కొంగపాడు

From tewiki
Jump to navigation Jump to search


కొంగపాడు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

కొంగపాడు, ప్రకాశం జిల్లా, అద్దంకి మండలానికి చెందిన గ్రామం.[1]..

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామం పేరు వెనుక చరిత్ర

పూర్వం "కొంగసాని" అనే ఆమె మొదట గడ్డనెత్తడం వల్ల దీనికి కొంగపాడు అనే పేరు వచ్చింది.

గ్రామ భౌగోళికం

ఇది అద్దంకి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

ఈ గ్రామానికి ప్రక్కనే ఉన్న గుండ్లకమ్మ నది ద్వారా త్రాగునీటి సదుపాయము కల్పించబడింది. కానీ సాగుకు అవసరమైన నీరు మాత్రం అందుబాటులో లేదు. గ్రామస్థులు తమ స్వంత ఖర్చుతో బోర్లు వేయించినప్పటికీ సఫలతా శాతం బాగా తక్కువ.

గ్రామ పంచాయతీ

 1. ఈ గ్రామం అద్దంకి మండలంలోని ఒక పంచాయతి. ఊరి జనాభా సుమారు 1000.
 2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మాచవరపు చందన సర్పంచిగా పోటీచేసి గెలుపొందారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

 1. మే 29, 2013 న ఈ గ్రామంలో శ్రీరామాలయం, ఆంజనేయస్వామి విగ్రహము, నాభిశిలా ప్రారంభించారు. ఈ రామాలయము సుమారుగా 60 లక్షల రూపాయల వ్యయముతో, గ్రామ ప్రజలు, ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజల సహకారముతో నిర్మించబడింది.
 2. శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయము.
 3. శ్రీ పోలేరమ్మ గుడి.
 4. శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం.
 5. ఎక్కువమంది కొలిచే దేవుడు శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి.

గ్రామంలో ప్రధాన పంటలు

పొగాకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. సారవంతమైన నల్లరేగడి నేలల్లో అరుదుగా లభించే వర్జీనియా పొగాకు పండిచడంలో ఈ గ్రామం ప్రసిద్ధి చెందినది. పొగాకుతో పాటు శనగ, జూట్, నూగు, మినుము మొదలగు వాణిజ్య పంటలు కూడా పండిస్తారు.

గ్రామ విశేషాలు

 • ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకి బాగా పేరు. గత 10 సంవత్సరాలలో అక్షరాస్యత బాగా పెరిగింది.
 • పొగాకు, రాజకీయాలతో చుట్టుపక్కల గ్రామాల్లో దీనికి బాగా పేరు.
 • వెయ్యిమంది కూడా లేని కొంగపాడు నుంచి ఐఐటి, ఐఐఎం లతో పాటు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన,పదిలో పదికి పది సాధించిన విద్యార్ధులున్నారు
 • ఈ ఊరినుంచి అమెరికా, యూరప్ ఖండాలలో స్థిరపడిన ఉద్యోగులు ఉన్నారు.

కొంగపాడు సేవ

గ్రామంలోని ఉద్యోగులు అందరూ కలిసి 2008 లో "కే - సేవ" అనే స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ప్రతి సంక్రాంతికీ ఆటల పోటీలు నిర్వహిస్తూ గ్రామంలో సమైక్యతా భావమును పెంపొందించుటకు కృషి చేస్తున్నారు. దీనితో పాటుగా వీధిదీపాల నిర్వహణా ఖర్చు, నిరుపేద విద్యార్థులకు ధన సహాయము, ఉద్యోగార్ధులకు సలహాలు, సూచనలు, అందచేస్తూ గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు.

అంతేకాక, గ్రామ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి అల్బనీ-ఆంధ్ర అసోసియేషన్ సహకారం తో, త్రాగునీటి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పారు.

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు ప్రకాశం; 2013,సెప్టెంబరు-4; 1వపేజీ.