గబ్బిట బాలసుందర శాస్త్రి

From tewiki
Jump to navigation Jump to search
గబ్బిట బాలసుందర శాస్త్రి
జననం1895
మరణంజూలై 2, 1961
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నటశిక్షకుడు

గబ్బిట బాలసుందర శాస్త్రి (1895 - జూలై 2, 1961) ప్రముఖ రంగస్థల నటుడు, నటశిక్షకుడు. బందరు ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో ముఖ్య పాత్రధారి.[1]

జననం - విద్యాభ్యాసం

బాలసుందర శాస్త్రి 1895 లో గురునాథం, వేదాంతి సుబ్బమ్మ దంపతులకు బందరు లో జన్మించాడు. 1920లో గాంధీజీ పిలుపుమేరకు బి.ఏ. చదువుకు మధ్యలోనే అపేసి, నాటక కళా వ్యాసంగం, ఆధ్యాత్మిక చింతన వైపు తన దృష్టి సారించాడు.

రంగస్థల ప్రస్థానం

చిన్నవయసునుండి కళలపై ఆసక్తి ఉన్న బాలసుందర శాస్త్రి నాటకరంగంలోకి అడుగుపెట్టి అనేక నాటకాలలో నటించాడు. ఒథెల్లో, విశ్వామిత్రుడు (సత్య హరిశ్చంద్ర) వంటి పాత్రలు చాలా చక్కగా అభినయించేవాడు. ఎంతోమందిని నటులుగా తీర్చిదిద్దాడు.

నటించిన పాత్రలు

 1. ధర్మరాజు
 2. దుర్యోధనుడు
 3. కంసుడు
 4. ఆంజనేయుడు
 5. సుదర్శన చక్రవర్తి
 6. కలి
 7. సుదేవుడు
 8. రామరాజు
 9. ఔరంగజేబు
 10. యముడు
 11. అమరసింహుడు
 12. గిరీశం
 13. శతమిత్రుడు
 14. పెద్దన
 15. స్వామినాథం
 16. విశ్వామిత్రుడు
 17. ఒథెల్లో

మరణం

నాటకరంగంలో ఒక వెలుగు వెలిగిన ఈయన చివరి దశలో దారిద్ర్యం అనుభవించి 1961, జూలై 2 న మరణించాడు.

మూలాలు

 1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.436.