"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొత్త ప్రభాకర్ రెడ్డి

From tewiki
Jump to navigation Jump to search
కొత్త ప్రభాకర్ రెడ్డి
కొత్త ప్రభాకర్ రెడ్డి


ఎంపి
పదవీ కాలము
2014–2019
నియోజకవర్గము మెదక్ లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1966-06-06) 6 జూన్ 1966 (వయస్సు 54)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానము 2
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు మరియు 16వ పార్లమెంటు సభ్యులు. 2014లో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.[1]

జననం

ప్రభాకర్ రెడ్డి 1966, జూన్ 6 న తెలంగాణ లోని హైదరాబాద్లో జన్మించారు.

రాజకీయ ప్రస్థానం

ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరున్న ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సన్నిహితుడు. కేపీఆర్ ట్రస్టు ద్వారా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు.[2]

కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంకోసం మెదక్ లోకసభ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభాకర్ రెడ్డి పోటీచేసి గెలుపొందారు. 2104 సెప్టెంబరు 13న జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పై భారీ మెజారిటీతో గెలిచారు. 2014, నవంబరు 25న లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.[3]

మూలాలు

  1. తెలుగు వెబ్ దునియా. "మెదక్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధారణమే : ప్రభాకర్ రెడ్డి". telugu.webdunia.com. Retrieved 13 February 2017.
  2. మెడిన్ టిజి. "మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి 'కొత్త'". madeintg.com. Retrieved 13 February 2017.
  3. మేడిన్ టిజి. "లోక్ సభలో టీఆరెఎస్ కు 'కొత్త' ఎంపీ". madeintg.com. Retrieved 13 February 2017.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).