ఖగోళం

From tewiki
Jump to navigation Jump to search
తక్కువ వ్యాసంతో భూకేంద్రంగా ఖగోళం, దానిలో తిరిగుతున్న భూమి. తెలుపువి చుక్కలు, ఎరుపు సూర్యుని మార్గం.

ఖగోళశాస్త్రంలో, నావికాశాస్త్రంలో, ఖగోళం ఒక నిరాటంకర వ్యాసార్థం గల, భూగోళంతో ఏకకేంద్రం కలిగియున్న ఊహాత్మక గోళం. ఓ పరిశీలకుని ఆకాశంలో ఉన్న వస్తువులన్నిటినీ ఖగోళ లోపల ఉపరితలంపై ఒక అర్థగోళ ఆకార తెరపై ముద్రించినట్లు భావించవచ్చు. ఖగోళం స్థాన ఖగోళశాస్త్రంలో ఒక ఆచరణాత్మక సాధనం. దూరాలు తెలియనప్పుడు, అనవసరమైనప్పుడు, పరిశీలకులకు ఆకాశంలో వస్తువుల స్థానాలను గుర్తుపెట్టేటందుకు సహకరిస్తుంది.

పరిచయం

ఖగోళ వస్తువులు బహుమూల దూరాలలో ఉండడంవలన, ఆకాశంలో సాధారణం పరిశీలనతో వాస్తవ దూరాల సమాచారం లభించడం కష్టం. అన్ని వస్తువులు ఒక అంతులేని వ్యాసార్థంగల ఒక గోళంలో, సమాన దూరంలో ఉన్నాయని అనుకోవచ్చు. భూమి సాపేక్షంగా ఉంటే, ఇది తూర్పు నుండి పడమర వైపు, తలపై నుండి కాలి క్రింది వైపు తిరుగుతుంది. స్థాన ఖగోళశాస్త్ర అవసరాల కొరకు, దిక్కులు కాకుండా ఏది నిలిచివుందో ఏది తిరుగుతుందో తేడా లేదు. ఖగోళ వ్యాసార్థము అనంతము. అంటే ఏ స్థానం చూసిన దానిని కేంద్రంగా భావించవచ్చు.

అంతులేని విశ్వములో వివిధ ఖగోళ వస్తువుల స్థానాన్ని గుర్తించడానికి, దూరాల కొలమానం జరపడానికి ఖగోళపు నిరూపక వ్యవస్థ చట్రాలు వాడుకలో ఉన్నాయి. దీనికి భూమి కేంద్రంగా ఉండగా; భూమధ్య రేఖ, భూభ్రమణ కక్ష్య సూచన పంక్తులుగా వ్యవహరించబడుతున్నాయి.