"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి

From tewiki
Jump to navigation Jump to search

గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి ( ఫిబ్రవరి 13, 1913 - డిసెంబరు 23, 1997) సుప్రసిద్ధ పండితులు.

జననం

గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి 1913, ఫిబ్రవరి 13 వ తేదీన గుంటూరు జిల్లా లోని కొల్లూరు గ్రామంలో కూచిభొట్ల నాగభూషణ శాస్త్రి, త్రిపురాంబ దంపతులకు జన్మించారు.

వీరు జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అభ్యసించారు. 1955లో తురీయాశ్రమ దీక్ష స్వీకరించి తన పేరును నృసింహానంద భారతీ స్వాములుగా మార్చుకున్నారు. వీరు సమస్త దేవతా రూపంలోని లోకేశ్వరునిపై స్తోత్రాలు రచించారు. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు మొదలైన గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు.

చివరి కాలంలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శ్రీ చక్రార్చన పూజలను క్రమబద్ధంగా జరిపించారు. వీరికు సుమారు 200 మంది శిష్యప్రశిష్యులు ఉన్నారు.

మరణం

వీరి 1997, డిసెంబరు 23 తేదీన గుంటూరు శ్రీసదనంలో సిద్ధిపొందారు.

రచనలు

వీరు 70 పైగా రచనలు చేశారు.

 1. అగ్ని వర్షుడు
 2. అమరుక కావ్యము
 3. ఉత్తర గీత
 4. గాధా సప్తశతి
 5. గీతా గోవిందం
 6. మార్గశీర్ష మహాత్మ్యము
 7. వైశాఖ మహాత్మ్యము
 8. శ్రీ కామ సంజీవము
 9. శ్రీ దేవీ భాగవతము
 10. శ్రీ దేవీ మహాత్మ్యము
 11. శ్రీ విద్యా శంకర లీల
 12. శిశుపాల వధము
 13. ప్రతిజ్ఞా యౌగంధరాయణము
 14. రత్నావళి
 15. ప్రబోధచంద్రోదయము
 16. కవిమాయ
 17. ప్రియదర్శిక
 18. భాస నాటక చక్రము
 19. భాగవత చంపూ ప్రబంధము
 20. మహిష శతకము
 21. కుశలవుల కథ
 22. గీతా కదంబము[1]

మూలాలు

ఆధారాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).