"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొండేపూడి శ్రీనివాసరావు

From tewiki
Jump to navigation Jump to search
కొండేపూడి శ్రీనివాసరావు
దస్త్రం:Kondepudi srinivasarao.jpeg
జననం(1924-09-04)సెప్టెంబరు 4, 1924
మరణంజులై 22, 1985(1985-07-22) (వయస్సు 60)
జాతీయతభారతీయుడు
పూర్వ విద్యార్థులువార్సా విశ్వవిద్యాలయం, పోలాండ్
సురరిచితుడుఅధ్యక్షుడు, అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా
Notable work
సంసార సుఖం, క్రోధం

కొండేపూడి శ్రీనివాసరావు అభ్యుదయ రచయిత, ఇండో సోవియట్ కల్చరల్ సొసైటి(ఇస్కస్) నిర్మాత,బహుభాషా కోవిదుడు,వ్యాపారవేత్త.అంతర్జాతీయ శాంతి కాముకుడు.

జీవిత విశేషాలు

ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలం బొండాడ గ్రామంలో సెప్టెంబరు 4, 1924న జన్మించాడు. ఇతడు పోలాండ్ దేశంలోని వార్సా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ పట్టభద్రుడయ్యాడు.విదేశీ కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు.గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. అరసం రాష్ట్రశాఖకు కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటిని స్థాపించాడు. ఇండో జి.డి.ఆర్.మిత్రమండలి జాతీయ సమితి కార్యదర్శిగా పనిచేశాడు. ఇండియన్ టొబాకో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. బల్గేరియా మిత్ర సంఘం, శాంతి సంఘీభావ సమితి మొదలైన సంస్థల నాయకుడిగా కృషి చేశాడు. పులుపుల వెంకటశివయ్య సాహిత్య అవార్డును పొందారు.ఇతడు 1985, జూలై 22న మరణించాడు. ఇతని మరణానంతరం అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లాశాఖ పెనుగొండ లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో "స్మృతిరేఖలు" పేరుతో ఒక స్మారక సంచికను ప్రచురించింది. ఈ సంస్థ 1986 నుండి ఈయన పేరుతో కొండేపూడి సాహిత్య అవార్డులు ప్రకటిస్తున్నది.

కొండేపూడి సాహిత్య అవార్డు గ్రహీతలు

అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు శాఖ కొండేపూడి శ్రీనివాసరావు మరణానంతరం అతని స్మృత్యర్థం 1986 నుండి 2016 వరకు కొండేపూడి సాహితీసత్కారాన్ని అతని కుటుంబ సభ్యుల సహకారంతో ప్రదానం చేసింది. ఈ సత్కారాన్ని పొందిన సాహితీవేత్తలు[1]:

రచనలు

పురస్కారాలు

  • 1974లో సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అనే రచనకు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు పురస్కారం.
  • సోవియట్ అర్మేనియాపై జరిగిన అంతర్జాతీయ క్విజ్ పోటీలో ద్వితీయ బహుమతి.
  • జర్మన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ సొసైటీ ఫర్ ఫ్రెండ్‌షిప్ వారిచే బంగారు పతకం.

వనరులు

  • స్మృతిరేఖలు (కొండేపూడి శ్రీనివాసరావు సంస్మరణ సంచిక) - సంపాదకుడు: పెనుగొండ లక్ష్మీనారాయణ - ప్రచురణ:అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ.

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).

  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284. Check date values in: |date= (help)