"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గంగాపురం హనుమచ్ఛర్మ

From tewiki
Jump to navigation Jump to search

గంగాపురం హనుమచ్ఛర్మ పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ఒకరు. ఈయన 1925లో వేపూరు గ్రామంలో జన్మించారు.[1] సంస్కృతాంధ్త విధ్వాంసులైన గంగాపురం హనుమచ్ఛర్మ "దుందుభి" కావ్యం వల్ల ప్రసిద్ధులైనప్పటికీ తెలుగు, సంస్కృత భాషలలో పలు గ్రంథాలు రచించారు. 1996, ఆగస్టు 15న మరణించారు.

బాల్యం

1925లో వేపూరు గ్రామంలో జన్మించిన హనుమచ్ఛర్మ వేపూరు, కల్వకుర్తి, మార్చాలలో అభ్యసించారు. చిన్న వయస్సులోనే పలు పండితుల వద్ద శిక్షణ పొంది పాండిత్యం సంపాదించారు.

జీవనం

అభ్యసన అనంతరం పురోహితునిగా, పురాణ ప్రవచకుడిగా ప్రజలకు సన్నిహితుడైనారు. గ్రంథాలయ ఉద్యమంతో పాటు, భూదాన, సర్వోదయ ఉద్యమాలలో పాల్గొన్నారు. గుండూరు గ్రామ సర్పంచిగా కూడా ఎన్నికై గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన పోతుగంటి రాములు ఈయన రాజకీయ శిష్యుడు కాగా, కవి ముకురాల రామారెడ్డి ఈయన సాహితీ శిష్యుడు.

మూలాలు

  1. పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన: ఆచార్య ఎస్వి రామారావు, పేజీ 70

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).