"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొమ్మినేనివారి పాలెం

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

కొమ్మినెని వారి పాలెం , ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్:523 260. ఎస్.ట్.డి.కోడ్: 08404.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామం పేరు వెనుక చరిత్ర

చరిత్రలో ఒకనాటి పెదజంగాలపల్లి అనే గ్రామమే ఈనాటి కొమ్మినేనివారిపాలెం.

గ్రామ భౌగోళికం

సమీప మండలాలు

తూర్పున మార్టూరు మండలం, ఉత్తరాన సంతమాగులూరు మండలం, తూర్పున యద్దనపూడి మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ఈ గ్రామ పాఠశాలకు శుద్ధజలం అందజేయడానికి ప్రవాసాంధ్రుడు శ్రీ ఎం.సురేష్ బాబు ముందుకు వచ్చారు. సేవాధృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టుచున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. [4]

గ్రామంలో మౌలిక వసతులు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

నాగార్జునసాగర్ డామ్ నుండి వచ్చు నీటి ద్వారా సస్యశ్యామలంగా విరాజిల్లుతున్నది.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వెంకటరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శివాలయం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

నూతనంగా నిర్మించుచున్న ఈ ఆలయం, ఊరికి ప్రసిద్ధి. గ్రామ ప్రజల, ఇతరుల స్వచ్ఛంద విరాళాల సహాయంతో దీనిని నిర్మించుచున్నారు. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. కళ్యాణం అనంతరం స్వామివారిని గ్రామంలోని ప్రధాన వీధులలో ఎడ్లబండిపై ఊరేగించెదరు. అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతి ఇంటిముందు ఆపినప్పుడు, గ్రామ మహిళలు హారతులిస్తారు. గ్రామోత్సవం వైభవంగా నిర్వహించెదరు. [3]

ఈ ఆలయ ఆరవ వార్షికోత్సవాలు, 2017, జూన్-11వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ఒక మండలం రోజులపాటు హరేరామనామ సంకీర్తనం చెసినారు. ఉదయం దేవాలయంలోని స్వామివారికి కళ్యాణమహోత్సవం, భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [8]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

ఈ ఆలయ 18వ వార్షికోత్సవం, 2015, మే నెల-17వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. [6]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

గ్రామస్తుల, దాతల 20 లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2016, ఫిబ్రవరి-20వ తేదీ మాఘశుద్ధత్రయోదశినాడు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిమించారు. విగ్రహం ప్రక్కనే నవగ్రహాలను గూడా ఏర్పాటుచేసారు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామంలో పని చేయు వివేకానంద ట్రస్ట్ అదే గ్రామంలోని ఉద్యొగులచే స్థాపింపబడి, గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, పిల్లలలో, పెద్దలలో సేవాభావాలను పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.

మూలాలు

వెలుపలి లింకులు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఏప్రిల్-9; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఆగస్టు-7; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మార్చి-19; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మే-18; 1వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016, ఫిబ్రవరి-21; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017, జూన్-12; 2వపేజీ.