"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కొండా సురేఖ
కొండా సురేఖ | |||
నియోజకవర్గము | పరకాల అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 19 ఆగస్టు 1965 ఊకల్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసము | వంచనగిరి |
మాజీ మంత్రి శ్రీమతి శ్రీకొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.[1][2]
జీవిత విశేషాలు
ఆమె వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన ఊకల్ లో 19 ఆగస్టు 1964 తుమ్మ చంద్రమౌళి రాద దంపతులకు జన్మించారు.
రాజకీయ జీవితం
ఆమె 1995లో మండల పరిషత్ కు ఎన్నికైనారు. 1996లో ఆమె ఆంధ్రప్రదేశ్ పి.సి.సి సభ్యురాలిగా నియమింపబడ్డారు. 1999 లో ఆమె శాయంపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు. 1999 లో ఆమె కాంగ్రెస్ లెసిస్లేచర్ పార్టీ కోశాధికారిగానూ, మహిళ, శిశు సంక్షేమశాఖ సభ్యురాలిగానూ, ఆరోగ్య, ప్రాథమిక విద్య కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు.ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా 2000లో నియమింపబడ్డారు.
2004లో శాయంపేట శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు. ఆమె కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైనారు. 2005లో ఆమె మ్యునిసిపల్ కార్పొరేషన్ కు ఎక్స్ అఫీసియో సభ్యురాలిగా ఉన్నారు. 2009 లో పరకాల శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు.
ఆమె వై.యస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆమె మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమ మంత్రిగా కూడా పనిచేసారు.[3] కానీ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆయన కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారీటీ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం యివ్వనందున ఆ పదవికి రాజీనామా చేసారు.[4][5]
జగన్మోహనరెడ్డి కారణంగానూ, రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చడం మూలంగానూ ఆమె జూలై 4 2011 న తన శాసన సభ్య సభ్యత్వానికి రాజీనామా చేసారు.[6]
ఆమె 2012 జూన్ 12 న మరల జరిగిన ఉప ఎన్నికలలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో యై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసారు.
జగన్మోహనరెడ్డి పార్టీ సభ్యుల మూలంగా ఆమె జూలై 2913 న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా ఎన్నికైనారు. 2018లో మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వ్యక్తిగత జీవితం
ఆమె వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్రసమితి ఎం.ఎల్.సి అయిన కొండా మురళిని వివాహమాడారు.[7] వారికి ఒక కుమార్తె శ్రీమతి సుస్మిత పటేల్.
మూలాలు
- ↑ "Konda Surekha Profile". Archived from the original on 2015-10-04. Retrieved 2015-09-23. Cite has empty unknown parameter:
|3=
(help) - ↑ PTI (2011-07-04). "Telangana issue: Jagan loyalist MLA quits". The Hindu. Retrieved 2013-07-19.
- ↑ "Surekha gives a setback to Rosaiah leadership in Andhra Pradesh with resignation". Sify.com. 2009-10-30. Archived from the original on 2012-10-05. Retrieved 2013-07-19.
- ↑ "Andhra minister's resignation accepted". Sify.com. 2009-10-30. Archived from the original on 2012-10-21. Retrieved 2013-07-19.
- ↑ Menon, Amarnath K. and Priya Sahgal "Why Sonia fears Jagan?" India Today November 26, 2010
- ↑ "Cong says it's not opposed to Telangana". Hindustan Times. Retrieved 2013-07-19.
- ↑ http://www.thehindu.com/news/national/andhra-pradesh/konda-couple-joins-trs/article5801843.ece. Missing or empty
|title=
(help)
ఇతర లింకులు
- CS1 errors: empty unknown parameters
- CS1 errors: missing title
- CS1 errors: bare URL
- 1964 జననాలు
- వరంగల్లు గ్రామీణ జిల్లా రాజకీయ నాయకులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- మహిళా రాజకీయ నాయకులు
- తెలంగాణ రాజకీయ నాయకులు
- ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)