"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
క్రొమటోగ్రఫి

క్రోమటోగ్రఫీ (ఆంగ్లం:Chromatography) (/ˌkroʊməˈtɒɡrəfi/[1]) అనునది ప్రయోగశాలలో మిశ్రమాలను విభజించు ఒక ప్రక్రియ.[2] రెండు పదాల గ్రీకు పదం, క్రోమా అనగా "రంగు", గ్రాఫీన్ అనగా "రాయడానికి అని అర్ధము. క్రొమటోగ్రఫీ పద్ధతిని ముఖ్యముగా మిశ్రమ సమ్మేళనాలను అతి సూక్ష్మ స్థాయిలో వేరు చేయటానికి ఉపయోగిస్తారు. క్రొమటోగ్రఫీని మొదట రష్యన్ శాస్త్రవేత్త మిఖాయిల్ 1900 లో కనుగొన్నాడు. పత్రాలలో సహజంగా ఉండే వివిధ రంగులును కాగితం, ఇథనాల్ సహాయముతో వేరు చేసేనప్పుడు, ఒక క్రమపద్దతిలో వరుసగా ఆకుపచ్చ, నారింజ, పసుపు రంగులును కాగితం మీద ఏర్పడడం గమనించి, ఈ విధానాన్ని క్రొమటోగ్రఫీని అని నామకరణము చేసాడు. 1930, 1940 కాలంలో అనేక క్రొమటోగ్రఫీ పద్ధతులను అభివృద్ధి చేసారు.
వివిధ క్రొమటోగ్రఫీ పద్ధతులు
ప్రస్తుతం అనేక క్రొమటోగ్రఫీ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నాముఖ్యమైన క్రొమటోగ్రఫీ పద్ధతులు, కాగితం క్రొమటోగ్రఫీ, సన్నని పొర క్రొమటోగ్రఫీ, వాయు క్రొమటోగ్రఫీ, ద్రావా క్రొమటోగ్రఫీ.
కాగితం క్రొమటోగ్రఫీ
కాగితం క్రొమటోగ్రఫీ (పేపర్ క్రొమటోగ్రఫీ) ద్వార సమ్మేళనాల స్వచ్ఛత కొరకు, సమ్మేళనాలలోని పదార్థాలు గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో వడపోత కాగితం ద్వార మిశ్రమ సమ్మేళనాలను ప్రత్యేకమైన ద్రావణంలో కలిపి పంపుతారు. మిశ్రమ సమ్మేళనాలలోని పదార్థాలు వివిధ వేగంతో వడపోత కాగితం ద్వార ప్రసరించి నమూనా ఏర్పరుస్తాయి. ఈ విధముగా మిశ్రమ సమ్మేళనాలలోని వివిధ పదార్థాలను తెలుసుకోవడానికి కాగితం క్రొమటోగ్రఫీ ఉపయోగపడుతుంది
ఉపయోగాలు
- నేర పరిశోధనలలో ఉపయోగించవచ్చు .
- ఆసుపత్రులలో ఇది ఒక రోగి యొక్క రక్త ప్రవాహంలో మద్యం స్థాయిలు గుర్తించడం ఉపయోగించవచ్చు
- నీటి లోని కలుషితాల నిర్ణయించడానికి కోసం ఉపయోగించవచ్చు
- కర్మాగారం లో ఉత్పత్తి అయిన రసాయనాల/ మందుల స్వచ్ఛత తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు.
- కర్మాగారం లో ఉత్పత్తి అయిన మిశ్రమ సమ్మేళనాలను అతి సూక్ష్మ స్థాయిలో వేరు చేయటానికి ఉపయోగిస్తారు.
మూలాలు
- ↑ "chromatography". Online Etymology Dictionary.
- ↑ క్రొమటోగ్రఫీ
ఇతర లింకులు
![]() |
Wikimedia Commons has media related to Chromatography. |
![]() |
Wikibooks has a book on the topic of: School science/Paper chromatography of amino acids |
- IUPAC Nomenclature for Chromatography
- Chromedia On line database and community for chromatography practitioners (paid subscription required)
- Library 4 Science: Chrom-Ed Series
- Hydrophobic Interaction & Reversed Phase Chromatography Handbook
- Overlapping Peaks Program – Learning by Simulations
- Chromatography Videos – MIT OCW – Digital Lab Techniques Manual
- Chromatography Equations Calculators – MicroSolv Technology Corporation