"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి

From tewiki
Jump to navigation Jump to search

కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి తన సోదరుడు కొప్పరపు వేంకటరమణ కవితో కలిసి కొప్పరపు సోదర కవులు పేరుతో జంట కవిత్వం చెప్పాడు.

జీవిత విశేషాలు

ఇతడు ప్రకాశం జిల్లా(పూర్వము గుంటూరు జిల్లా), సంతమాగులూరు మండలం (పూర్వము నర్సరావుపేట తాలూకా), కొప్పరం గ్రామంలో 1885, నవంబరు 12వ తేదీకి సరియైన పార్థివ నామ సంవత్సర కార్తీక శుద్ధ షష్ఠి, గురువారము నాడు కొప్పరపు వేంకట రాయడు, సుబ్బమాంబ దంపతులకు జన్మించాడు. ఇతడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కౌండిన్యస గోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. పోతరాజు రామకవి, రామడుగు రామకృష్ణశాస్త్రి గార్ల వద్ద ఇతడు శిష్యరికం చేశాడు. ఇతడు తన సోదరుడు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవితో కలిసి 1908 నుండి 150కి పైగా అష్టావధాన, శతావధాన, ఆశుకవితా ప్రదర్శనలు ఇచ్చాడు. అనేక సంస్థానాలలో సత్కారాలు, సన్మానాలు పొందాడు. ఇతడు 1932, మార్చి 29న మరణించాడు.

ముఖ్యమైన అవధానాల జాబితా

  • బాపట్ల శతావధానము (15-09-1911)
  • విశదల శతావధానము (17-09-1911)
  • గుంటూరు శతావధానము (01-10-1911)
  • చీరాల శతావధానము (16-10-1911)
  • పంగిడిగూడెము శతావధానము (1920)
  • సంపూర్ణ శతావధానము (1921)

రచనలు

ఇతడు తన సోదరునితో కలిసి ఈ క్రింది రచనలు చేశాడు.

  1. కృష్ణ కరుణా ప్రభావము
  2. దైవసంకల్పము
  3. కుశలవ నాటకము
  4. కనకాంగి
  5. పసుమర్తి వారి వంశావళి
  6. జ్ఞానోపదేశము
  7. నారాయణాస్త్రము
  8. దీక్షిత స్తోత్రము
  9. శతావధానము మొదలైనవి.

బిరుదులు

ఇతడు సోదరునితో కలిసి ఈ క్రింది బిరుదులను పొందాడు.

  • ముంగాలి
  • బాల సరస్వతి
  • ఆశు కవీంద్రసింహ
  • విజయ ఘంటికా
  • ఆశుకవి చక్రవర్తి
  • కుండిన కవిసింహ
  • కవిరత్న
  • అవధాని పంచానన
  • కథాశుకవీశ్వర
  • ఆశుకవిశిఖామణి మొదలైనవి.

మూలాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).