"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొలువై ఉన్నాడే దేవదేవుడు

From tewiki
Jump to navigation Jump to search

ఈ పాట స్వర్ణకమలం చిత్రంలోనిది. గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల


కంఠేనాలంబయేత్ గీతం
హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే ||

పలుపొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణిరుచుల వంక తనర
తలవంక నల వేలుపుల వంక నెలవంక
వలచేత నొక జింక వైఖరి మీరంగ ||

మేలుగ రతనంబు రాలు చెక్కిన వుంగరాలు
భుజగ కేయురాలు మెరయంగ
పాలుగారు మోమున శ్రీలు పొడమ
పులి తోలు గట్టి ముమ్మొన వాలు బట్టి చెలగా || కొలువై ||