"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొమరంభీం జిల్లా

From tewiki
Jump to navigation Jump to search
గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

కొమరంభీం జిల్లా,తెలంగాణ రాష్ట్రంలోని,33 జిల్లాలలో ఒకటి.ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది. [1] నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది.

ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి.

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు

Lua error in మాడ్యూల్:Mapframe at line 258: attempt to index field 'wikibase' (a nil value).

Komaram Bheem District Revenue divisions.

ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.

స్థానిక స్వపరిపాలన

అసిఫాబాద్ రైల్వే స్టేషన్

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

గణాంక వివరాలు

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని మండలాలు

పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా,3 కొత్తగా ఏర్పడిన మండలాలు.[2]


గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (3)

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
  2. 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".

వెలుపలి లింకులు