"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గతి శక్తి
ఒక వస్తువు గమనంలో ఉన్నపుడు దాని గమనం వల్ల సంక్రమించే అదనపు శక్తిని గతి శక్తి (kinetic energy, KE) అని వ్యవహరిస్తారు. దీనిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు.
గమనం లో ఉన్న ఒక వస్తువును చలన రహిత స్థితిలోకి తీసుకొని రావడానికి అవసరమైన శక్తిని గతి శక్తిగా వ్యవహరిస్తారు.
సంప్రదాయ యంత్రశాస్త్రం (classical mechanics) లో ఒక వస్తువు యొక్క గతి శక్తి విలువ తెలుసుకోడానికి
గతి శక్తి = KE = (1/2)*m*v2
అనే సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ m అనేది ఆ వస్తువు యొక్క గరిమ (mass), v అనేది ఆ వస్తువు యొక్క వేగం (velocity). ఉదాహరణకి ఒక వస్తువు గరిమ 10 కిలోగ్రాములు (m = 10 kg) అనుకుందాం. ఈ వస్తువు సెకండుకి 5 మీటర్లు వేగంతో (v = 5 m/s) కదులుతూ ఉంటే దాని గతి శక్తి, పైన చెప్పిన సూత్రం ప్రకారం, (1/2 * 10 kg)*5*5 m/s2 లేదా 125 జూలులు.
వేగం అనేది ధనరాసి అయినా కావచ్చు, ఋణరాసి అయినా కావచ్చు కానీ వేగాన్ని వర్గీకరించినప్పుడు ఆ వర్గు ఎప్పుడూ ధనరాసే అవుతుంది కనుక గతి శక్తి ఎల్లప్పుడూ ధనరాసే! వేగం సదిశరాసి (vector) అయినప్పటికీ వేగం వర్గు అదిశరాసి (scalar) కనుక గతిశక్తి కూడా అదిశరాసి.