"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

కోట శంకరరావు

From tewiki
Jump to navigation Jump to search
కోట శంకరరావు
జననం
కోట శంకరరావు

ఆగస్టు 10
విద్యబి. కాం.
వృత్తిసినిమా నటుడు, రంగస్థల నటుడు, టి.వి.నటుడు
జీవిత భాగస్వాములుభాగ్యలక్ష్మి
తల్లిదండ్రులు
  • కోట సీతారామాంజనేయులు (తండ్రి)
  • విశాలాక్షి (తల్లి)

కోట శంకరరావు ప్రముఖ సినీ నటుడు, మరియు రంగస్థల నటుడు. ఇతడు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తమ్ముడు.

జీవిత విశేషాలు

ఇతడు ఆగస్టు 10న కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతడు విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. ఇతడు బ్యాంకులో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తూ నాటకరంగంలోకి వచ్చాడు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో కూడా నటించాడు. వీటిలో మూడు సీరియల్స్‌కు నంది అవార్డులు లభించాయి.[1]

నాటకాలు

  1. నాగులు తిరిగే కోనలో
  2. హర హర మహదేవ
  3. రసరాజ్యం
  4. మినిస్టర్

టి.వి.సీరియల్స్

  1. శ్రీమతి
  2. గాయిత్రీ
  3. జీవన సంధ్య

సినిమాలు

  1. అంకురం
  2. అగ్నిప్రవేశం
  3. అరుపు
  4. ఆటోవాల జిందాబాద్
  5. ఆపద మొక్కులవాడు
  6. చదువుకోవాలి
  7. జై తెలంగాణ
  8. డర్టీగేమ్‌
  9. తుంగభద్ర
  10. ధర్మచక్రం
  11. నాకూ పెళ్ళాం కావాలి - తొలి సినిమా
  12. బ్యాండ్ బాజా
  13. మనసే మాయ
  14. మిస్టర్ మనీ
  15. యుగానికి ఒక్క ప్రేమికుడు
  16. లవ్ అంటే
  17. వీడా!
  18. సూత్రధారులు
  19. సూర్య ఐ.పి.ఎస్
  20. నందీశ్వరుడు

పురస్కారాలు

  • విజయవాడ కల్చరల్ అకాడమీ వారిచే ఎస్.వి.రంగారావు 2016 పురస్కారం[2]
  • బెంగళూరులోని న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీ వారిచే గౌరవ డాక్టరేట్

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి- తారలతో ముచ్చట్లు (10 December 2018). "ఆంధ్రజ్యోతితో ఆసక్తికర విషయాలను పంచుకున్న కోట శంకరరావు". www.andhrajyothy.com. Archived from the original on 10 August 2019. Retrieved 10 August 2019.
  2. కోట శంకరరావుకు ఎస్‌విఆర్‌ పురస్కారం

బయటి లింకులు