేషన్ సైకిల్‌కు కీలకమైన ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రదేశం".[84]

బ్రూక్లిన్ కేంద్రంలో చెప్పుకోదగ్గ ఇతర ప్రముఖులు ఈజిప్టు "రహస్య గూఢచారి" అలీ మహ్మద్‌. 1980 మరియు 1990 దశకాల మధ్య పలు సమయాల్లో అతను CIA, గ్రీన్ బీరెట్స్‌, ఈజిప్షియన్ ఇస్లామిక్ జీహాద్ మరియు అల్‌ఖైదా తరపున పనిచేశాడు. FBI ప్రత్యేక ఏజెంట్ జాక్ క్లూనాన్ అతన్ని "బిన్ లాడెన్ యొక్క తొలి శిక్షకుడు"గా అభివర్ణించాడు.[85] మరొకరు "బ్లైండ్ షేక్" అబ్దెల్ రహమాన్‌. అతను ముజాహిద్దీన్‌ యొక్క ప్రముఖ రిక్రూటర్ (ఉద్యోగులను నియమించే వ్యక్తి). అతను 1987 మరియు 1990 మధ్యకాలంలో CIA సాయంతో US ఎంట్రీ వీసాలు పొందాడు.

1988 సమయంలో బిన్ లాడెన్ సర్వీసెస్ ఆఫీస్‌కు చెందిన అత్యంత తీవ్రమైన మూలకాల ద్వారా అల్‌ఖైదాను స్థాపించాడు. అయితే ఇది అతిపెద్ద సంస్థ కాదు. 1989లో జమాల్ అల్-ఫదల్‌ (అతను 1980 మధ్య దశకాల్లో బ్రూక్లిన్ కేంద్రం ద్వారా నియమితుడయ్యాడు) చేరాడు. అప్పుడు అతన్ని అల్‌ఖైదా యొక్క "మూడో సభ్యుడు"గా పేర్కొన్నారు.[86]

జనవరి, 1996లో బిన్ లాడెన్ చేపడుతున్న కార్యకలాపాలను గుర్తించడానికి తీవ్రవాద నిరోధక కేంద్రం ఆధ్వర్యంలో బిన్ లాడెన్ ఇష్యూ స్టేషన్‌ పేరుతో CIA ఒక ప్రయోగాత్మక "కాల్పనిక స్థావరాన్ని" ఏర్పాటు చేసింది. 1996 వసంతంలో CIAలోకి మారిన అల్-ఫదల్ సదరు స్థావరానికి అల్‌ఖైదా నేత యొక్క సరికొత్త ఇమేజ్‌ను సంతరించి పెట్టడం ప్రారంభించాడు. అతను తీవ్రవాద పెట్టుబడిదారుడు మాత్రమే కాక తీవ్రవాద నిర్వాహకుడు కూడా. FBI ప్రత్యేక ఏజెంట్ డాన్ కొలెమన్ (అతను తన భాగస్వామి జాక్ క్లూనాన్ ఇద్దరూ కూడా బిన్ లాడెన్ స్థావరానికి "మద్దతిచ్చారు")ను అల్‌ఖైదా యొక్క "రోసెట్టా స్టోన్‍‌"గా పిలిచేవారు.[87]

1999లో అల్‌ఖైదాను ఎదుర్కోవడానికి CIA చీఫ్ జార్జ్ టెనెట్ భారీ "వ్యూహ" రచన చేశాడు. తీవ్రవాద నిరోధన కేంద్రం, దాని కొత్త చీఫ్ కోఫర్ బ్లాక్‌ మరియు కేంద్రం యొక్క బిన్ లాడెన్ విభాగం వ్యూహాన్ని అభివృద్ధి చేసేవారు మరియు అమలు చేసేవారు. అది ఒక్కసారి సిద్ధం కాగానే దాని యొక్క ఎత్తుగడలపై పర్యవేక్షణకు "అల్‌ఖైదా సెల్"ను ఏర్పాటు చేయమని CIA గూఢచార చీఫ్ చార్లెస్ E. అలెన్‌ను టెనెట్ ఆదేశించాడు.[88] 2000లో CIA మరియు USAF సంయుక్తంగా ఆఫ్గనిస్తాన్‌పై ఒక చిన్న రిమోట్ ద్వారా నియంత్రించే పైలట్ రహిత విమానాలను వరుసగా పంపారు. దోపిడీదారుడుగా పిలవబడే దాని ద్వారా వారు బిన్ లాడెన్ మాదిరిగా ఉండే ఛాయాచిత్రాలను పొందారు. బిన్ లాడెన్ మరియు ఇతర అల్‌ఖైదా నేతలను మట్టుబెట్టడానికి ప్రయత్నించే విధంగా వారు దోపిడీదారు విమానాలను క్షిపణుల ద్వారా ఆయుధీకరించడానికి కోఫర్ బ్లాక్ మరియు ఇతరులు అడ్వొకేట్లుగా మారారు. తీవ్రవాదంపై 4 సెప్టెంబరు 2001న కేబినెట్-స్థాయి ప్రిన్సిపల్స్ కమిటీ సమావేశం తర్వాత పర్యవేక్షక విమానాలను CIA పునరుద్ధరించింది. ఆ పైలట్ రహిత విమానాలు ప్రస్తుతం ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

అల్‌ఖైదా యొక్క "గజ చిత్ర" విశ్లేషణ లోటును అధిగమించడానికి CIA 2001లో స్ట్రాటజిక్ అసెస్‌మెంట్స్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే లక్షిత వ్యూహాలను తప్పకుండా అభివృద్ధి చేయడానికి కూడా. ఈ విభాగాన్ని జులై, 2001లో లాంఛనప్రాయంగా ఏర్పాటు చేశారు. అయితే అది సిబ్బంది కొరతను ఎదుర్కొంది. ఈ విభాగ అధిపతి 10 సెప్టెంబరు 2001న బాధ్యతలు స్వీకరించాడు.[89][90][91]

9/11 తర్వాత, దాడులను నిరోధించడంలో తగినంత కృషి చేయలేదని CIA తీవ్ర విమర్శను ఎదుర్కొంది. అయితే అంతకుముందు రెండేళ్లుగా సంస్థ యొక్క వ్యూహాత్మక ప్రయత్నాలను చూపుతూ ఈ విమర్శను టెనెట్ తిప్పికొట్టాడు. అంతేకాక "ఆఫ్గన్ ఆభయారణ్యం" మరియు "ప్రపంచవ్యాప్తంగా తొంబై రెండు దేశాల్లో" దాడులపై త్వరితగతిన మరియు సమర్థవంతంగా స్పందించే రీతిలో సంస్థను నిలబెట్టడం వెనుక CIA యొక్క ప్రయత్నాలు ఉన్నాయని అతను అభిప్రాయపడ్డాడు.[92] కొత్త వ్యూహాన్ని "వరల్డ్‌వైడ్ అటాక్ మ్యాట్రిక్స్‌"గా పిలిచారు.

2003 ఇరాక్ యుద్ధం

గూఢచర్యం అందుబాటులో ఉన్నా లేదా లేకపోయినా లేదా బుష్ యంత్రాంగం సమర్పించకపోయినా 2003 ఇరాక్ దాడిని సమర్థించినా లేదా కచ్చితమైన వ్యూహాన్ని అనుమతించినా, ప్రత్యేకించి ఆక్రమణకు అనేవి చాలా వివాదాస్పదంగా మారాయి. అయితే ఒకరి కంటే ఎక్కువ మంది CIA ఉద్యోగులు ఈ విధంగా స్పష్టం చేశారు, బుష్ యంత్రాంగానికి చెందిన అధికారులు ఇరాక్‌కు సంబంధించి ప్రకటించిన తమ విధాన అంతరాలకు మద్దతిచ్చే విధంగా కచ్చితమైన తీర్మానాలు చేసేలా CIA విశ్లేషకులపై వారు విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు.[citation needed]

CIA స్పెషల్ యాక్టివిటీస్ డివిజన్‌ పారామిలిటరీ బృందాలు జులై, 2002లో ఇరాక్‌ చేరిన తొలి బృందాలు. US సైనిక దళాలు ఒకటి తర్వాత మరొకటి ప్రవేశించే విధంగా మైదానంలో వారి కోసం యుద్ధ క్షేత్రాన్ని సిద్ధం చేశారు. SAD బృందాలు తర్వాత US ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌ (నార్తర్న్ ఇరాక్ లియాసన్ ఎలిమెంట్ లేదా NILE అని పిలుస్తారు)తో జతకట్టాయి.[93] తదనంతర US-నేతృత్వంలోని దాడి కోసం ఈ బృందం ఖుర్దిష్‌ పెష్‌మెర్గా దళాలను నిర్వహించింది. అల్‌ఖైదా మిత్ర విభాగమైన అన్సార్ అల్-ఇస్లాంను ఓడించడానికి ఆ రెండు జతకట్టాయి. ఒకవేళ ఈ యుద్ధం విజయవంతం కాకపోయి ఉంటే, తదనంతర సద్దాం సైన్యంపై దాడిలో US/ఖుర్దిష్ దళాల వెనుక చెప్పుకోదగ్గ విధంగా శత్రు సేనలు చేరి ఉండేవి. US సైన్యాన్ని SAD/SOGకి చెందిన పారామిలిటరీ ఆపరేషన్ల అధికారులు మరియు ఆర్మీ యొక్క 10వ స్పెషల్ ఫోర్సెస్ గ్రూప్ నిర్వహించింది.[93][94][95]

SAD బృందాలు సీనియర్ నాయకత్వ లక్ష్యాలను గుర్తించడానికి ఇరాక్ సరిహద్దుల వెనుక అత్యంత ప్రమాదకరమైన ప్రత్యేక పర్యవేక్షక మిషన్లను చేపట్టాయి. ఈ మిషన్లు సద్దాం హుస్సేన్ మరియు అతని కీలక సేనానులపై ప్రాథమిక దాడులకు ఉపక్రమించాయి. నియంత హుస్సేన్‌ను హతమార్చడానికి చేసిన ప్రాథమిక దాడి విఫలమైనప్పటికీ, అతని దళాలపై అతని యొక్క నియంత్రణా సామర్థ్యానికి మాత్రం సమర్థవంతంగా చెక్ పెట్టగలిగింది. కీలక సేనానుల (జనరళ్లు)పై జరిపిన ఇతర దాడులు విజయవంతమయ్యాయి మరియు US నేతృత్వంలోని దళాలను తిప్పికొట్టే కమాండ్ యొక్క సామర్థ్యాన్ని చెప్పుకోదగ్గ విధంగా తగ్గించ గలిగాయి.[93][96]

NATO సభ్య దేశం టర్కీ దాడి కోసం తన భూభాగాన్ని US ఆర్మీ యొక్క 4వ పదాతిదళ విభాగం ఉపయోగించుకోకుండా తిరస్కరించింది. ఫలితంగా SAD, US ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ సంయుక్త బృందాలు మరియు ఖుర్దిష్ పెష్‌మెర్గా దళం కలిసి దాడి సమయంలో సద్దాం సైన్యంపై ఉత్తర దళంగా తిరగబడ్డాయి. వాటి ప్రయత్నాల ఫలితంగా ఇరాక్ సైన్యం యొక్క 1వ మరియు 5వ విభాగాలు దక్షిణ భాగం నుంచి బయలుదేరిన సంకీర్ణ దళంతో పోరాడటానికి వెళ్లడం కంటే ఖుర్దుల నుంచి కాపాడే విధంగా పనిచేశాయి. US స్పెషల్ ఆపరేషన్లు మరియు ఖుర్దిష్ దళం రెండూ సద్దాం సైన్యాన్ని మట్టికరిపించాయి. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై సాధించిన విజయం తరహాలో ఇది ఒక గొప్ప సైనిక విజయం.[93] SAD/SOG బృందానికి చెందిన నలుగురు సభ్యులు వారి యొక్క "వీరోచిత పోరాటాల"కు CIA యొక్క అరుదైన ఇంటెలిజెన్స్ స్టార్‌ అవార్డును అందుకున్నారు.[97]

మాదకద్రవ్యాల అక్రమరవాణా


CIA డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌‌ యొక్క రెండు కార్యాలయాలు దీనికి సంబంధించి విశ్లేషణాత్మక సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్‌నేషనల్ ఇష్యూస్[98] అనేది విశిష్టమైన బాధ్యతలు కలిగి నిపుణులైన సిబ్బందిని కలిగి ఉంటుంది. వారు US జాతీయ భద్రతకు ప్రస్తుతం ఉన్న మరియు రాబోయే ముప్పులను అంచనా వేస్తారు. అంతేకాక అపారమైన అనుభవమున్న US విధాన రూపకర్తలను, సైనిక వ్యూహకర్తలతో పాటు విశ్లేషణతో కూడిన చట్టపరమైన అమలు, హెచ్చరిక మరియు సంక్షోభ మద్దతును అందిస్తారు.

CIA క్రైమ్ అండ్ నార్కోటిక్స్ సెంటర్[99] ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ ట్రాఫికింగ్‌ మరియు విధాన రూపకర్తలు మరియు చట్టపరమైన అమలు వర్గం యొక్క సంఘటిత నేరంపై సమాచార పరిశోధన జరుపుతుంది. CIAకి దేశీయ పోలీసు అధికారం లేని కారణంగా అది తన యొక్క విశ్లేషణాత్మక సమాచారాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (FBI) మరియు డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA), అమెరికా సంయుక్తరాష్ట్రాల కోశాధికార విభాగం (OFAC)కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్‌ కంట్రోల్‌ వంటి ఇతర చట్టపరమైన అమలు సంస్థలకు నివేదిస్తుంది.

CIA యొక్క మరో విభాగం ఈ ఏరియాల్లోని నేషనల్ క్లాండిస్టైన్ సర్వీస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ (HUMINT)ను సేకరిస్తుంది.

Dr. అల్ఫ్రెడ్ W. మెక్‌కాయ్‌, గ్యారీ వెబ్‌ మరియు ఇతరులు జరిపిన అధ్యయనం ఈ విధంగా పేర్కొంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమరవాణాలో CIA జోక్యం కల్పించుకుంది. అయితే ఈ ఆరోపణలను CIA అధికారికంగా ఖండించింది.[100][101] ప్రచ్ఛన్నయుద్ధం సమయంలో అంటే పలువురు సైనికులు వైమానిక సంస్థ ఎయిర్ అమెరికా[citation needed]ద్వారా ఆగ్నేయాసియా హెరాయిన్‌ను అమెరికా సంయుక్తరాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నప్పడు ఆ విధమైన రవాణాలో CIA యొక్క పాత్రను అటువంటి ఆస్తులపై శత్రువుల సాధ్యపరమైన నియంత్రణను నిరోధించే దిశగా సంబంధిత లాభాలను "తిరిగి పొందడం" వంటిదని సువ్యవస్థీకరించినట్లు తెలిసింది. గ్యారీ వెబ్ మరియు ఇతర పరిశోధకులు రీగాన్ హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నికార్గువా ప్రభుత్వం, ప్రచ్ఛన్నయుద్ధం సమయంలో ఆఫ్గనిస్తాన్‌లో US జోక్యం మరియు పాకిస్తాన్‌కు చెందిన ISI గూఢచార సంస్థతో ప్రస్తుత CIA జోక్యానికి వ్యతిరేకంగా జరిగిన కాంట్రా యుద్ధ సమయంలో చోటు చేసుకున్న అదే విధమైన కార్యకలాపాల గురించి ప్రస్తావించారు. పాకిస్తాన్‌లోని ఆఫ్గన్ హెరాయిన్‌ రిఫైనింగ్ విషయంలో ISIకి సంబంధాలున్నాయి.[citation needed]

కాంగ్రెస్‌తో అబద్ధం

అమెరికా సంయుక్తరాష్ట్రాల ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి వాటర్‌బోర్డింగ్ మరియు ఇతర హింసలకు సంబంధించి CIA 2001 నుంచి కాంగ్రెస్‌ను అదేపనిగా తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. ఆ కార్యక్రమాల గురించి తనకు చెప్పినట్లు పెలోసి అంగీకరించడం గమనార్హం.[102][103] 2001 నుంచి కొన్నేళ్లుగా CIA నిశ్చయార్థకంగా కాంగ్రెస్‌కు అబద్ధం చెప్పడం సహా సాధారణంగా కాంగ్రెస్‌ను మోసం చేస్తోందని CIA డైరెక్టర్ పెనెట్టా అంగీకరించినట్లు కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు సభ్యులు పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో ఈ విధంగా CIA అబద్ధాలాడటం చాలా కాలంగా పరిపాటేనని కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు.[104]

కాంగ్రెస్‌కు తెలియకుండా కోవర్టు కార్యకలాపాలు

10 జులై 2009న హౌస్ ఇంటెలిజెన్స్ సబ్‌కమిటీ ఛైర్‌వుమన్ ప్రతినిధి జాన్ షాకోవ్‌స్కీ(D, IL) పేరులేని ఒక CIA కోవర్టు కార్యకలాపాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సుమారు ఎనిమిదేళ్లగా కాంగ్రెస్‌కు తెలియకుండా రహస్యంగా ఉంచిన అది సహజంగా "చాలా ప్రమాదకరం" అని అభివర్ణించింది.[105]

"It's not as if this was an oversight and over the years it just got buried. There was a decision under several directors of the CIA and administration not to tell the Congress."

Jan Schakowsky, Chairwoman, U.S. House of Representatives Intelligence Subcommittee

ఈ కోవర్టు కార్యకలాపం గురించి కాంగ్రెస్‌కు ఎందుకు తెలియజేయలేదనే విషయంపై అంతర్గత విచారణకు CIA డైరెక్టర్ పెనెట్టా ఆదేశించారు. హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ రెప్రజెంటేటివ్ ఛైర్మన్ సిల్వెస్టర్ రేస్‌ జాతీయ భద్రతా చట్టంను CIA ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తుకు తాను ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. ఈ చట్టం కింద కోవర్టు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని కాంగ్రెస్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఓవర్‌సైట్ సబ్‌కమిటీ ఛైర్‌వుమన్ షాకోవ్‌స్కీ కాంగ్రెస్ దర్యాప్తు కోసం HPSCI ఛైర్మన్ సిల్వెస్టర్ రేస్‌కు విజ్ఞప్తి చేస్తానని ప్రకటించింది.

"Director Panetta did brief us two weeks ago -- I believe it was on the 24th of June -- ... and, as had been reported, did tell us that he was told that the vice president had ordered that the program not be briefed to the Congress."

Dianne Feinstein, Chairwoman of the U.S. Senate Select Committee on Intelligence

టైటిల్ 50 ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కోడ్ చాప్టర్ 15, సబ్‌చాప్టర్ III ప్రకారం, US యొక్క కీలక ప్రయోజనాలను దెబ్బతీయగలిగే కోవర్టు కార్యకలాపాల ఫలితాలను తెలుసుకోవడంపై పరిమిత ప్రవేశం తప్పనిసరైన నేపథ్యంలో అధ్యక్షుడు గ్యాంగ్ ఆఫ్ ఎయిట్ (సెనేట్ మరియు ప్రతినిధుల సభలకు చెందిన రెండు పార్టీల్లోని ప్రతి దాని యొక్క నేతలు మరియు గూఢచర్యంపై సెనేట్ కమిటీ మరియు ప్రతినిధుల కమిటీకి సంబంధించిన ఛైర్‌పర్శన్‌లు మరియు హోదా కలిగిన సభ్యులు)కు సత్వరం నివేదించాల్సి వచ్చింది.[106] కోవర్టు కార్యకలాపాల గురించి సుమారు 40 మందికి పైగా కాంగ్రెస్ సభ్యులకు అధ్యక్షుడు తెలిపే నిబంధన సహా 2010 గూఢచార అధీకృత బిల్లుకు ప్రతినిధుల సభ మద్దతు తెలిపే అవకాశముంది. అలాంటి నిబంధనను చేర్చినందుకు బిల్లులోని ఆఖరి వెర్షన్‌ను వీటో (ప్రత్యేక శాసనాధికారం) ద్వారా తిరస్కరిస్తామని ఒబామా యంత్రాంగం హెచ్చరించింది.[107][108] 16 జులై 2008న ఆర్థిక సంవత్సరం 2009 గూఢచార అధీకృత బిల్లు ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. అయితే సున్నితమైన కోవర్టు కార్యకలాపాల గురించి హౌస్ ఇంటెలిజెన్స్ ప్యానెల్‌కు చెందిన సభ్యులందరికీ తెలిపేంత వరకు వాటికి అవసరమైన సొమ్ములో 75% విడుదల చేయడం కుదరదనే నిబంధన అందులో ఉంది. జార్జ్ W. బుష్ యంత్రాంగం హయాంలో అధ్యక్షుడి యొక్క సీనియర్ సలహాదారులు ఈ విధంగా స్పష్టం చేశారు, ఈ విధమైన నిబంధన కలిగిన ఏ బిల్లుయైనా సరే అధ్యక్షుడి దృష్టికి వస్తే, దానిని వీటో ద్వారా తిరస్కరించమని అతనికి సిఫారసు చేస్తాం.[109]

అయితే ఇది హత్యల కార్యక్రమం[110][111] అంటూ జులై 23న అనామక ప్రభుత్వ అధికారులు కొన్ని పుకార్లు పుట్టించినట్లు వార్తలొచ్చాయి. అయితే అది ఇప్పటికీ రూఢీ కాలేదు. "కమిటీ మొత్తం ఒక్కసారిగా కంగుతింది....ఇది చాలా ప్రమాదకరమని నేను అనుకుంటున్నాను," అని సబ్‌కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, U.S. హౌస్ పర్మినెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్(HPSCI) ఛైర్మన్ అన్నా ఎషో వ్యాఖ్యానించాడు.

డైరెక్టర్ పెనెట్టా ఆరోపణలు ఈ విధంగా తెలిపాయి, US మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ ఆదేశాల మేరకు రహస్య తీవ్రవాద నిరోధక కార్యక్రమ వివరాలను కాంగ్రెస్ ఉపసంహరించుకుంది. ఇది ఎవరూ కూడా చట్టాన్ని అతిక్రమించరాదనే విధంగా సెనేటర్ ఫీన్‌స్టెయిన్ మరియు సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్‌, సెనేటర్ ప్యాట్రిక్ లీహీలను ప్రేరేపించింది.[112] "ఎలాంటి ప్రయత్నం చేపట్టబోతున్నామన్న విషయాన్ని సంస్థ బహిరంగంగా చర్చించదు, అది వర్గీకరించినట్లుగానే ఉంటుంది," అని ఏజెన్సీ ప్రతినిధి పాల్ జిమిగ్లియానో అన్నాడు.[113]

వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయం బాగా తెలిసిన మాజీ గూఢచార అధికారులను తెలుపుతూ ఈ విధంగా పేర్కొంది, అల్‌ఖైదా నేతలను పట్టుకోవడం లేదా హతమార్చే విధంగా 2001 అధ్యక్షపరమైన అధికారం పొందడానికి ఈ కార్యక్రమం ఒక ప్రయత్నం వంటిది.[114]

గూఢచార కమిటీ దర్యాప్తు

17 జులై 2009న హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఈ రహస్య కార్యక్రమంపై ఒక లాంఛనప్రాయ దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.[115] ప్రతినిధులు సిల్వస్టర్ రేస్ ఈ విధంగా అన్నాడు, "కమిటీ నుంచి సమాచారం బయటకు రాకుండా ఆపి ఉంచేలా ఏదైనా గత నిర్ణయం లేదా ఆదేశం ఉందా?" అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది.

"Is giving your kid a test in school an inhibition on his free learning?” Holt said. “Sure, there are some people who are happy to let intelligence agencies go about their business unexamined. But I think most people when they think about it will say that you will get better intelligence if the intelligence agencies don’t operate in an unexamined fashion.[116] "

Rush Holt, Chairman, House Select Intelligence Oversight Panel, Committee on Appropriations

దర్యాప్తుకు పిలుపునిచ్చిన సబ్‌కమిటీ ఆన్ ఓవర్‌సైట్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఛైర్మన్ మరియు కాంగ్రెస్ మహిళా సభ్యురాలు జాన్ షాకోవ్‌స్కీ (D, IL) ఈ విధంగా తెలిపింది, ఈ దర్యాప్తు ప్రధానంగా నాలుగు అంశాలకు సంబంధించి కాంగ్రెస్‌కు పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ తెలియజేయడంలో CIA వైఫల్యాలను ఎత్తిచూపే విధంగా సాగుతుంది: 2001లో పెరూలో పొరపాటున మాదకద్రవ్యాల విమానమనుకుని ఒక యంత్రసామగ్రి విమానాన్ని కిందకు దింపడంలో C.I.A. జోక్యం మరియు రెండు "అంశాలు వర్గీకృతంగానే ఉన్నాయి ", అదే విధంగా పుకారు హత్యల ప్రశ్న. అదనంగా, ఈ దర్యాప్తు అనుమతులు లేకుండా దొంగచాటుగా వినే బుష్ యంత్రాంగం యొక్క కార్యక్రమం మరియు దాని నిర్బంధం, దర్యాప్తుపై ఈ విచారణ దృష్టి సారించే అవకాశముంది. U.S. పౌరులు ఇతర అమెరికన్లు లేదా అమెరికా సంయుక్తరాష్ట్రాలను గనుక హెచ్చరించిన పక్షంలో వారిని హతమార్చేందుకు U.S. గూఢచార వర్గం సమాయత్తమవుతోందని ప్రోగ్రామ్[117] U.S. ఇంటెలిజెన్స్ చీఫ్ డెన్నిస్ బ్లెయిర్ 3 ఫిబ్రవరి 2010న హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ఎదుట నిరూపించాడు.[118] అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఈ విధంగా పేర్కొంది, ఈ విధానం "ఆచరణాత్మకంగా ఇబ్బందికరమైనది" ఎందుకంటే U.S. పౌరులు "విదేశాల్లో ఉన్నా కూడా అర్హమైన ప్రక్రియకు సంబంధించి వారి యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కును కలిగి ఉన్నారు." ACLU కూడా "ఈ విధానానికి సంబంధించి బహిరంగ సమాచారం కొరతపై మరియు అనియంత్రిత ప్రత్యేక అధికార దుర్వినియోగం యొక్క సంభావ్యతపై కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది."[119]

సూచనలు

 1. 1.0 1.1 "CIA Frequently Asked Questions". cia.gov. 2006-07-28. Retrieved 2008-07-04.
 2. Crile, George (2003). Charlie Wilson's War. Grove Press. ISBN 0871138549.
 3. Kopel, Dave (1997-07-28). "CIA Budget: An Unnecessary Secret". Retrieved 2007-04-15.
 4. "Cloak Over the CIA Budget". 1999-11-29. Retrieved 2008-07-04.
 5. Caroline Wilbert. "How the CIA Works". HowStuffWorks.
 6. Kinzer, Stephen (2008). All the Shah's men. ISBN 0471265179.
 7. "మెక్‌లీన్ CDP, వర్జీనియా." U.S. సెన్సెస్ బ్యూరో. 1 సెప్టెంబరు 2009న తిరిగి పొందబడింది.
 8. Rosen, Nir. "Unsavory allies stack CIA's deck". post-gazette.com. Retrieved 2008-07-04.
 9. Smith, R. Jeffrey (2004-06-09). "Soldier Described White House Interest". Yurica Report. Retrieved 2008-07-04.
 10. Aven, Daniel (2007-08-08). "O'Donnell Tackles CIA On "The Company": Actor Discusses Playing Agent On New TNT Miniseries". CBS News. Retrieved 2009-03-29.
 11. Agee, Philip (January 1, 1984). Inside the Company: CIA Diary. Bantam. ISBN 055326012X.
 12. Littell, Robert (April 11, 2002). The Company: A Novel of the CIA. Overlook. ISBN 1585671975.
 13. Chris O'Donnell, Alfred Molina (2007). The Company (DVD). Sony Pictures. ( సుమారు 40 ఏళ్లకు పైగా CIA కార్యకలాపాల గుర్తింపు)
 14. "Declaration of Steven Aftergood". 5 May 2003. Case No. 02-1146 (RMU). Unknown parameter |defendant= ignored (help); Unknown parameter |plaintiff= ignored (help); Unknown parameter |court= ignored (help)
 15. Shane, Scott (8 November 2005). "Official Reveals Budget for U.S. Intelligence". New York Times.
 16. "CIA Support to the US Military During the Persian Gulf War". Central Intelligence Agency. 1997-06-16.
 17. CIA Abbreviations and Acronyms
 18. Reiss Jr, Robert J. Jr. (2006 Summer Edition). "The C2 puzzle: Space Authority and the Operational Level of War" ([dead link]). Army Space Journal. Check date values in: |date= (help)
 19. "Center for the Study of Intelligence". cia.gov. 2006-07-16.
 20. "Kent Center Occasional Papers". cia.gov.
 21. "CIA Sets Changes To IG's Oversight, Adds Ombudsman". Washington Post: A03. February 2, 2008. |first= missing |last= (help)
 22. Mark Mazzetti (February 2, 2008). "C.I.A. Tells of Changes for Its Internal Inquiries". New York Times.
 23. "Fifty Years of Service to the Nation". cia.gov. 2006-07-16.
 24. Central Intelligence Agency. "Intelligence & Analysis".
 25. "Office of Terrorism Analysis".
 26. "Office of Transnational Issues".
 27. "CIA Crime and Narcotics Center".
 28. "Weapons Intelligence, Nonproliferation, and Arms Control Center".
 29. "Counterintelligence Center Analysis Group".
 30. "Information Operations Center Analysis Group".
 31. Richelson, Jeffrey, ed. (May 23, 2001). "The Pentagon's Spies". George Washington University National Security Archive Electronic Briefing Book No. 46.
 32. Blanton, Thomas S.; Martin, Michael L. (July 17, 2000). "Defense HUMINT Service Organizational Chart". The "Death Squad Protection" Act: Senate Measure Would Restrict Public Access to Crucial Human Rights Information Under the Freedom of Information Act. George Washington University National Security Archive Electronic Briefing Book No. 34. |first3= missing |last3= (help)
 33. "Science, Technology and the CIA". National Security Archive, The George Washington University. 2001-09-10.
 34. Rick E. Yannuzzi. "In-Q-Tel: A New Partnership Between the CIA and the Private Sector". Central Intelligence Agency, with permission from the Defense Intelligence Journal.
 35. The OSS Assessment Staff (1948). Assessment of Men, Selection of Personnel for the Office of Strategic Services. Rinehart and Company, Inc. Unknown parameter |comment= ignored (help)
 36. Mercado, Stephen (2007-04-15). "Reexamining the Distinction Between Open Information and Secrets". Central Intelligence Agency Center for the Study of Intelligence. Retrieved 2008-07-04.
 37. "Joint Publications Research Service (JPRS)". Unknown parameter |organization= ignored (help)
 38. CIA Maps & Publications. ISBN 1422008258.
 39. Thomas Claburn (2008-02-06). "CIA Monitors YouTube For Intelligence". InformationWeek. Retrieved 2008-02-11.
 40. "Intelligence Authorization Act for Fiscal Year 2008, Conference Committee Report" (PDF). December 6, 2007.
 41. 41.0 41.1 Hillhouse, R.J. (July 8, 2007). "Who Runs the CIA? Outsiders for Hire". washingtonpost.com. Retrieved 2008-07-04.
 42. Keefe, Patrick Radden (June 25, 2007). "Don't Privatize Our Spies". The New York Times. Retrieved 2008-07-04.
 43. 43.0 43.1 43.2 43.3 Hillhouse, R.J. (December 18, 2007). "CIA Contractors: Double or Nothin'".
 44. Shorrock, Tim (2008-05-29). "Former high-ranking Bush officials enjoy war profits". Salon.com. Retrieved 2008-06-16.
 45. Hurt III, Harry (2008-06-15). "The Business of Intelligence Gathering". The New York Times. Retrieved 2008-06-18.
 46. Butler, Amy (March 20, 2005). "SBIRS High in the Red Again". Aviation Week.
 47. Taubman, Philip (November 11, 2007). "Failure to Launch: In Death of Spy Satellite Program, Lofty Plans and Unrealistic Bids". New York Times.
 48. Rich, Ben R. (1996). Skunk Works: A Personal Memoir of My Years of Lockheed. Back Bay Books. ISBN 0316743305. Unknown parameter |isbn-10= ignored (help)
 49. US Defense Information Services Agency (March 19, 1999). "DMS (Defense Messaging Service) Genser (General Service) Message Security Classifications, Categories, and Marking Phrase Requirements Version 1.2" (PDF).
 50. 50.0 50.1 Factbook on Intelligence. Central Intelligence Agency. 1992. pp. 4–5. Unknown parameter |month= ignored (help); |access-date= requires |url= (help)
 51. Troy, Thomas F. (1993-09-22). "Truman on CIA". cia.gov. p. 6. Retrieved 2007-04-15.[dead link]
 52. "Special Forces Roll of Honour: Central Intelligence Agency".
 53. ఆర్మీ & నావీ - MERGER: నావీ కాంప్రమైజ్, TIME మేగజైన్ , 10 డిసెంబరు 1945
 54. Warner, Michael. "The Creation of the Central Intelligence Group". cia.gov. Retrieved 2007-04-15.[dead link]
 55. Zegart, Amy B. (2007-09-23). "The CIA's license to fail". The Los Angeles Times.
 56. "George Tenet v. John Doe" (PDF). Federation of American Scientists. 2006-07-16. Retrieved 2008-07-04.
 57. Schecter, Jerrold L.; Deriabin, Peter S. (1992). The Spy Who Saved the World: How a Soviet Colonel Changed the Course of the Cold War. Scribner. ISBN 0684190680.
 58. Patti, Archimedes L. A (1980). Why Viet Nam?: Prelude to America's albatross. University of California Press. ISBN 0520041569. Unknown parameter |isbn-10= ignored (help)
 59. 59.0 59.1 Adams, Sam (1994). War of Numbers: an Intelligence Memoir. Steerforth Press. ISBN 188364223X.
 60. 60.0 60.1 60.2 60.3 60.4 60.5 Frum, David (2000). How We Got Here: The '70s. New York, New York: Basic Books. pp. 49–51. ISBN 0465041957. Cite has empty unknown parameter: |coauthors= (help)
 61. "Transcript of a recording of a meeting between President Richard Nixon and H. R. Haldeman in the oval office". hpol.org. 1972-06-23. Retrieved 2008-07-04.
 62. Gray III, L. Patrick (2008). [www.lpatrickgrayiii.com In Nixon's Web:A Year in the Crosshairs of Watergate] Check |url= value (help). Times Books/Henry Holt. ISBN 0805082565. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 63. "Executive Order 13470". Fas.org. Retrieved 2010-03-16.
 64. అసోసియేటెడ్ ప్రెస్‌లో 31 జులై 2008న ప్రచురితమైన "బుష్ ఆర్డర్స్ ఇంటెలిజెన్స్ ఓవరాల్"
 65. Blum, William (1986). The CIA: A Forgotten History. Zed Books. ISBN 0-86232-480-7.
 66. Weiner, Tim (2007). Legacy of Ashes. Doubleday. ISBN 978-0-385-51445-3.
 67. "నికోలస్ డజ్‌మూవిక్ యొక్క 'లెగసీ ఆఫ్ యాషెస్: ది హిస్టరీ ఆఫ్ CIA'" సమీక్ష, CIA సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇంటెలిజెన్స్, 26 నవంబరు 2007
 68. Richelson, Jeffrey (2007-09-11). "Sins of Omission and Commission". Retrieved 2008-07-04.
 69. రూబిన్, అలీస్సా J.; మజ్జెట్టి, మార్క్ (డిసెంబరు 31, 2009). "ఆఫ్గన్ బేస్ హిట్ బై ఎటాక్ హ్యాజ్ పివోటల్ రోల్ ఇన్ కన్‌ఫ్లిక్ట్". న్యూయార్క్ టైమ్స్. http://www.nytimes.com/2010/01/01/world/asia/01afghan.html. జనవరి 1 2010న తిరిగి పొందబడింది.
 70. Baer, Robert (2003). See No Evil: The True Story of a Ground Soldier in the CIA's War on Terrorism. Three Rivers Press. ISBN 140004684X.
 71. Wright, Peter (1987). Spycatcher. William Heinemann. ISBN 0670820555. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (help)
 72. "FBI History: Famous Cases — Aldrich Hazen Ames". Federal Bureau of Investigation. Archived from the original on 2002-06-06. Retrieved 2008-07-04.
 73. McKinley, Cynthia A. S. "When the Enemy Has Our Eyes".
 74. ది CIA: ఆన్ టాప్ ఆఫ్ ఎవిరిథింగ్ ఎల్స్, నాట్ వెరీ గుడ్ అట్ ఇట్స్ జాబ్, 16 ఆగస్టు 2007న ది ఎకనామిస్ట్‌ లో ప్రచురించిన టిమ్ వీనర్ యొక్క లెగసీ ఆఫ్ యాషెస్: ది హిస్టరీ ఆఫ్ ది CIA సమీక్ష.
 75. Weiner, Tim (2006-05-14). "Langley, We Have a Problem". The New York Times. Retrieved 2008-07-04.
 76. Kerber, Linda K. (2006-05-15). "Protecting the Nation's Memory". American Historical Association. Retrieved 2008-07-04.
 77. David Stout, Mark Mazzetti (2007-08-21). "Tenet's C.I.A. Unprepared for Qaeda Threat, Report Says". The New York Times. Retrieved 2008-07-04.
 78. "CIA criticises ex-chief over 9/11". BBC News online. August 22, 2007. Retrieved 2009-12-31.
 79. Stockwell, John (October 1987). "The Secret Wars of the CIA, a lecture". Information Clearing House.
 80. Saunders, Frances Stonor (1999). The Cultural Cold War: The CIA and the World of Arts and Letters. New Press. ISBN 1-56584-664-8.
 81. స్టీవ్ కాల్, ఘోస్ట్ వార్స్ (పెంగ్విన్, 2005 ఎడిషన్), పేజీ 87.
 82. గైల్స్ ఫోడెన్, "బ్లోబ్యాక్ క్రానికల్స్", గార్డియన్ , సెప్టెంబరు 15, 2001; జాన్ కూలీని తెలుపుతూ, అన్‌హోలీ వార్స్: ఆఫ్గనిస్తాన్, అమెరికా అండ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం (ఫ్లూటో ప్రెస్, తేదీ ఇవ్వలేదు)
 83. J. మైఖేల్ స్ప్రింగ్‌మన్ (సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న US దౌత్య కార్యాలయ వలసయేతర వీసా విభాగానికి అధిపతిగా 1987-88 మధ్యకాలంలో పనిచేశాడు)తో ఫాక్స్ TV ఇంటర్వూ యొక్క సహకార పరిశోధనా ప్రతి, జులై 18, 2002.
 84. ఆండ్రూ మార్షల్, "టెర్రర్ 'బ్లోబ్యాక్' బర్న్స్ CIA", ఇండిపెండెంట్ ఆన్ సండే , నవంబరు 1, 1998.
 85. క్లూనాన్ ఫ్రంట్‌లైన్‌ ఇం టర్వూ, PBS, జులై 13, 2005.
 86. పీటర్ L బెర్జన్, హోలీ వార్, ఇంక్: ఇన్‌సైడ్ ది సీక్రెట్ వరల్డ్ ఆప్ ఒసామా బిన్ లాడెన్ (వైడెన్‌ఫీల్డ్ & నికోల్సన్, 2001), పేజీ.65.
 87. జాన్ మేయర్, "జూనియర్ : ది క్లాండిస్టైన్ లైఫ్ ఆఫ్ అమెరికాస్ టాప్ అల్‌ఖైదా సోర్స్", న్యూయార్కర్ , సెప్టెంబరు 11, 2006.
 88. టెనెట్, అట్ ది సెంటర్ ఆఫ్ ది స్టార్మ్ , పేజీలు.119, 120.
 89. 9/11 కమీషన్ రిపోర్ట్ , చాప్టర్ 11, పేజీ.342 (HTML వెర్షన్)
 90. జాయింట్ ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్, మూడో భాగం, పేజీ.387.
 91. టెనెట్ స్టేట్‌మెంట్ టు ది 9/11 కమీషన్, మార్చి 24, 2004, పేజీ.8.
 92. జార్జ్ టెనెట్, అట్ ది సెంటర్ ఆఫ్ ది స్టార్మ్ (హార్పర్ ప్రెస్, 2007), పేజీలు.121–2; cf. పేజీ.178.
 93. 93.0 93.1 93.2 93.3 ప్లాన్ ఆఫ్ ఎటాక్, బాబ్ వుడ్‌వార్డ్, సైమన్ అండ్ షస్టర్, 2004.
 94. Tucker, Mike (2008). Operation Hotel California: The Clandestine War inside Iraq. The Lyons Press. ISBN 9781599213668. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 95. "An interview on public radio with the author". Retrieved 2010-03-16.
 96. బిహైండ్ లైన్స్, ఎన్ అన్‌సీన్ వార్, ఫాయీ బోవర్స్, క్రిస్టియన్ సైన్స్ మానిటర్, ఏప్రిల్ 2003.
 97. ఆపరేషన్ హోటెల్ కాలిఫోర్నియా: ది క్లాండిస్టైన్ వార్ ఇన్‌సైడ్ ఇరాక్, మైక్ టక్కర్, చార్లెస్ ఫ్యాడిస్, 2008, లియోన్స్ ప్రెస్ |isbn=9781599213668
 98. "Office of Transnational Issues".
 99. "CIA Crime and Narcotics Center".
 100. గ్యారీ వెబ్ డార్క్ అలయన్స్
 101. సోలోమన్, నార్మన్, (జనవరి./ఫిబ్రవరి. 1997, "Snow Job". ఎక్స్‌ట్రా!
 102. http://www.bloomberg.com/apps/news?pid=20601103&sid=a0vWnerimBZw. Missing or empty |title= (help)
 103. BBC న్యూస్, మే 14, 2009, "పెలోసి సేస్ CIA సైడ్ ఆన్ 'టార్చర్'" http://news.bbc.co.uk/2/hi/americas/8050930.stm
 104. BBC న్యూస్, జులై 9, 2009, "CIA 'ఆఫన్ లైడ్ టు కాంగ్రెస్‌మెన్'" http://news.bbc.co.uk/2/hi/americas/8143081.stm
 105. http://web.archive.org/web/20090715050326/news.yahoo.com/s/ap/us_congress_secret_briefings. Archived from the original ([dead link]) on 2009-07-15. Missing or empty |title= (help)
 106. "US CODE: Title 50,413b. Presidential approval and reporting of covert actions". Law.cornell.edu. 2009-07-20. Retrieved 2010-03-16.
 107. [1][dead link]
 108. [2][dead link]
 109. "House Passes Intelligence Authorization Bill". washingtonpost.com. Retrieved 2010-03-16.
 110. [3][dead link]
 111. [4][dead link]
 112. "Cheney ordered intel withheld from Congress-senator". Reuters. Retrieved 2010-03-16.
 113. Gorman, Siobhan (2009-07-15). "CIA Plan Envisioned Hit Teams Killing al Qaeda Leaders - WSJ.com". Online.wsj.com. Retrieved 2010-03-16.
 114. Siobhan Gorman (July 13, 2009). "CIA Had Secret Al Qaeda Plan". Wall Street Journal. Retrieved 2009-08-06.
 115. Tabassum Zakaria. "House launches investigation into CIA program". Reuters. Retrieved 2010-03-16.
 116. "Holt Calls for Next Church Committee on CIA « The Washington Independent". Washingtonindependent.com. Retrieved 2010-03-16.
 117. http://www.nytimes.com/2009/07/18/us/politics/18intel.html
 118. Barbara Starr (February 4, 2010). "Intelligence chief: U.S. can kill Americans abroad". CNN.
 119. "Intelligence Official Acknowledges Policy Allowing Targeted Killings Of Americans". American Civil Liberties Union. February 4, 2010.

మరింత చదవడానికి

బాహ్య లింకులు

ఇతర లింకులు