"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గంగూరు

From tewiki
Jump to navigation Jump to search
గంగూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి నందేటి దేవమణి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 3,529
 - స్త్రీల సంఖ్య 6,228
 - గృహాల సంఖ్య 1,839
పిన్ కోడ్ 521139
ఎస్.టి.డి కోడ్ 0866

గంగూరు పెనమలూరు మండలం లోని ఒక గ్రామం. పిన్ కోడ్ నం. 521 139., ఎస్.టి.డి.కోడ్ = 0866.

గ్రామ చరిత్ర

మెట్రోపాలిటన్ ప్రాంతం

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[1][2]

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[3] సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తు. ఇది బందరు రోడ్డుకి ఆనుకొని ఉంది.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో ఈడుపుగల్లు, పెనమలూరు, వేల్పూరు, ఉప్పలూరు, నిడమానూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

కంకిపాడు. గన్నవరం, విజయవాడ, విజయవాడ గ్రామీణ

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[4][5] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది. ఇటీవల అనేక ప్రైవేటు విద్యాసంస్థలు నెలకొల్పారు.నలంద జూనియర్ కాలేజి, నోబుల్ ఇంగ్లీషు మీడియ్ం స్కూల్, ప్రగతినికేతన్ హైస్కూల్, గంగూరు

గ్రామములో మౌలిక వసతులు

 1. ఇ.ఎస్‌.ఐ. ఆసుపత్రి, గంగూరు.
 2. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, 132/11 కేవీ సబ్‌ స్టేషన్‌లు, గంగూరులో ఉన్నాయి.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

 1. ఇది ఒక మేజర్ పంచాయితీ.
 2. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి నందేటి దేవమణి సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ ఇస్మాయిల్ షరీఫ్ ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీశాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములో పరిశ్రమలు

 • గంగూరు పరిశ్రమల కేంద్రంగా ఉంది. ఇక్కడ విజయా స్పిన్నింగ్ మిల్లు ముఖ్యమైనది.
 • వెలగపూడి కోల్డుస్టోరేజి, క్వాలిటీ ఐస్‌, లాజా ఐస్‌, తవుడాయిలు మిల్లులు ఇక్కడ ఉన్నాయి.
 • ప్రియా ఫుడ్స్‌, సిరీస్‌ కంపెనీ, డార్విన్‌ ఫార్మాస్యూటికల్స్‌ పరిశ్రమలు, రైస్‌మిల్లులు గంగూరు, పోరంకిల్లో ఉన్నాయి.
 • గంగూరులో సత్యకళ పవర్‌ప్లాంటు ఉంది.
 • గంగూరు హోటళ్లకు ప్రసిద్ధి.

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

అభివృద్ధి చెందుతున్న గ్రామం.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 9,757 - పురుషుల సంఖ్య 3,529 - స్త్రీల సంఖ్య 6,228 - గృహాల సంఖ్య 1,839;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6643.[6] ఇందులో పురుషుల సంఖ్య 3692, స్త్రీల సంఖ్య 2951, గ్రామంలో నివాసగృహాలు 1463 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 532 హెక్టారులు.

మూలాలు

 1. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in English). Retrieved 27 March 2017.
 2. "Welcome to Government Order Issue Register". goir.ap.gov.in. Retrieved 27 March 2017.
 3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Penamaluru/Ganguru". Archived from the original on 4 నవంబర్ 2016. Retrieved 18 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
 4. "School Eduvation Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 19 మార్చి 2016. Retrieved 7 November 2016. Check date values in: |archive-date= (help)
 5. "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 నవంబర్ 2016. Retrieved 7 November 2016. Check date values in: |archive-date= (help)
 6. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-02.

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013, ఆగస్టు-5; 1వపేజీ.