"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
కొమ్మినేని శ్రీనివాసరావు
కొమ్మినేని శ్రీనివాసరావు | |
---|---|
దస్త్రం:Kommineni Srinivasa Rao.jpg కొమ్మినేని శ్రీనివాసరావు | |
జననం | కొమ్మినేని శ్రీనివాసరావు 26 ఆగష్టు 1956 గన్నవరం, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | పాత్రికేయుడు రచయిత టాక్ షో అతిధేయుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1978 to ప్రస్తుతం |
భార్య / భర్త | కొమ్మినేని రాజ్యలక్ష్మీ |
తల్లిదండ్రులు | కొమ్మినేని రామరావు, కొమ్మినేని జయలక్ష్మీ |
కొమ్మినేని శ్రీనివాసరావు (జ. 1956 ఆగస్టు 26) KSR గా సుపరిచితులు. ఈయన తెలుగు జర్నలిష్టు, రచయిత, దూరదర్శన్ వ్యాఖ్యాత. ఈయన ప్రస్తుతం సాక్షిలో పనిచేస్తున్నాడు.[1] టెలివిజన్ లో ప్రముఖ షో అయిన "లైవ్ షో విత్ కె.s.ఆర్"ను నిర్వహిస్తున్నాడు.
Contents
ప్రారంభ జీవితం
కొమ్మినేని శ్రీనివాసరావు గన్నవరం,కృష్ణా జిల్లా,ఆంధ్రప్రదేశ్‌లో కొమ్మినేని రామారావు , కొమ్మినేని జయలక్ష్మిలకు జన్మించారు. అతనికి కృష్ణబాబు (గన్నవరంలో పాఠశాల నిర్వహిస్తున్నారు) , లక్ష్మీనారాయణ (ఈనాడులో పాత్రికేయుడు) అను ఇద్దరు సోదరులు గలరు.
విద్య
ఆయన గన్నవరం లో పాఠశాల, కళాశాల విద్యలనుఅభ్యసించారు. అతను కృష్ణా జిల్లా గన్నవరం జిల్లా పరిషాత్ ఉన్నత పాఠశాలలో చదివారు. తరువాత అతను ఎం.కాం ను చదివారు.
జీవిత విశేషాలు
అతను సుమారు 33 సంవత్సరాలు వివిధ వార్తా పత్రికలలో, టీవీ చానెళ్ళలో విలేకరిగా పనిచేశారు.
ఈనాడు పత్రిక [1978-2002]
1978లో అతను ఈనాడు లో చేరాడు. ఈనాడు లో చేరక ముందు అతను అనేక పత్రికలలో అనేక వ్యాసాలను రాశారు. అతను విజయవాడ, తిరుపతి తరువాత హైదరబాదులలో పనిచేసాడు. అతను పత్రికలలో వివిధ భాద్యతలను నిర్వర్తించారు. సబ్ ఎడిటరుగా, రిపోర్టరుగా, ఛీఫ్ రిపోర్టరుగా వివిధ స్థానాలలో తన సేవలనందించారు. 1986లో జరిగిన గోదావరి జిల్లాలలో జరిగిన వరద భీభత్సం, 1990లో లాథూరులో జరిగిన భయంకరమైన భూకంపం, 1992లో తిరుపతిలో జరిగిన ఎ.ఐ.సి.సి కార్యక్రమం, తెలుగుదేశంపార్టీ మహానాడు వంటి వాటిలో అతను పాత్రికేయునిగా ముఖ్య భూమిక పోషించారు. అతను ఢిల్లీలో ఈనాడు బ్యూరో ఛీఫ్ గా పనిచేశారు. పార్లమెంటు పై టెర్రరిస్టుల దాడి జరిగినపుడు ఆ సంఘటనను వార్తాంశంగా చిత్రీకరించారు. బిల్ గేట్స్ హైదరాబాదు వచ్చినపుడు ఆ వార్త ప్రచురణద్వారా గుర్తింపు పొందారు.
ఆంధ్ర జ్యోతి [2002-2006]
అతను 2002లో ఆంధ్రజ్యోతి లో చేరారు. నాలుగున్నరేళ్ళు ఆంధ్రజ్యోతి పత్రికకు భ్యూరో చీఫ్ గా భాద్యతలను చేపట్టారు.
TV5
ఆధ్రజ్యోతిలో పనిచేసిన తరువాత అతను ఎన్.టి.వి లో చేరారు. ఆ మేనేజిమెంటుతో వచ్చిన విభేదాల వలన కొద్దినెలలలోనే ఆ ఛానెల్ నుండి తప్పుకున్నాడు. తరువాత టి.వి.5 టెలివిజన్ ఛానెల్ లో పొలిటికల్ ఎడిటరుగా చేరి ఆ ఛానెల్‌కు సంపాదకునిగా కూడా పనిచేసాడు. అతను "న్యూస్ స్కాన్" అనే కార్యక్రమాన్ని రూపొందించాడు. దీని ఫలితంగా అతనికి విశేష గుర్తింపు వచ్చింది. అనేక మంది రాజకీయ నాయకులను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఆ ఛానెల్ లో రెడున్నరేళ్ళు పనిచేసి తరువాత ఎన్.టి.విలో ప్రధాన సంపాదకునిగా పనిచేసాడు.
NTV
అతను ప్రస్తుతం సాక్షిలో పనిచేస్తున్నాడు. అతను "లైవ్ షో విత్ కె.ఎస్.ఆర్" కార్యక్రమాన్ని రూపొందించాడు.
రచనలు
- కె.ఎస్.ఆర్ ఈ క్రింది పుస్తకాలను రచించాడు[2].
- రాష్ట్రంలో రాజకీయం
- ఆంధ్ర టు అమెరికా
- తెలుగు తీర్పు - 1999
- తెలుగు తీర్పు -2004
- తెలుగు ప్రజాతీర్పు - 2009
- తాజాకలం
- శాసనసభ చర్చల సరళి - 1956 నుండి 1960
- శాసన సభ చర్చల సరళి - 1960 - 1971
- రాజకీయ చదరంగంలో రాష్ట్రం
వ్యక్తిగత జీవితం
అతను 1982లో రాజ్యలక్ష్మీని వివాహమాడాడు. ఆమె ఎ.పి సీడ్స్ లో అధికారిణి.
పురస్కారాలు
- ఎన్.జి.రంగా మెమోరియల్ అవార్డు.
- రాజారెడ్డి మెమోరియల్ అవార్డు.
మూలాలు
- ↑ http://en.wikipedia.org/wiki/NTV_%28India%29
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-19. Retrieved 2013-08-24.