"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొత్తపల్లి వీరభద్రరావు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Kottapalli veerabhadrarao.jpg
కొత్తపల్లి వీరభద్రరావు

కొత్తపల్లి వీరభద్రరావు 5 దశాబ్దాలపాటు పలు విశ్వవిద్యాలయాలలో పనిచేసిన తెలుగు ఆచార్యులు. ఇతడు రాజమండ్రిలో కొత్తపల్లి వెంకటరత్న శర్మ, రామమ్మ దంపతులకు జన్మించాడు.

జీవిత విశేషాలు

ఇతడు 1942లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అదే విశ్వవిద్యాలయం నుండి 1956లో తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా సాధించాడు. ఇతడికి తెలుగు భాషతో పాటుగా సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, పంజాబీ, రష్యన్, ఫ్రెంచి భాషలలో ప్రావీణ్యం ఉంది. ఇతడు విజయనగరం లోని మహారాజా కళాశాలలో ప్రాచ్యభాషావిభాగానికి అధిపతిగా పనిచేశాడు. తర్వాత తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్ యూనివర్సిటీ (మాడిసన్, అమెరికా) లలో పనిచేశాడు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. మలేషియాలో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యాడు.

పదవులు

రచనలు

  1. సి.పి.బ్రౌన్[1]
  2. మహతి (స్వాతంత్ర్య యుగోదయంలో తెలుగు తీరుతెన్నులు)
  3. తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము
  4. అవతారతత్త్వ వివేచన[2] (1998)
  5. సర్ ఆర్థర్ కాటన్
  6. విశ్వసాహితి (విజ్ఞానసర్వస్వం - సంపాదకుడు)
  7. నవ్యాంధ్ర సాహిత్య వికాసము

పురస్కారాలు

  • 1999 - రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి సాహిత్య పురస్కారం
  • 2002 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషాసంఘం వారి సత్కారం[3]

మరణం

ఇతడు 2006, మే 9వ తేదీన హైదరాబాదులోని ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో టైఫాయిడ్‌తో తన 84వ యేట మరణించాడు[4].

మూలాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).