"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కొల్లా వెంకయ్య

From tewiki
Jump to navigation Jump to search
కొల్లా వెంకయ్య
జననం1910
గుంటూరు జిల్లా పెదనందిపాడు
మరణం1997
వృత్తిహిందూస్థాన్ సేవాదళం లో స్వచ్చంద కార్యకర్త
ప్రసిద్ధితెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం మైదాన ప్రాంతీయ సంఘానికి కార్యదర్శి
తండ్రికృష్ణయ్య
తల్లిరత్తమ్మ

కొల్లా వెంకయ్య 1910లో గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామములో కొల్లా కృష్ణయ్య, రత్తమ్మ లకు జన్మించాడు[1].

ఊరిలోని పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించి, బాపట్లలొ ఉన్నత విద్య చేసాడు. మహాత్మా గాంధీ పెదనందిపాడు వచ్చిన సందర్భములో ఇచ్చిన ఉపన్యాసము విని ఉత్తేజితుడై జాతీయోద్యమానికి అంకితమయ్యాడు. 1929 డిసెంబరులో తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన హిందూస్థాన్ సేవాదళంలో స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేశాడు. 1933లో గాంధీ కావూరు సందర్శించినపుడు కలిశాడు. 1934లోబొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు ప్రతినిధిగా వెళ్ళాడు.

గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణ, మాకినేని బసవపున్నయ్య మున్నగు వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. 1937 మేలో కొత్తపట్నంలో జరిగిన రాజకీయ పాఠశాలకు వెళ్ళాడు. ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూనే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఏ చేశాడు. 1940లొ తన వాటాగా వచ్చిన భూమిని అమ్మి పార్టీకి విరాళమిచ్చాడు. గుంటూరు జిల్లాలో రైతు సంఘ నిర్మాణం, రైతుకూలీ సంఘం, ఉద్యమ సమస్యలు, భూసంస్కరణలు, బంజరు భూముల పంపకం, ఆందోళనలు మున్నగు విషయాలలో ముందుండేవాడు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం మైదాన ప్రాంతీయ సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. ఆ కాలమంతా వెంకయ్య రహస్య జీవనం గడిపాడు. అష్టకష్టాలు పడ్డాడు. ఓర్పు, నేర్పుతో రహస్య జీవితం గడిపిన అనంతరం మొదటి ఎన్నికలలో పాల్గొని శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. కమ్యూనిస్ట్ కార్యకర్తగా, జిల్లా, రాష్ట్ర నాయకుడిగా అనేక సంవత్సరాలు కొనసాగాడు. సి.పి.యం పార్టీనుండి విడిపోయిన అనంతరం కొంతకాలం విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేశాఅడు. తదుపరి మార్క్సిస్ట్ - లెనినిస్ట్ కమిటీ పేరుతో విప్లవ గ్రూపుల ఐక్యతకై కృషి చేశాడు.

  • 1936- కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం
  • 1948-1951- తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, రహస్య జీబవనం
  • 1962- చైనాతో యుద్ధ సందర్భమున కారాగార వాసం
  • 1970-శ్రీకాకుళం రైతాంగ ఉద్యమ సందర్భమున కారాగార వాసం
  • 1975-1977- అత్యవసర పరిస్థితి కాలంలో కారాగారవాసం
  • మొత్తం పది సంవత్సరాల కారాగారవాసం.

తాను నమ్మిన సమసమాజ స్థాపనకు, కార్మికులు, రైతులు, అణగారిన ప్రజల శ్రేయస్సుకై నిరంతరం పాటుబడి 1997లో కన్నుమూశాడు.

1952లొ పొన్నూరు నియోజకవర్గం నుండి శాశన సభ్యునిగా యెన్నికయ్యారు MLA 1957 లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి MLC శాశన మందలి సభ్యునిగా యెన్నికయ్యారు 1962 లో తెనాలి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా MP యెన్నికయ్యారు

మూలాలు

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 135