"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొత్తిమీర నూనె

From tewiki
Jump to navigation Jump to search

Lua error in package.lua at line 80: module 'Module:TaxonItalics' not found.
మూస:Speciesbox/name
Coriandrum sativum - Köhler–s Medizinal-Pflanzen-193.jpg
Scientific classification edit
Species:
Lua error in package.lua at line 80: module 'Module:TaxonItalics' not found.మూస:Taxon italics
Binomial name
Lua error in package.lua at line 80: module 'Module:TaxonItalics' not found.మూస:Taxon italics

మూస:Taxonbar/candidateమూస:Speciesbox/parameterCheck

కొత్తిమీర నూనె లేదా కొత్తిమీర ఆకు నూనె ఒక ఆవశ్యక నూనె.కొత్తిమీర నూనె వలన పలు ప్రయోజనాలు వున్నాయి.కొత్తిమీర విత్తనాలను ధనియాలు అంటారు. కొత్తిమీర తాజాపచ్చి ఆకులను మరియు ధనియాలను వంటలలో విరివిగా ఉపయోగిస్తారు.కొత్తిమీర ఆహాల్లదకర మైన సువాసన ,ఘాటైన ప్రత్యేకమైన రుచిని వంటలకు ఇస్తుంది.ధనియాలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి.

కొత్తిమీరమొక్క

కొత్తి మీర గుబురుగా పెరుగు మొక్క.ఇది ఆపియేసియే /అంబిల్లిఫెరే కుటుంబానికి చెందిన మొక్క.కొత్తిమీర వృక్షశాస్త్రపేరు కోరియండమ్ సటివమ్(Coriandrum sativum L) ఇది ఓషద గుణాలు వున్న మొక్క.ఆకులు,విత్తనాలు/కాయలు,కాండం వేర్లు ఆన్ని వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్న మొక్క.మొక్క అన్నీ భాగాలు ఆహార యోగ్యం కావున ఆకులను,విత్తనాలను మొత్తం మొక్కను వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.[1]ఇది ఏకవార్షిక మొక్క. మొక్క ఒక మీటరు ఎత్తువరకు పెరుగును.[2]

ఆవాసం

ఇది యూరఫ్ మరియు పశ్చిమ ఆసియాకు చెందిన మొక్కగా భావిస్తారు.ఆతరువాత ఉత్తర అమెరికాలో విస్తరించినది. ప్రపంచమంతా ఈ పంటను సాగు చేస్తున్నారు.కొత్తిమీరలో పలురకాలైన జాతులు వున్నాయి.

నూనెను సంగ్రహించు విధానం

కొత్తిమీర ఆకులనుండి లేదా ధనియాలనుండి నూనెను స్టీము డిస్టిలేసన్(ఆవిరి స్వేదన క్రియ) పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు. డిస్టీలరు అను ఒక స్టీల్ పాత్రలో దాల్చిన చెక్క పొడిని లేదా ఆకుల పొడిని తీసుకుని,ఆ పాత్రను అడుగునుండిస్టీము/నీటి ఆవిరిని పంపిస్తారు. నీటిఆవిరి /స్టీము ధనియాలు ,లేదా ఆకుల ద్వారా పయనించు సమయంలో, వాటిలోని నూనెను ఆవిరిగా మార్చును.నీటి ఆవిరి, మరియు నూనె ఆవిరులు డిస్టీలరు పైభాగాన వున్న ఒక గొట్టం ద్వారా కండెన్సరుకు వెళ్ళును. కండెన్సరులో ఆవిరి గొట్టం వెలుపలి భాగంలో చల్లని నీరు ప్రవహించు ఏర్పాటు వుండును. అక్కడ నీటి ఆవిరి మరియు దాల్చిన నూనె ద్రవీకరణ చెంది, సంగ్రహణ పాత్రలో చేరును. సంగ్రహణ పాత్రలో జమ అయిన నూనె,నీటి మిశ్రమాన్ని కొన్ని గంటలు కదఫా కుండా వుంచాలి. అప్పుడు నూనె, నీరు వేరు వేరు పొరలుగా/మట్టాలుగా ఏర్పడును. నూనె సాంద్రత నీటి కన్న తక్కువ కావున పైభాగాన నూనె, ఆడుగు భాగాన నీరు చేరును,నూనెను వేరు పరచి,వడబోసీ భద్ర పరుస్తారు.పాత్రలో తీసుకున్న పరిమాణాన్ని బట్టి సంగ్రహణకు 5-6 గంటల సమయం పట్టును.

నూనె భౌతిక గుణాలు

రంగులేని లేదా లేత పసుపు రంగులో వుండు పారదర్శక ద్రవం.నూనెను కొత్తిమీర ఆకులనుండే కాకుండా కొత్తిమీర విత్తానాలైన ధనియాలనుండి కూడా సంగ్రహిస్తారు.నూనెను సాధారణంగా స్టీము డిస్టిలేసను విధానంలో ఉత్పత్తి చేస్తారు.ఆకులనుండి నూనెను తాజా ఆరబెట్టిన ఆకులనుండి తీస్తారు.

నూనె భౌతిక గుణాలపTTiక[3]

క్రమ సంఖ్య గుణం పరిమితి
1 విశిష్ట గురుత్వం20°C వద్ద 0.85000 - 0.86400
2 వక్రీభవన సూచిక 20°C వద్ద 45000 - 1.46000
3 ఫ్లాష్ పాయింట్ 136.40 °F
4 ద్రావణీయత నీటిలో, ఆల్కహాల్ లో కరుగును.
5 నిల్వ సమయం 12 నెలలు

నూనె యాంటీ బాక్టీరియాల్(బాక్టీరియా నిరోధక) ,యాంటీ ఫంగల్ (శిలీంద్ర నీరోధక),మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న పలు హైడ్రోకార్బన్ రసాయన సమ్మేళనాలను కల్గి వున్నది. నూనెను వైద్యపరమీన ఉపయోగానికై పార్మా సూటికల్ ఉత్పత్తులలో, సువాసనకై సువాసన ద్రవ్యాలలో(perfumes),రుచికి, వాసనకై వంటల్లో ఉపయోగిస్తారు.[1]

నూనెలోని రసాయన సమ్మేళన పదార్థాలు

కొత్తిమీర ఆకుల ఆవశ్యక నూనెలో 44 రకాల రసాయన సమ్మేళన పదార్థాలు వున్నట్లు గుర్తించడైనది.వీటిలో ఎక్కువ శాతం ఆరోమాటిక్ ఆమ్లాలు వున్నవి.వాటిలో ముఖ్యమైన కొన్ని రసాయన సమ్మేళనాలను దిగువ పట్టికలో ఇవ్వడమైనది[4]

క్రమ సంఖ్య సంయోగ పదార్థం శాతం
1 2-డెసేనోయిక్ ఆమ్లం 30.8%
2 E-11-టెట్రా డెసేనోయిక్ ఆమ్లం 13.4%
3 కాప్రిక్ ఆమ్లం 12.7%
4 ఆన్ డెకనోయిక్ ఆమ్లం 7.1%

కొత్తిమీర గింజల నూనెలో/దనియాల నూనెలో 53 రసాయన సంయోగ పదార్థాలు వున్నవి.వాటిలో ముఖ్యమైనవి దిగువ పట్టికలో ఇవ్వబడినవి.[4]

క్రమ సంఖ్య సంయోగ పదార్థం శాతం
1 లినలూల్ 37.7%
2 జెరానైల్ అసిటేట్ 17.6%
3 - γ- terpinene 14.4%

అర్జెంటినా కొత్తిమీర గింజల/ధనియాల నూనెలో 68.9 -87% లినలూల్ అనే రసాయన సంయోగ పదార్థం వుండును.ఇరాన్ లో తయారగు నూనెలో 40.9 -79.9%వరకు లినలూల్ వుండును.గింజల/ధనియాల నూనెలో ఇంకా are γ-terpinene, neryl acetate, α-pinene, p-cymene, dodecanal మరియు 2E-dodecanal. వున్నవి.

కొత్తిమీర నూనె వాడకం

  • ఫంగస్ సోకిన కాలి వేళ్లకు ఆయింట్ మెంట్ లో 6% కొత్తిమీర నూనెను కలిపి ఉపయోగిస్తారు.
  • పరిమళద్రవ్యాలలో,సబ్బులలొ ఉపయోగిస్తారు.
  • వీర్యవృద్ధికరమైనమందుగా ఉపయోగిస్తారు.
  • బాక్టిరీయా/ సూక్ష్మజీవి/క్రిమి సంహారకంగా ఉపయోగించవచ్చును.
  • వాయుహరమైన ఔషధముగా మరియు జీర్ణకారిగా ఉపయోగిస్తారు.
  • బాధానివారక ఔషరంగా ఉపయోగిస్తారు.
  • ప్రేరకం/ ఉత్తేజకంగా పనిచేయును.
  • శూలహరముగా పనిచేయును.

ఇవికూడా చూడండి

మూలాలు,ఆధారాలు

మూస:ఆవశ్యక నూనె