కొమ్మారెడ్డి సూర్యనారాయణ

From tewiki
Jump to navigation Jump to search
కొమ్మారెడ్డి సూర్యనారాయణ
కొమ్మారెడ్డి సూర్యనారాయణ

1990లో తన మనుమడితో చిత్రం


పార్లమెంటు సభ్యులు
ముందు విమలాదేవి
తరువాత చిట్టూరు సుబ్బారావు చౌదరి
నియోజకవర్గం ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం 8 మార్చి 1907
పోతునూరు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
మరణం 6 మే 1995
గుంటూరు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కృష్ణవేణి
సంతానం 1 కుమార్తె (రత్నమాణిక్యాంబ)
నివాసం ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్
మతం హిందూ
వెబ్‌సైటు [1]

కొమ్మారెడ్డి సూర్యనారాయణ (జ: 1907 మార్చి 8 - మ: 1995 మే 6) భారత పార్లమెంటు లోని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, భారత స్వాతంత్ర్యసమరయోధులు, గాంధేయవాది.[1]

జీవిత విశేషాలు

ఆయన శ్రీ బ్రహ్మయ్య, కనకమ్మలకు జన్మించాడు. ఆయన మార్చి 8 1907పశ్చిమగోదావరి జిల్లా లోని పోతునూరు గ్రామంలో జన్మించాడు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. 1921 లో చదువులను విడిచిపెట్టి మహాత్మాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్లో స్వచ్ఛంద కార్యకర్తగా చేరాడు. ఆయన 1933, 1936 మధ్య పోతునూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. ఆయన భారత స్వాతంత్ర్య పోరాటంలో అనేకసార్లు జైలుశిక్ష అనుభవించారు. ఆయన కుటుంబంలో ఆయన తండ్రి బ్రహ్మయ్య, కనకమ్మలతో పాటు 12 మంది స్వాతంత్ర్యోద్యమంలో జైలుకు వెళ్లారు. ఆయన 1930లో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నాడు. 1930 లో సహాయనిరాకరణోద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం లలో పాల్గొన్నాడు. ఆయన 1936–37 లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగానూ, 1947-48 లో పశ్చిమగోదావరి జిల్లా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగాను సేవలనందించాడు. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా 25 సంవత్సరాల పాటు తన సేవలనందించాడు.

ఆయన 1952, 1958 మధ్య రాజ్యసభ సభ్యునిగా యున్నాడు.

ఆయన 4వ లోక్‌సభ, 5వ లోక్‌సభ, 6వ లోక్‌సభ లకు ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా 1967, 1971, 1977 లలో ఎన్నికైనాడు. ఆయన పార్లమెంటు కమిటీలలో సభ్యునిగా పనిచేసాడు. ఏప్రిల్ 1977 లో ఆస్ట్రేలియాలో జరిగిన ఇంటర్ పార్లమెంటు యూనియన్ సమావేశంలో పాల్గొన్న భారతదేశ బృందంలో సభ్యులుగా వెళ్ళాడు.

బీమడోలలో పశ్చిమగోదావరి సుగర్స్ లిమిటెడ్ కు వ్యవస్థాపక అధ్యక్షుడుగానూ, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సుగర్ ఫాక్టరీలకు డైరక్టరుగానూ, ఏలూరు ట్యూబ్ వెల్ కనస్ట్రక్షన్స్, ఇరిగేషన్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ లకు డైరక్టరుగానూ పనిచేసాదు. ఆయన 1-7-1977 నుండి తాడేపల్లి గూడేం లోని పశ్చిమగోదావరి జిల్లా కోఆపరేటివ్ పాడీ ప్రాసెసింగ్ సొసైటీ లిమిటెడ్ కు అధ్యక్షులుగా యున్నాడు.

ఆయన 1995 మే 6 న తన 89వ యేట మరణించాడు.

నిర్వహించిన పదవులు

  • అంచనా కమిటీ సభ్యులు 1971-77.
  • 1969-78 మధ్య పార్లమెంటులో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు.
  • ఆయన మోటారు వాహనాల బిల్, ఇన్సూరెన్స్ బిల్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ బిల్, డెఫెక్షన్స్ బిల్ లలో ఎంపిక కమిటీ సభ్యులు.
  • నేషనల్ ప్రొడుక్టివిటీ కౌన్సిల్ కు రిప్రజెంటేటివ్
  • ఆహారం, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు కన్సల్టేటివ్ సభ్యులు.
  • కామర్స్, సివిల్ సప్లైస్, కో ఆపరేషన్ మంత్రిత్వ శాఖకు కన్సల్టేటివ్ సభ్యులు.
  • 1977 లోక్ పాల్ బిల్లుకు జాయింట్ సెలక్షన్ కమిటీ సభ్యులు.
  • భారతదేశ సాంఘిక సంక్షేమ విభాగంలో సభ్యులు.

సామాజిక కార్యక్రమాలు

ఆయన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేసారు. ఆయన గ్రామీణ విద్యుత్ పథకాన్ని నిర్వహించారు. ఈ పథకానికి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దరైతులు స్వచ్ఛందంగా రూ.2.00 కోట్లను మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సగాన్ని అందజేసారు.

విదేశీ పర్యటనలు

ఆయన పార్లమెంటు సభ్యునిగా అనేక దేశాలను సందర్శించారు - ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ, కువైట్, సింగపూర్, ఆస్ట్రేలియా. ఆయన వ్యవసాయ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీస్, చేపల పరిశ్రమ లలో నూతన విధానాలను, ఆధునీకరణలను అధ్యయణ్ చేయడానికి తూర్పు దేశాలైన హాంగ్ కాంగ్, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ లను సందర్శించారు.

మూలాలు

  1. Suryanarayana Kommareddi, Luminaries of 20th Century, Part II, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp: 1006.

ఇతర లింకులు