గర్భాశయ కాన్సర్

From tewiki
Jump to navigation Jump to search
Cervical cancer
వర్గీకరణ & బయటి వనరులు
Ca in situ, cervix 2.jpg
Histopathologic image (H&E stain) of carcinoma in situ, stage 0.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
m:en:OMIM {{{m:en:OMIM}}}
DiseasesDB 2278
m:en:MedlinePlus 000893
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}
పెద్ద పొలుసులతో కప్పి ఉన్న ఈ క్యాన్సర్ (చిత్రం యొక్క అడుగు భాగం) గర్భాశయ ద్వారాన్ని నాశనం చేయడంతోపాటు, గర్భాశయ దిగువ భాగాన్ని ఆక్రమించుకుంటుంది.గర్భాశయం ఒక లెయోమయోమా అప్ హైయర్ చుట్టును కూడా కలిగివుంటుంది.

గర్భాశయ ద్వారం లేదా గర్భశయ ప్రాంతంలో ఏర్పడే హానికారక కణితిని గర్భాశయ క్యాన్సర్ అంటారు. ఇది యోని స్రావంగా పరిచయం చేయవచ్చు అయితే లక్షణాలు మాత్రం క్యాన్సర్ బాగా ముదిరే వరకు కనిపించకుండా పోయే అవకాశం ఉంది.[1] ప్రాథమిక దశలో అయితే శస్త్ర చికిత్స (కణజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగించడం మరియు వ్యాధి బాగా ముదిరిన దశల్లో రసాయన చికిత్స, రేడియోధార్మిక చికిత్స) చేస్తారు.


పాప్ స్మియర్ (యోని భాగం నుంచి పరీక్షార్థం సేకరించే నమూనా)ను పరీక్షించడం ద్వారా క్యాన్సర్ రాకముందే పరివర్తనలను గుర్తించవచ్చు. ఉన్నతస్థాయి పరివర్తనలకు చికిత్స ద్వారా క్యాన్సర్ వృద్ధిని నివారించవచ్చు. గర్భాశయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా వినియోగంలోకి రావడంతో అభివృద్ధి చెందిన దేశాల్లో హానికర గర్భాశయ కాన్సర్ 50% లేదా అంతకన్నా ఎక్కువగా నిరోధించగలిగారు.[citation needed]


దాదాపుగా అన్నిరకాల గర్భాశయ క్యాన్సర్ల వృద్ధికి మానవ పాపిల్లోమా వైరస్ (HPV) సంక్రమణ ప్రధాన కారకం.[1][2] అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు యూరోపియన్ యూనియన్‌లలో అనేక రకాల గర్భాశయ క్యాన్సర్‌కు కారకమయ్యే రెండు HPV జాతులపై సమర్థవంతంగా పనిచేసే HPV టీకా లైసెన్స్ పొందివుంది. ఈ రెండు HPV జాతులు ప్రస్తుతం సుమారు 70%[3][4] గర్భాశయ క్యాన్లర్లకు కారణమవుతున్నాయి. అధిక నష్ట సంభావ్యత ఉన్న కేసులకు మాత్రమే ఈ టీకా ఉపయోగపడుతున్న కారణంగా, టీకా తీసుకున్న తరువాత కూడా, మహిళలు తరచుగా పాప్ స్మెర్ పరీక్షలు చేయించుకోవాలి.[5]

వర్గీకరణ

20వ శతాబ్దంలో సెర్వికల్ క్యార్సినోమా పెర్కూర్సోర్ లెసియన్స్ పేరు మరియు వర్గీకరణలో చాలాసార్లు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరణ[6][7] పద్ధతి ప్రకారం, పాక్షిక, సాధారణ లేదా తీవ్ర అసాధారణ కణవృద్ధి లేదా సహజ స్థితిలో కణితి (CIS) పేర్లతో పుండ్ల వర్ణన చేస్తారు. ఈ పుండ్లలో అసాధారణత్వాన్ని వివరించేందుకు, చికిత్సను ప్రామాణికం చేయడంలో ఉపయోగించేందుకు గర్భాశయ కణజాల అసాధారణ వృద్ధి (CIN) అనే పదం అభివృద్ధి చేయబడింది.[7] ఇది పాక్షిక అసాధారణ కణవృద్ధిని CIN1గా, సాధారణ స్థాయిలో ఉన్న అసాధారణ కణవృద్ధిని CIN2గా, తీవ్ర అసాధారణ కణవృద్ధిని CIN3గా వర్గీకరణ చేస్తుంది.గర్భాశయ క్యాన్సర్లను ఇటీవల బెథెస్డా పద్ధతిలో వర్గీకరించారు, ఇందులో అన్నిరకాల సెర్వికల్ ఎపిథెలియల్ ప్రెస్యూర్సోర్ లెసియన్స్‌ను రెండు గ్రూపులగా విభజించారు: అవి లో- గ్రేడ్ స్క్వామస్ ఇట్రాపిథేలియల్ లెసియన్ (LSIL) మరియు హై-గ్రేడ్ స్క్వామస్ లెసియన్ (HSIL). CIN1కు LSIL అనురూపకంకాగా, CIN2 మరియు CIN3లు HSIL పరిధిలోకి వస్తాయి.[7] దీని తరువాత, CIN2 మరియు CIN3 రెండింటిని కలిపి CIN2/3గా వర్గీకరించారు.


సూచనలు మరియు లక్షణాలు

ప్రారంభ దశల్లో గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన సంపూర్ణ లక్షణాలు బహిర్గతం కాకపోవచ్చు.[1][8] ప్రాణాంతక పరిస్థితిని యోని స్రావం, సంపర్క స్రావం లేదా (అరుదుగా) యోని భాగంలో గడ్డలు సూచించవచ్చు. గర్భాశయ క్యాన్సర్‌కు శృంగార సమయంలో సాధారణ నొప్పి మరియు యోని స్రావం కూడా లక్షణాలు.వ్యాధి బాగా ముదిరిన సమయంలో, ఉదరం, ఊపిరితిత్తులు లేదా మరే ఇతర భాగంలోనైనా వ్యాధి సంబంధ కణవ్యాప్తి ఉండవచ్చు.


గర్భాశయ క్యాన్సర్ ముదిరిన దశలో లక్షణాలు: ఆకలి లేకపోవడం, బరువు క్షీణత, ఆయాసం, కటి వలయంలో నొప్పి, ఒక కాలు వాయటం, యోని నుంచి అధిక స్రావం, మూత్రం కారుట లేదా యోని నుంచి మలం రావడం[9] మరియు ఎముక పగుళ్లు.


కారణాలు

మానవ పపిల్లోమావైరస్ సంక్రమణ

గర్భాశయ క్యాన్సర్ వృద్ధిలో అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకమేమిటంటే మానవ పపిల్లోమావైరస్ యొక్క ప్రమాదకర జాతితో దీని సంక్రమణ. వైరస్ క్యాన్సర్ బంధం గర్భాశయ కణాల్లో మార్పులను రేకెత్తిస్తుంది, ఈ పరిణామం గర్భాశయ కణజాల అసాధారణ వృద్ధికి కారణమవుతుంది, ఇది కాన్సర్‌కు దారితీయవచ్చు.


లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉన్న మహిళలు (లేదా ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్న పురుషులు లేదా మహిళలతో శృంగారంలో పాల్గొన్నవారికి) ఎక్కువ ముప్పు ఉంటుంది.[10][11]


HPVలో 150కి పైగా రకాలు ఉన్నట్లు గుర్తించారు (కొన్ని వర్గాలు 200లకు పైగా ఉపరకాల ఉన్నట్లు సూచిస్తున్నాయి).[12][13]వీటిలో 15 రకాలను అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లుగా (16, 18, 31, 33, 35, 39, 45, 51, 52, 56, 58, 59, 68, 73 మరియు 82), మూడింటిని అత్యంత ప్రమాదకరమయ్యేందుకు అవకాశం ఉన్న రకాలుగా (26, 53 మరియు 66), మరియు క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, 12 రకాలను తక్కువ-హానికారక వైరస్‌లుగా (6, 11, 40, 42, 43, 44, 54, 61, 70, 72, 81 మరియు CP6108)[14] వర్గీకరించారు.సాధారణంగా 70% గర్భాశయ క్యాన్సర్ కేసులకు 16 మరియు 18 రకాల వైరస్‌లు కారణమవుతున్నట్లు గుర్తించారు.31వ రకం వైరస్‌తో కలిసి, గర్భాశయ క్యాన్సర్ వచ్చేందుకు అవి ప్రధాన నష్ట కారకాలు అవుతున్నాయి.[15]


వివిధ రకాల HPV జాతుల కారణంగా జననేంద్రియాలపై ఏర్పడే పులిపిర్లు సాధారణంగా గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించినవి కావు.


గర్భాశయ క్యాన్సర్‌కు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మరియు ఇతర సంస్థలు అధికారికంగా ఆమోదించిన, వైద్యపరంగా అంగీకరించిన నమూనా ఏమిటంటే, గర్భాశయ క్యాన్సర్ వృద్ధి చెందాలంటే రోగికి ఖచ్చితంగా HPV సంక్రమించి ఉండాలి మరియు ఇక్కడ నుంచి దానిని లైంగిక సంక్రమణ వ్యాధిగా పరిగణించాలి, అయితే అత్యంత- ప్రమాదకర HPV సంక్రమించిన అనేక మంది మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వృద్ధి చెందదు.[16]గర్భనిరోధర సాధనా‌ల వాడకం వ్యాధికారక వైరస్ సంక్రమణను తగ్గించగలదు, అయితే ఎల్లప్పుడూ నిరోధించలేదు. అదే విధంగా, వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో చర్మాన్ని తాకడం వలన కూడా HPV సంక్రమించవచ్చు.పురుషుల్లో, HPV ప్రధానంగా పురుషాంగ శీర్షం ఉపరితలంలో పెరుగుతుంటుంది, ఈ ప్రాంతాన్ని శుభ్రపరచడం ద్వారా దీనిని నిరోధించవచ్చు.


ఉపకారకాలు

గర్భాశయ క్యాన్సర్‌కు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సూచించిన ప్రమాద కారకాల జాబితా: మానవ పపిల్లోమావైరస్ (HPV) సంక్రమణ, ధూమపానం, HIV సంక్రమణ, క్లామైడియా సంక్రమణ, ఆహార నియమాలకు సంబంధించిన కారణాలు, హార్మోన్ల ద్వారా గర్భాన్ని నిరోధించడం, అనేకసార్లు గర్భధారణలు, డైయిథైల్‌స్టిల్‌బెస్ట్రోల్ (DES) హార్మోన్ మందు వాడకం, గర్భాశయ క్యాన్సర్ వంశపారంపర్యత.[10]HLA-B7తో సంబంధం ఉన్న జన్యుపరమైన నష్టం సంభవించే అవకాశం ఉంది.[citation needed]


HPV టీకా అభివృద్ధి చేసినప్పటికీ, సాధారణంగా మగ శిశువులకు పుట్టిన నెలలోపే చేసే సున్తీతో వారి భవిష్యత్ శృంగార భాగస్వామికి గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొంతమంది పరిశోధకులు వాదిస్తున్నారు. ఇతరులు మాత్రం మగ శిశువుల ఆరోగ్యకరమైన జననేంద్రియ కణజాలాన్ని తొలగించడం ద్వారా వచ్చే పెద్ద ప్రయోజనాలేవీ లేవని, దీనిని కారణంగా భావిస్తూ మగ శిశువులకు సున్తీ చేయడం అనైతికమంటున్నారు.గర్భాశయ క్యాన్సర్‌ను మగ శిశువులకు చేసే సున్తీ నిరోధిస్తుందనేందుకు ఖచ్చితమైన ఆధారాలేవీ లేవు, అయినప్పటికీ కొందరు పరిశోధకులు మాత్రం సున్తీ జరిగిన పురుషుల్లో HPV సంక్రమించేందుకు చాలా తక్కువ అవకాశం ఉందనేందుకు సాంక్రమిక వ్యాధుల అధ్యయన శాస్త్రంలో బలమైన ఆధారం ఉందంటున్నారు.[17] ఇదిలా ఉంటే, సురక్షిత శృంగార పద్ధతులు పాటించేవారు మరియు ఒకేఒక్క శృంగార భాగస్వామిని కలిగివున్న పురుషులకు, సున్తీ చేయించుకున్నవారికి మధ్య గర్భాశయ క్యాన్సర్ ముప్పు విషయంలో తేడా ఏమీ ఉండదంటున్నారు.[18]


రోగ నిర్ధారణ

కణజాల పరీక్షా పద్ధతులు

పాప్ స్మియర్ సమర్థవంతమైన రోగ నిర్ధారణ పరీక్ష కాగా, గర్భాశయ క్యాన్సర్ లేదా క్యాన్సర్ ముందు స్థితిని నిర్ధారించుకునేందుకు గర్భాశయ కణాజలాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. సజల ఎసిటిక్ ఆమ్లం ను (ఉదాహరణకు గర్భాశయ ఉపరితలంపై అసాధారణ కణాలను గుర్తించేందుకు వినెగార్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు) ఉపయోగించి గర్భాశయాన్ని పరిశీలించే కోల్పోస్కోపీ పద్ధతి ద్వారా దీనిని తరచుగా చేస్తుంటారు.[1]


తదుపరి రోగ నిర్ధారణ ప్రక్రియల్లో లూప్ ఎలక్ట్రికల్ ఎక్సిషన్ పద్ధతి (LEEP) మరియు గర్భాశయ లోపలి పొరను తీసుకొని వ్యాధిని నిర్ణయించేందుకు అనుసరించే కోనిజేషన్ ఉన్నాయి.కణజాల పరీక్షలో తీవ్రమైన గర్భాశయ కణజాల అసాధారణ వృద్ధి జరుగుతున్నట్లు తేలితే ఈ పరీక్షలు చేస్తారు.

అనారోగ్య రకాలు

గర్భాశయ క్యాన్సర్ పూర్వగామి అయిన గర్భాశయ కణజాల అసాధారణ వృద్ధిని తరచుగా రోగ నిర్ధారణా నిపుణుడు చేత కణజాల పరీక్ష చేయించి నిర్ధారిస్తారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తికి కారణమయ్యే కణజాల ఉపరకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:[19][20] ఎక్కువ సందర్భాల్లో స్క్వామస్ సెల్ క్యాన్సర్ (అవయవ ఉపరితల కణాల క్యాన్సర్) గర్భాశయ క్యాన్సర్ అవుతున్నప్పటికీ, ఇటీవలి దశాబ్దాల్లో గర్భాశయ ఎడెనోక్యార్సినోమా (గర్భాశయ గ్రంథుల ఉపరితలంపైన ప్రమాదకర కణజాలం కారణంగా వచ్చే క్యాన్సర్) పెరుగుతోంది[1].


గర్భాశయంలో చాలా అరుదుగా ఏర్పడే క్యాన్సర్‌యేతర హానికారక కణజాలాలు


గమనించాల్సింది ఏమిటంటే అనేక ఇతర క్యాన్సర్లను వివరిస్తున్న TNM పద్ధతి‌కి భిన్నంగా శోషరసపు కణుపు ప్రమేయాన్ని కలుపుకోకుండానే FIGO వర్గీకరణ ఉంటుంది.


శస్త్రచికిత్సతో నయం చేయగలిగిన కేసుల్లో, రోగ నిర్ధారణా నిపుణుడి వద్ద సేకరించిన సమాచారాన్ని ఒక ప్రత్యేక అనారోగ్య దశను నిర్ణయించేందుకు ఉపయోగించవచ్చు, అయితే దానిని చికిత్స అందించాల్సిన వాస్తవ దశగా స్వీకరించరాదు.


హానికారక స్థితికి ముందు అసాధారణ కణజాల పెరుగుదలతో సంభవించే మార్పులకు CIN (గర్భాశయ కణజాల అసాధారణ వృద్ధి) శ్రేణీకరణ ఉపయోగించాలి.

దశల విభజన

స్త్రీ రోగ శాస్త్ర మరియు ప్రసూతి శాస్త్రం యొక్క అంతర్జాతీయ సమాఖ్య (FIGO) వర్గీకరణ పద్ధతిలో గర్భాశయ క్యాన్సర్ ప్రతిపాదించబడింది, ఇందులో శస్త్రచికిత్సపై ద్వారా కాకుండా చికిత్సాధ్యయనం ఆధారంగా దశలను నిర్ణయిస్తారు. వ్యాధి దశను గుర్తించేందుకు ఇందులో ఈ కింది రోగ నిర్ధారణ పరీక్షలు ఉపయోగిస్తారు: పాల్పేషన్ (స్పర్శ ద్వారా నిర్వహించే పరీక్ష), ఇన్‌స్పెక్షన్ (సమీక్ష), కోల్పోస్కోపీ, ఎండోసెర్వికల్ క్యూరెటేజ్, హైస్టెరోస్కోపీ, సైస్టోస్కోపీ, ప్రొక్టోస్కోపీ, ఇంట్రావెనస్ యురోగ్రఫీ, మరియు ఊపిరితిత్తులు మరియు అస్తిపంజరానికి ఎక్స్-రే పరీక్ష మరియు సెర్వికల్ కోనిజేషన్.


గర్భాశయ క్యాన్సర్ దశల గుర్తింపులో FIGO విభజనకు TNM వర్గీకరణ పద్ధతి సదృశంగానే ఉంటుంది.

 • దశ 0 - స్ట్రోమా (సహజ స్థితిలో కణితి)లోకి చొచ్చుకెళ్లకుండా ఉపరితలం యొక్క పూర్తి మందం ప్రమేయం
 • దశ I - గర్భాశయ ద్వారానికి పరిమితమవుతుంది
  • Iఎ - మైక్రోస్కోపీ ద్వారానే గుర్తించడం సాధ్యమవుతుంది: పైకి పుండులేమీ కనిపించవు
   • Iఎ1 - 3 మిల్లీమీటర్ల లోతు, 7 లేదా అంతకన్నా తక్కువ సమతుల ప్రదేశంలో హానికారక కణజాల వ్యాప్తి
   • |ఎ2- 3 మరియు 3 మిల్లీమీటర్ల మధ్య 7 మిల్లీమీటర్ల లేదా అంతకన్నా తక్కువ ప్రదేశంలో హానికారక కణజాల వ్యాప్తి
  • Iబి - 5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ లోతు లేదా 7 మిల్లీమీటర్లకుపైగా సమతలంలో విస్తరించిన కనిపించే పుండు లేదా మైక్రోస్కోప్‌లో చూడదగిన పుండు
   • Iబి1 - 4 సెంటీమీటర్లు లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో కనిపించే పెద్ద పుండు
   • Iబి2 - 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న కనిపించే కణితి
 • దశ II - గర్భాశయ ద్వారం దాటి విస్తరిస్తుంది
  • IIఎ - పారామెట్రియల్ భాగానికి వ్యాప్తి చెందకుండా యోని పైభాగంలో 2/3 వంతుకు వ్యాధి సంక్రమిస్తుంది.
  • IIబి - పారామెట్రియల్ భాగానికి కూడా సంక్రమిస్తుంది
 • దశ III - కటి వలయ గోడలకు లేదా మూడో వంతు యోని దిగువ భాగానికి వ్యాపిస్తుంది
  • IIIఎ - యోని దిగువన మూడో వంతు భాగాన్ని ఆక్రమిస్తుంది
  • IIIబి - కటి వలయ గోడలకు విస్తరిస్తుంది మరియు/లేదా హైడ్రొనెఫ్రోసిస్ లేదా కిడ్నీలను పనిచేయకుండా చేస్తుంది
 • IVఎ - మూత్రకోశ ద్వారానికి మరియు పురీషనాళానికి వ్యాపిస్తుంది మరియు/లేదా వాస్తవ కటి వలయం వరకు విస్తరిస్తుంది
 • IVబి - సుదూర ఇతర శరీర భాగానికి సంక్రమణ


చికిత్స

మైక్రోయిన్వాసివ్ క్యాన్సర్ (|A దశ)కు సాధారణంగా గర్భాశయాన్ని తొలగించడం (యోని భాగంతోపాటు మొత్తం గర్భాశయాన్ని తొలగించడం) ద్వారా చికిత్స చేస్తారు. IA2 దశకు, శోషరసపు కణుపులను కూడా తొలగిస్తారు. సంతానయోగ్యత కాపాడుకోవాలనుకునే రోగులకు ప్రత్యామ్నాయంగా లూప్ ఎలక్ట్రికల్ ఎక్సిషన్ పద్ధతి (LEEP) లేదా శంకు జీవాణు పరీక్ష వంటి స్థానిక శస్త్రచికిత్సా పద్ధతిలో చికిత్స చేస్తారు.[21]


శంకు జీవాణు చికిత్స స్పష్టమైన ఫలితాలు ఇవ్వకపోతే,[22] సంతానయోగ్యత నిలుపుకోవాలనుకునే రోగులకు అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయ చికిత్స ట్రాకెలెక్టోమీ.[23] అండాశయాలను, గర్భాశయాన్ని కాపాడుతూ, మరింత సాంప్రదాయ పద్ధతిలో గర్భాశయాన్ని తొలగించకుండా ఆపరేషన్ చేస్తూ క్యాన్సర్‌ను నిర్మూలిస్తారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా Iవ దశలో రోగులకు ఈ చికిత్స సాధ్యపడుతుంది: అయితే దీనిని ప్రామాణిక చికిత్సగా దీనిని ఇప్పటివరకు పరిగణించలేదు,[24] చాలా కొద్ది మంది వైద్యులు మాత్రమే ఈ తరహా చికిత్సలో నిపుణులై ఉన్నారు. క్యాన్సర్ వ్యాప్తి పరిధి తెలియదు కనుక సర్జికల్ మైక్రోస్కోపిక్ పరీక్ష జరిగేంత వరకు ఎంతో అనుభవం ఉన్న శస్త్రచికిత్సకుడు కూడా ట్రాకెలెక్టోమీ (గర్భాశయ దిగువ భాగాన్ని, దాని ముఖద్వారాన్ని తొలగించే క్యాన్సర్ చికిత్స)కి హామీ ఇవ్వలేడు. ఆపరేషన్ రూములో రోగి సాధారణ మత్తులో ఉన్నప్పుడు గర్భాశయ కణజాలంలో క్యాన్సర్ ఎంత వరకు వ్యాప్తి చెందిందో మైక్రోస్కోప్ పరీక్షలో శస్త్రచికిత్సకుడు నిర్ధారణకు రాలేకపోయినట్లయితే, గర్భాశయాన్ని తొలగించే అవసరం ఏర్పడవచ్చు. రోగి ముందుగా దీనికి అనుమతించినట్లయితేనే అదే ఆపరేషన్ సందర్భంగా ఈ చికిత్స చేస్తారు. 1b దశలో ఉన్న క్యాన్సర్లు మరియు 1a దశలో ఉన్న కొన్ని క్యాన్సర్లలో శోషరస కణితులకు కూడా క్యాన్సర్ వ్యాపించే ప్రమాదం ఉండటంతో, శస్త్రచికిత్సకుడు వ్యాధి అంచనా కోసం గర్భాశయం చుట్టూ కొన్ని శోషరస కణితులు కూడా తొలగించాల్సిన అవసరం రావొచ్చు.


రాడికల్ ట్రాకెలెక్టోమీ (గర్భాశయ ముఖద్వారం, గర్భాశయ దిగువ భాగం తొలగింపు) చికిత్సను ఉదరం[25] లేదా యోని[26] ద్వారా చేస్తారు, ఇందులో ఏది మంచిదనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.[27] లైంఫాడెనెక్టోమీతో ఉదరం ద్వారా చేసే రాడికల్ ట్రాకెలెక్టోమీకి సాధారణంగా రెండు నుంచి మూడు రోజులపాటు ఆస్పత్రిలో ఉండాలి, ఎక్కువ మంది మహిళలు చాలా త్వరగా (సుమారు ఆరు వారాలు) కోలుకుంటారు. ప్రభావాలు అసాధారణంగా ఉంటాయి, శస్త్రచికిత్స తరువాత గర్భం ధరించే మహిళల్లో ముందస్తు కాన్పులకు మరియు గర్భస్రావాలకు అవకాశం ఉంది.[28] శస్త్రచికిత్స తరువాత కనీసం ఏడాదిపాటు గర్భధారణ జరగకుండా చూసుకోవాలని సాధారణంగా వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.[29] ట్రాకెలెక్టోమీ ద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా తొలగిస్తే అవశేష గర్భాశయంలో మళ్లీ అది ఏర్పడటం చాలా అరుదు.[24] సురక్షిత శృంగార పద్ధతుల ద్వారా గర్భధారణ కోసం చేసే ప్రయత్నాలతో కొత్త HPV సోకే ప్రమాదాన్ని తగ్గించేందుకు, పాత క్యాన్సర్ పునరుత్పత్తి కాకుండా పర్యవేక్షించేందుకు పాప్ స్మెర్ పరీక్షలు, కోల్పోస్కోపీ, అవసరమైన విధంగా మిగిలిన దిగువ గర్భాశయ భాగంలోని కణజాల పరీక్షలు (కనీసం ఐదేళ్లపాటు ప్రతి 3-4 నెలలకు ఒకసారి), క్యాన్సర్ నిరోధక చర్యలు, తదుపరి జాగ్రత్తలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని రోగులకు సిఫార్సు చేయబడివుంది.


ప్రాథమిక దశల్లో (నాలుగు సెంటీమీటర్లకన్నా తక్కువ పరిమాణంలో ఉండే IB1 మరియు IIA దశలు) శోషరసపు కణితుల తొలగింపుతో రాడికల్ హైస్టెరెక్టోమీతో లేదా రేడియోధార్మిక చికిత్సతో నయం చేయవచ్చు. కటి వలయంపై బాహ్య రేడియోధార్మిక కిరణాల ప్రసారం మరియు బ్రాచైథెరపీ (అంతర్గత వికిరణం)ల ద్వారా రేడియోధార్మిక చికిత్స జరుగుతుంది. రోగ లక్షణ పరీక్షల్లో ఎక్కువ నష్ట సంభావ్యతను ఎదుర్కొంటున్న శస్త్రచికిత్స చేసిన రోగులకు క్యాన్సర్ తిరిగబెట్టే ప్రమాదాన్ని తగ్గించేందుకు రసాయన చికిత్సతో లేదా అది లేకుండా రేడియోధార్మిక చికిత్స అందిస్తారు.


ప్రాథమిక దశల్లోని పెద్ద కణితులను (4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న IB2 మరియు IIA దశలకు) సిస్‌ప్లాటిన్ ఆధారిత రసాయన చికిత్స, హైస్టెరెక్టోమీ (దీనికి తరువాత సాధారణంగా అనుబంధ చికిత్సగా రేడియోధార్మిక చికిత్స అవసరమవుతుంది), లేదా హైస్టెరెక్టోమీ తరువాత సిస్‌ప్లాటిన్ రసాయన చికిత్స ద్వారా నిర్మూలించవచ్చు.


ముదిరిన దశల్లోని కణితులను (IIB-IVA) రేడియోధార్మిక చికిత్స మరియు సిస్‌ప్లాటిన్ ఆధారిత రసాయన చికిత్స ద్వారా నిర్మూలిస్తారు.


మహిళల్లో బాగా ముదిరిన (IVb) గర్భాశయ క్యాన్సర్ చికిత్స కోసం రసాయన చికిత్సా పద్ధతి ద్వారా హైకాంటిన్ మరియు సిస్‌ప్లాటిన్ అనే రెండు మందు సంమ్మిశ్రమాలను వాడేందుకు జూన్ 15, 2006న, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.[30] సంమ్మిశ్రమాలతో చికిత్స వలన నెట్రోపెనియా, అనెమియా మరియు థ్రెంబోసైటోపెనియా అనే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హైకాంటిన్‌ను గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ తయారు చేసింది.


నివారణ

పరిజ్ఞానం

US నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క 2005 ఆరోగ్య సమాచార జాతీయ ధోరణుల అవలోకనం ప్రకారం, అవలోకనం చేసిన వారిలో 40% అమెరికా మహిళలు మాత్రమే మానవ పపిల్లోమావైరస్ (HPV) సంక్రమణ గురించి విన్నారు మరియు గర్భాశయ క్యాన్సర్‌తో దాని సంబంధం గురించి 20% మంది మాత్రమే విన్నట్లు తేలింది.[31] 2008లో, USలో 3870 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తారని మరియు దాదాపు 10,000 కొత్త కేసుల్లో వ్యాధి నిర్ధారితం కావచ్చని అంచనా వేశారు.[32]


పరీక్షించడం

అభివృద్ధి చెందిన దేశాల్లో గర్భాశయ క్యాన్సర్ యొక్క సంఘటనలు మరియు మృతుల సంఖ్య తగ్గించడంలో గర్భాశయ క్యాన్సర్ పరీక్షలో వాడే పాపానికోలయోయి పరీక్ష లేదా పాప్ స్మియర్ యొక్క విస్తారిత అవగాహన మంచి ఫలితాలను ఇచ్చింది.[8] అసామాన్యమైన పాప్ స్మెర్ ఫలితాలు క్యాన్సర్ అభివృద్ధి కావడానికి ముందుగా గర్భాశయ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాసియా (మెడలోని సమర్థవంతమైన హానికర మార్పులకు ముందే) ఉనికిని, పరీక్షను అనుమతించి, సాధ్యమైన నివారణ చిక్సితలను సూచిస్తాయి. పాప్ స్మెర్‌ను తరచూ ఎప్పుడూ నిర్వహించాలనే ప్రతిపాదనలు సంవత్సరానికి ఒకసారి నుండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వరకు వేర్వేరుగా ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ పరీక్షను యోని సంపర్క ఆరంభం తర్వాత దాదాపు మూడు సంవత్సరాల్లో మరియు/లేదా ఇరవై-ఒక్క సంవత్సరాల వయస్సు కంటే ముందే తప్పక ప్రారంభించాలని ACS సిఫార్సు చేస్తుంది.[33] పరీక్ష ఎంతకాలం నిర్వహించాలనే దానిపై నిర్దేశాలు మారుతుంటాయి, కాని అసాధారణ స్మెర్స్ లేని బాగా పరీక్షించబడిన మహిళకు 65 (USPSTF) నుండి 70 (ACS) వయసులో పరీక్షను ఆపివేయవచ్చు. వ్యాధి ప్రారంభ స్థాయిలో లేదా గర్భాశయ క్యాన్సర్ ప్రారంభంలోనే గుర్తించినట్లయితే, దాన్ని శరీరాన్ని తాకకుండా, గర్భధారణ శక్తిని తగ్గించకుండా పర్యవేక్షించవచ్చు లేదా చిక్సిత చేయవచ్చు.


గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఇప్పటి వరకు పాప్ స్మెర్ ఒక ప్రాథమిక సాంకేతిక పక్రియగా మిగిలిపోయింది. అయితే, ప్రచురించబడిన సాహిత్యం యొక్క తీవ్ర సమీక్ష తర్వాత, నిజానికి NICEచే ప్రారంభించిన ద్రవ ఆధారిత జీవకణ శాస్త్రాన్ని UK జాతీయ పరీక్షా కార్యక్రమంలో చేర్చారు. అయినప్పటికీ, ఇది బహుశా పాప్ పరీక్ష యొక్క యథార్థతను మెరుగుపర్చడానికి ఉద్దేశించబడింది, దీని ప్రధాన ఉపయోగం అనవసరమైన స్మెర్స్ సంఖ్యను తగ్గించడానికి ఉపయోగించారు. ఇది స్త్రీలలో భవిష్యత్తులో స్మెర్ రాకుండా తగ్గిస్తుంది.


స్మెర్స్ యొక్క అర్థవివరణను మెరుగుపర్చే లక్ష్యంతో యంత్ర సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేశారు, సాధారణంగా వీటిని జీవకణ సాంకేతిక నిపుణులు నిర్వహిస్తారు. ఊహించని విధంగా, వీటి వలన మొత్తానికి తక్కువ ఉపయోగమే ఉంటుందని నిరూపించబడింది; అయితే ఇటీవల సమీక్షలు ప్రకారం సాధారణంగా వీటి సామర్థ్యం, మానవ ప్రక్షేపం కంటే తక్కువ కాదని తెలుస్తుంది.[34]


HPV పరీక్ష అనేది గర్భాశయంలో మానవ పపిల్లోమావైరస్ సంక్రమణ యొక్క ఉనికిని గుర్తించే గర్భాశయ క్యాన్సర్ చిక్సితకు నూతన సాంకేతిక పక్రియగా చెప్పవచ్చు. ఇది పాప్ స్మెర్ కంటే మరింత సూక్ష్మగ్రాహకం (తక్కువ స్థాయిలో తప్పుడు లోప ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది), కాని స్వల్ప నిరోధం (తక్కువ స్థాయిలో తప్పుడు లోపరహిత ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది) మరియు సాధారణ పరీక్ష ప్రక్రియలో దీని పాత్రను ఇంకా విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆక్రమిక గర్భాశయ క్యాన్సర్‌ల్లో 99% కంటే ఎక్కువ సందర్భాల్లో HPV ఉంటుంది, సాధారణ గర్భాశయ పరీక్షతో HPV పరీక్షను కూడా చేయించుకోవడం మంచిదని కొంత మంది పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.[15] కాని, HPV యొక్క ప్రబలమైన సామర్థ్యం కారణంగా, సాధారణ HPV పరీక్ష వలన వాహక వ్యవస్థకు వ్యాధి అనుచిత వ్యాప్తి కావచ్చని కొంత మంది సూచిస్తారు.


ఒక యాదృచ్ఛిక నియంత్రణ పరిశీలన ప్రకారం, HPV పరీక్ష, 32-38 సంవత్సరాల వయసు స్త్రీల్లో తదుపరి పరీక్షచే గుర్తించబడే గ్రేడ్ 2 లేదా 3 గర్భాశయ ఇట్రాపిథేలియల్ నియోప్లాసియా లేదా గర్భాశయ క్యాన్సర్ యొక్క సంభవాలను తగ్గిస్తుంది.[35] సంబంధిత ప్రమాద తగ్గింపు 41.3%. ఈ అధ్యయనంలో ఇదే ప్రమాదంలో ఉన్న రోగులకు (63.0% మందికి CIN 2-3 లేదా క్యాన్సర్ ఉంది), ఇది 26% సంపూర్ణమైన ప్రమాద తగ్గింపును సూచిస్తుంది. ప్రయోజనం కోసం 3.8 రోగులు చిక్సిత పొందారు (చిక్సిత అవసరమైన వారి సంఖ్య = 3.8). CIN 2-3 యొక్క అధిక లేదా స్వల్ప ప్రమాదంలోని రోగుల కోసం ఈ ఫలితాలను సర్దుబాటు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నివారణ టీకాలు వేయడం

మెర్క్ & కో.చే లైసెన్స్ కలిగిన మరియు ఉత్పత్తి చేయబడే గార్డాసిల్ అనేది HPV రకాలు 6, 11, 16 & 18లకు నివారణ టీకా. గార్డాసిల్ 98% ప్రభావాన్ని చూపుతుంది.[36]. ఇది జూన్ 8, 2006లో US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌చే ఆమోదాన్ని పొందిన తర్వాత ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తుంది.[3] గార్డాసిల్ EUలో కూడా ఆమోదించబడింది.[37]


గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ HPV సూక్ష్మజీవులను నివారించడంలో 92% ప్రభావాన్ని చూపించిన సెర్వారిక్స్ అనే పేరు గల టీకాను అభివృద్ధి చేసింది.[38] సెర్వారిక్స్ కొన్ని ప్రాంతాల్లో ఆమోదించబడింది మరియు మరికొన్ని చోట్ల ఆమోదిత విధానంలో ఉంది.[39]


మెర్క్ & కో. లేదా గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ టీకాను కనుగొనలేదు. టీకా యొక్క ముఖ్య అభివృద్ధి దశలకు USలో నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, న్యూయార్క్‌లోని యూనివర్శటీ ఆఫ్ రోచెస్టెర్, వాషింగ్టన్, DCలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ, హానోవర్, NHలోని డార్ట్‌మౌత్ కాలేజీ మరియు బ్రిస్బేన్, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీలు హక్కును కలిగి ఉన్నాయి. మెర్క్ & కో. మరియు గ్లాక్సోస్మిత్‌క్లెయిన్‌లు రెండూ ఈ పార్టీల నుండి పేటెంట్‌లకు లైసెన్స్ కలిగి ఉన్నాయి.[40]


గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో ప్రస్తుతం 70% HPV రకాలు 16 మరియు 18 రెండూ ఉన్నాయి. జననేంద్రియ మొటిమ కేసుల్లో 90% HPV రకాలు 6 మరియు 11లు కారణమవుతున్నాయి.


సంక్రమించడానికి ముందే వాడితేనే టీకా పనిచేస్తుంది కాబట్టి HPV టీకాలు 9 నుండి 26 మధ్య వయస్కులైన అమ్మాయిలు మరియు స్త్రీలకు ఉద్దేశించబడినవి; కనుక, పబ్లిక్ ఆరోగ్య కార్మికులు టీకాను లైంగిక వాంఛ ప్రారంభానికి ముందే అమ్మాయిలకు ఇస్తున్నారు. జననేంద్రియ మొటిమలను మరియు స్త్రీలకు వ్యాప్తిని నివారించడానికి పురుషులకు టీకా వాడకాన్ని ప్రారంభంలో రెండో మార్కెట్ వలె మాత్రమే భావించారు.


టీకా యొక్క అధిక ధర ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. పలు దేశాలు HPV టీకాకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి లేదా ఆలోచిస్తున్నాయి.

గర్భనిరోధక సాధనం

గర్భాశయంలో క్యాన్సర్ వ్యాప్తికి ముందే సమర్థవంతమైన చిక్సిత కోసం గర్భనిరోధక సాధానాలు కూడా ఉపయోగపడతాయి. సెమెన్‌కు వెల్లడి వలన క్యాన్సర్ వ్యాప్తి మార్పుల (CIN 3) ప్రమాదాన్ని పెంచుతుంది మరియు ఈ మార్పులను తిరోగమించడానికి గర్భనిరోధక సాధనాల వాడకం ఉపయోగ పడుతుంది మరియు HPV తొలగించడానికి సహాయపడుతుంది.[41] ఒక అధ్యయనంలో సెమెన్‌‌లోని ప్రోస్టాగ్లాండిన్ గర్భాశయ వ్యాధులు మరియు గర్భాశయ కణితుల పెరుగుదలకు దోహద పడతాయి మరియు గర్భనిరోధక సాధనాల వాడకం వలన ప్రభావిత స్త్రీ ప్రయోజనం పొందవచ్చు.[42][43]


పోషకాహారం

పండ్లు మరియు కూరగాయలు

అధిక స్థాయిలో కూరగాయలను తీసుకోవడం వలన HPV నిలకడ యొక్క ప్రమాదాన్ని 54% తగ్గించవచ్చు.[44] వారంలో కనీసం ఒకసారి బొప్పాయిని తీసుకోవడం వలన HPV నిలకడను వ్యతిరేకంగా పోరాడుతుంది.[45]


విటమిన్ ఎ

రెటినోల్ యొక్క విశేష లోపం వలన గర్భాశయ అసహజత ప్రత్యేకంగా HPV యొక్క సంక్రమణ యొక్క అవకాశాలను పెంచుతుందని ఒక బలహీనమైన నిరూపణ ఉంది. చిన్న జాతి సమూహం (న్యూ మెక్సికోలో నివాస అమెరికన్లు) యొక్క ఒక చిన్న (n~=500) కేస్-నియంత్రణ అధ్యయనం ప్రకారం గర్భాశయ అసహజతకు ప్రమాద కారకాల వలె సెరుమ్ చిన్న-పోషకపదార్ధం వలె పనిచేస్తుందని విశ్లేషించింది. అధిక స్థాయి గల మహిళల కంటే, స్వల్వ రక్తరసి రెటినోల్ స్థాయి గల వారిలో CIN I యొక్క ప్రమాదం అధికంగా ఉందని తెలిసింది.[46]


అయితే, అధ్యయన సాంద్రత లోపాన్ని సూచిస్తూ మొత్తం రక్తరసి రెటినోల్‌ను స్వల్ప స్థాయిలో కలిగి ఉంది. మంచి-పోషకాల సాంద్రతలో రక్తరసి రెటినోల్ యొక్క అధ్యయనం ప్రకారం ఈ కొత్త మెక్సికో ఉప-సాంద్రతలోని అధిక స్థాయికి సమీపంగా దిగువ 20% మంది రక్తరసి రెటినోల్‌ను కలిగి ఉందని వెలువడింది.[47]


విటమిన్ సి

తక్కువ స్థాయిలో తీసుకుంటున్న వారిలో కంటే అధిక స్థాయిలో విటమిన్ సి గల పదార్ధాలను తీసుకుంటున్న మహిళలలో నిర్దిష్ట-రకం, HPV నిరంతర సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తెలిసింది.[45]


విటమిన్ ఇ

టోకోఫెరోల్‌ల యొక్క స్వల్ప రక్తరసి స్థాయి వారితో పోలిస్తే, ఎక్కువ స్థాయిలో ఉన్న మహిళలలో HPV తొలగింపు సమయం చాలా తక్కువగా ఉంటుంది, కాని ఈ అనుబంధాల్లో ముఖ్యమైన ధోరణులు సంక్రమణ </=120 రోజులకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. నిరంతర HPV సంక్రమణ యొక్క తొలగింపు ముఖ్యంగా టోకోపెరోల్స్ యొక్క వాడకపు స్థాయిలతో అనుబంధించబడి లేదు. ఈ విచారణ నుండి ఫలితాలు గర్భాశయంలో ఒంకోజెనిక్ HPV సంక్రమణ సంఘటనల శీఘ్ర తొలగింపుతో సూక్ష్మ పోషకాలకు అనుబంధాన్ని మద్దతు ఇచ్చాయి.[48]


గర్భాశయ ఇట్రాపిథేలియల్ నియోప్లాసియాతో HPV-సోకిన రోగుల యొక్క రక్తపు చుక్కల్లో ఆల్పా-టోకోఫెరోల్ యొక్క గణనీయంగా స్వల్ప స్థాయిని గమనించారు. ఆల్పా-టోకోఫెరోల్ స్థాయి < 7.95 mumol/lకు అసహజత యొక్క ప్రమాదం నాలుగు రెట్లు అధికంగా ఉంది.[49]


ఫోలిక్ ఆమ్లం

అధిక పోలేట్ స్థితి వలన HPV పరీక్ష-రూఢికి విలోమంగా అనుబంధించబడి ఉంది. అధిక పోలేట్ స్థితితో ఉన్న మహిళల్లో పదేపదే HPV పరీక్ష-రూఢికి తక్కువ అవకాశాలు ఉన్నాయి మరియు పరీక్ష-విఫలమవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫోలిక్ ఆమ్లం యొక్క తక్కువ స్థాయితో, అవరోధకాల స్థాయి కూడా తక్కువ వలన CIN అభివృద్ధి అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ఫోలేట్ స్థితిని అభివృద్ధి చేయడం వలన సంక్రమించే ప్రమాదం లేదా అధిక-ప్రమాద HPVతో ఇప్పటికే సంక్రమించిన వారు గర్భాశయ క్యాన్సర్ నివారణలో ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు.[50][51]


అయితే, మరొక అధ్యయనం ఫోలేట్ స్థితి మరియు గర్భాశయ అసహజత మధ్య ఎటువంటి సంబంధం లేదని నిరూపించింది.[46]


కారోటెనాయిడ్స్

కారోటెనాయిడ్స్ యొక్క అధిక ప్రసార స్థాయి వలన రకం-నిర్దిష్ట HPV సంక్రమణ, ప్రత్యేకంగా సంక్రమణ ప్రారంభ స్థాయిలో (</=120 రోజులు) తొలగింపు సమయం చాలా తక్కువగా ఉంటుంది. నిరంతర HPV సంక్రమణ (>120 రోజుల సమయం) యొక్క తొలగింపు కారోటెనోయిడ్స్ యొక్క వాడక స్థాయిలతో ముఖ్యంగా అనుబంధించబడి లేదు.[48]


ఆంకోజెనిక్ HPV సంక్రమణ తొలగింపు సంభావ్యత లైసోపెనెల యొక్క పెంపు స్థాయితో చాలా ఎక్కువగా ఉంటుంది.[52] స్వల్ప జీవద్రవ్య లైసోపెనె గాఢతతో ఉన్న మహిళలతో పోలిస్తే అధిక జీవద్రవ్య [లైసోపెనె] గాఢతతో ఉన్న మహిళల్లో HPV నిరంతర ప్రమాదంలో 56% తగ్గింపు కనిపించింది. ఈ డేటా ప్రకారం కాయగూరల వాడకం మరియు లైసోపెనే వాడకం నిరంతర HPVకి వ్యతిరేకంగా పోరాడతాయని సూచిస్తుంది.[44][45][53]


CoQ10

ఆరోగ్యంగా ఉన్న మహిళల గర్భాశయ కణాల్లో కంటే CIN లేదా గర్భాశయ క్యాన్సర్‌ను కలిగి ఉన్న మహిళలు, వారి రక్తంలో గుర్తించదగ్గ అతి తక్కువ CoQ10 స్థాయిలను కలిగి ఉన్నారు.[citation needed]


చేప నూనె

ఒక 1999 అధ్యయనంలో, HPV16 శాశ్వత జీవకణాల యొక్క పెరుగుదలను డోకోసాహెక్సాయినిక్ ఆమ్లం నిరోధిస్తుందని తెలిసింది.[54]


రోగ నిరూపణ

రోగ నిరూపణ క్యాన్సర్ యొక్క స్థితిపై ఆధారపడి ఉంటుంది. చిక్సితతో, హానికర గర్భాశయ క్యాన్సర్ యొక్క ప్రారంభ దశకు 5-సంవత్సరాల సంబంధిత మనుగడ స్థాయి 92% కాగా, మొత్తం (మొత్తం దశలు కలిపి) 5-సంవత్సరాల మనుగడ స్థాయి దాదాపు 72%గా ఉంది. అధ్యయనం చేసిన మహిళలు మొదటిసారి రోగ నిర్ధారించబడినప్పుడు ఐదు సంవత్సరాల క్రితం చిక్సిత స్థితిపై కొంత ఆధారపడి ఈ ఫలితాలను తీసుకుని, కొత్తగా రోగ నిర్ధారిత మహిళలకు వర్తించినప్పుడు ఈ గణాంకాల మెరుగుపడవచ్చు.[32]


రోగ నిర్ధారణ జరిగిన 5 సంవత్సరాల తర్వాత చిక్సితతో దశ I క్యాన్సర్‌తో బాధపడుతున్న 80 నుండి 90% మంది మహిళలు మరియు దశ II క్యాన్సర్‌తో బాధపడుతున్న 50 నుండి 60% మంది మహిళలు జీవించి ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత దశ III క్యాన్సర్‌తో బాధపడుతున్న 25 నుండి 35% వరకు మాత్రమే మరియు దశ IV క్యాన్సర్‌తో బాధపడుతున్న 15% లేదా తక్కువ మంది మహిళలు మాత్రమే జీవించి ఉన్నారు.[55]


స్త్రీ రోగశాస్త్రం మరియు ప్రసూతి శాస్త్రం యొక్క అంతర్జాతీయ సమాఖ్య ప్రకారం, రేడియోధార్మిక చిక్సితను సిస్‌ప్లాటిన్ ఆధారిత రసాయనిక చిక్సితతో కలిపినప్పుడు జీవించే శాతం పెరుగుతుంది.[56]


క్యాన్సర్ శరీరం యొక్క ఇతర భాగాలకు వ్యాప్తి చెందడం వలన, రసాయనిక చిక్సిత వంటి మొత్తం శరీర చిక్సిత కంటే సాధారణంగా స్థానిక గాయాల చిక్సిత ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది కనుక రోగ నిరూపణ అనూహ్యంగా పడిపోతుంది.


చిక్సిత తర్వాత రోగి అంతర మూల్యాంకనం అత్యవసరం. ప్రారంభ స్థాయిలలో గుర్తించిన పునః గర్భాశయ క్యానర్స్‌ను శస్త్రచిక్సిత, రేడియోధార్మిక శక్తి, రసాయనిక చిక్సిత లేదా మూడింటి కలయికతో విజయవంతంగా చిక్సిత చేయవచ్చు. హానికర గర్భాశయ క్యాన్సర్‌తో ఉన్న ముప్పై-ఐదు శాతం రోగుల్లో చిక్సిత తర్వాత నిరంతర లేదా మళ్లీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.[57]


గర్భాశయ క్యాన్సర్ నుండి సంభావ్య మరణించే సంవత్సరాల సగటు 25.3 (SEER క్యాన్సర్ గణాంకాల సమీక్ష 1975-2000, నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (NCI)). SEERచే లెక్కల ప్రకారం 2001లో USలో గర్భాశయ క్యాన్సర్‌తో (DSTD) దాదాపు 4,600 మహిళలు మరణించేలా ఉన్నారని మరియు USలో 2002లో 13,000 వార్షిక సంఘటనలను భావించారు. సంఘటనలతో మరణాల నిష్పత్తి దాదాపు 35.4%గా ఉంది.


క్రమబద్ధమైన పరీక్షలు వ్యాధి ప్రారంభ స్థాయి మార్పులు మరియు గర్భాశయ క్యాన్సర్‌ల ప్రారంభ దశను గుర్తించి, త్వరితంగా చిక్సిత చేయడానికి ఉద్దేశించినవి. గణాంకాలు ప్రకారం UKలో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడం ద్వారా ప్రతి సంవత్సరం 5,000 మంది ప్రాణాలను కాపాడుతున్నట్లు తెలుస్తుంది.[58] UKలో గర్భాశయ క్యాన్సర్‌తో సంవత్సరానికి సుమారు 1,000 మంది మహిళలు మరణిస్తున్నారు.


క్రమబద్ధమైన రెండు-సంవత్సరాల పాప్ పరీక్షలు ఆస్ట్రేలియాలో 90% వరకు గర్భాశయ క్యాన్సర్ సంఘటనలను తగ్గిస్తున్నాయి మరియు ప్రతి సంవత్సరం ఈ వ్యాధితో మరణించకుండా 1,200 ఆస్ట్రేలియన్ మహిళలను రక్షిస్తున్నాయి. [59]


సాంక్రమిక రోగ విజ్ఞానం

ప్రపంచవ్యాప్తంగా, గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో అధిక ప్రాణాంతక క్యాన్సర్‌లలో ఐదోది.[60] ఇది సంవత్సరానికి 100,000 మహిళల్లో 16 మందికి సోకుతుంది మరియు సంవత్సరానికి 100,000 మందిలో 9 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.[61]


యునైటెడ్ స్టేట్స్‌లో, ఇది మహిళల్లో వచ్చే సాధారణ క్యాన్సర్‌ల్లో 8 క్యాన్సర్ మాత్రమే. 1998లో, USలో సుమారు 12,800 మంది మహిళలకు రోగ నిర్ధారణ కాగా, 4,800 వరకు చనిపోయారు.[8] స్త్రీ రోగ శాస్త్ర క్యాన్సర్‌లలో ఇది గర్భాశయ లోపలి పొర సంబంధిత క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ తర్వాత స్థానంలో ఉంది. పాప్ స్మెర్తో పరీక్ష యొక్క విజయంలో భాగంగా మిగిలిన ప్రపంచంలోని మరణాల సంఖ్యలో USలో సంఘటనలు మరియు మరణాల సంఖ్య సగంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో గర్భాశయ క్యాన్సర్ యొక్క కొత్త కేసుల సంఘటనలు 2004లో 100,000 మహిళల్లో 7 మందిగా ఉంది.[62]


మిగిలిన ఉత్తర యూరోప్‌లో వలె యునైటెడ్ కింగ్‌డమ్‌లో, సంఘటనలు సంవత్సరానికి (2005) 9.1/100,000 మరియు మరణాల సంఖ్య సంవత్సరానికి (2006) 3.1/100,000 (UK కోసం క్యాన్సర్ పరిశోధన UK గర్భాశయ క్యాన్సర్ గణాంకాలు)[63].[64] 1988-1997 నుండి 42% తగ్గింపుతో NHS అమలు చేసిన పరీక్షా కార్యక్రమం మంచి విజయాన్ని సాధించింది, ప్రతి 3 సంవత్సరాలకు అధిక ప్రమాద వయస్సు సమూహాన్ని (25-49 సంవత్సరాలు) పరీక్షించారు మరియు 50-64 వయస్సు వారిని ప్రతి 5 సంవత్సరాలకు పరీక్షించారు.


కెనడాలో, 2008లో గర్భాశయ క్యాన్సర్‌తో 1,300 మంది మహిళలకు రోగ నిర్ధారణ జరుగుతుందని మరియు 380 మంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు.[65]


ఆస్ట్రేలియాలో, 734 మంది గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు (2005). 1991లో (1991-2005) పరీక్ష ప్రారంభించడం వలన గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల సంఖ్య సగటు ప్రతి సంవత్సరం 4.5% పడిపోయింది. [66].


ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 473,000 గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 253,500 మరణాలు సంభవిస్తున్నాయి.[67]


చరిత్ర

 • 400 BCE - హిప్పోక్రాటేస్: గర్భాశయ క్యాన్సర్ నయం కాదు
 • 1925 - హాన్స్ హిన్సెల్‌మాన్: కోల్పోస్కోప్ సృష్టి
 • 1928 - పాపనికోలాయి: పాప్ ఉపాయాలను వృద్ధి చేయబడ్డాయి
 • 1941 - పాపనికోలాయో మరియు ట్రౌట్: పాప్ పరీక్ష
 • 1946 - అయ్యర్: గర్భాశయాన్ని చీరే చిన్న కత్తి
 • 1976 - జూర్ హౌసెన్ మరియు జిశామ్: గర్భాశయ క్యాన్సర్ మరియు మొటిమల్లో HPV DNA కనుగొనబడింది
 • 1988 - పాప్ ఫలితాల కోసం బెథెస్డా వ్యవస్థ అభివృద్ధి చేయబడింది


తొలి 20వ దశాబ్దంలో పనిచేస్తున్న సాంక్రమిక వ్యాధుల శాస్త్రవేత్తలు దీన్ని గమనించారు:

 1. గర్భాశయ క్యాన్సర్ అనేది లైంగిక కార్మికుల్లో సర్వసాధారణం.
 2. పద్ధతిలోకి ప్రవేశించక ముందు లైంగిక చర్యల్లో పాల్గొన్న వారు మినహా ఇది సన్యాసినుల్లో అరుదు. (1841లో రిజోని)
 3. ఇది మొదటి భార్య గర్భాశయ క్యాన్సర్‌తో మరణించిన వ్యక్తుల రెండవ భార్యల్లో సర్వ సాధారణం.
 4. ఇది జీవిష్ మహిళల్లో చాలా అరుదు.[68]
 5. 1935లో, స్వైర్టన్ మరియు బెర్రీ కుందేళ్లలో RPV (ర్యాబిట్ పాపిల్లోమావైరస్) మరియు చర్మ క్యాన్సర్‌ల మధ్య ఒక సంబంధాన్ని కనిపెట్టారు. (HPV అనేది is జాతులు-నిర్దిష్టత మరియు కనుక కుందేళ్లకు ప్రసారం చేయలేము)


ఇది లైంగిక ప్రసారిత ప్రతినిధిచే గర్భాశయ క్యాన్సర్ రావచ్చని అనే నిగమనానికి దారి తీసింది. 1950లు మరియు 1960ల్లోని ప్రారంభ పరిశోధన స్మెగ్మాను కారణంగా భావించారు (ఉదా. హెయిన్స్ ఎట్ ఆల్. 1958)[69] , కాని ఇది 1970ల మానవ పపిల్లోమావైరస్ (HPV) గుర్తించే వరకు మాత్రం కాదు. 1949లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌చే ఒక వివరణ ముందుగా ఇచ్చారు మరియు 1963లో HPV-DNA కనుగొనబడింది. ఇది దాదాపు అన్ని గర్భాశయ క్సాన్సర్‌లలో HPV కలిసి ఉంటుందని ప్రదర్శించబడింది.[4] సంబంధించి వచ్చే నిర్దిష్ట వైరస్ ఉపరకాలు HPV 16, 18, 31, 45 మరియు ఇతరాలు.


అన్వయములు మరియు గమనికలు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 Kumar, Vinay; Abbas, Abul K.; Fausto, Nelson; & Mitchell, Richard N. (2007). Robbins Basic Pathology ((8th ed.) ed.). Saunders Elsevier. pp. 718–721. ISBN 978-1-4160-2973-1.CS1 maint: multiple names: authors list (link)
 2. Walboomers JM, Jacobs MV, Manos MM; et al. (1999). "Human papillomavirus is a necessary cause of invasive cervical cancer worldwide". J. Pathol. 189 (1): 12–9. doi:10.1002/(SICI)1096-9896(199909)189:1<12::AID-PATH431>3.0.CO;2-F. PMID 10451482. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 3. 3.0 3.1 "FDA Licenses New Vaccine for Prevention of Cervical Cancer". U.S. Food and Drug Administration. 2006-06-08. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 4. 4.0 4.1 Lowy DR, Schiller JT (2006). "Prophylactic human papillomavirus vaccines". J. Clin. Invest. 116 (5): 1167–73. doi:10.1172/JCI28607. PMID 16670757. Retrieved 2007-12-01.
 5. "Human Papillomavirus (HPV) Vaccines: Q & A - National Cancer Institute". Retrieved 2008-07-18.
 6. 6.0 6.1 "Cancer Research UK website". Retrieved 2009-01-03.
 7. 7.0 7.1 7.2 DeMay, M (2007). Practical principles of cytopathology. Revised edition. ISBN 978-0-89189-549-7.
 8. 8.0 8.1 8.2 Canavan TP, Doshi NR (2000). "Cervical cancer". Am Fam Physician. 61 (5): 1369–76. PMID 10735343. Retrieved 2007-12-01.
 9. Nanda, Rita (2006-06-09). "Cervical cancer". MedlinePlus Medical Encyclopedia. National Institutes of Health. Retrieved 2007-12-02.
 10. 10.0 10.1 "What Causes Cancer of the Cervix?". American Cancer Society. 2006-11-30. Retrieved 2007-12-02.
 11. Marrazzo JM, Koutsky LA, Kiviat NB, Kuypers JM, Stine K (2001). "Papanicolaou test screening and prevalence of genital human papillomavirus among women who have sex with women". Am J Public Health. 91 (6): 947–52. PMID 11392939. Retrieved 2007-12-30.CS1 maint: multiple names: authors list (link)
 12. "HPV Type-Detect". Medical Diagnostic Laboratories. 2007-10-30. Retrieved 2007-12-02.
 13. Gottlieb, Nicole (2002-04-24). "A Primer on HPV". Benchmarks. National Cancer Institute. Retrieved 2007-12-02.
 14. Muñoz N, Bosch FX, de Sanjosé S, Herrero R, Castellsagué X, Shah KV, Snijders PJ, Meijer CJ (2003). "Epidemiologic classification of human papillomavirus types associated with cervical cancer". N. Engl. J. Med. 348 (6): 518–27. doi:10.1056/NEJMoa021641. PMID 12571259. Retrieved 2007-12-01.CS1 maint: multiple names: authors list (link)
 15. 15.0 15.1 Walboomers JM, Jacobs MV, Manos MM, Bosch FX, Kummer JA, Shah KV, Snijders PJ, Peto J, Meijer CJ, Muñoz N (1999). "Human papillomavirus is a necessary cause of invasive cervical cancer worldwide". J. Pathol. 189 (1): 12–9. doi:10.1002/(SICI)1096-9896(199909)189:1<12::AID-PATH431>3.0.CO;2-F. PMID 10451482. |access-date= requires |url= (help)CS1 maint: multiple names: authors list (link)
 16. Snijders PJ, Steenbergen RD, Heideman DA, Meijer CJ (2006). "HPV-mediated cervical carcinogenesis: concepts and clinical implications". J. Pathol. 208 (2): 152–64. doi:10.1002/path.1866. PMID 16362994. |access-date= requires |url= (help)CS1 maint: multiple names: authors list (link)
 17. Nader, Carol (2005-02-16). "Expert says circumcision makes sex safer". The Age. Fairfax Media. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 18. Rivet C (2003). "Circumcision and cervical cancer. Is there a link?". Can Fam Physician. 49: 1096–7. PMID 14526861. Retrieved 2007-12-01.
 19. Garcia, Agustin (2006-07-06). "Cervical Cancer". eMedicine. WebMD. Retrieved 2007-12-02. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 20. Dolinsky, Christopher (2006-07-17). "Cervical Cancer: The Basics". OncoLink. Abramson Cancer Center of the University of Pennsylvania. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 21. Erstad, Shannon (2007-01-12). "Cone biopsy (conization) for abnormal cervical cell changes". WebMD. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 22. Jones WB, Mercer GO, Lewis JL, Rubin SC, Hoskins WJ (1993). "Early invasive carcinoma of the cervix". Gynecol. Oncol. 51 (1): 26–32. doi:10.1006/gyno.1993.1241. PMID 8244170. Retrieved 2007-12-01.CS1 maint: multiple names: authors list (link)
 23. Dolson, Laura (2001). "Trachelectomy". Retrieved 2007-12-02.
 24. 24.0 24.1 Burnett AF (2006). "Radical trachelectomy with laparoscopic lymphadenectomy: review of oncologic and obstetrical outcomes". Curr. Opin. Obstet. Gynecol. 18 (1): 8–13. doi:10.1097/01.gco.0000192968.75190.dc. PMID 16493253. Retrieved 2007-12-01.
 25. Cibula D, Ungár L, Svárovský J, Zivný J, Freitag P (2005). "[Abdominal radical trachelectomy--technique and experience]". Ceska Gynekol (in Czech). 70 (2): 117–22. PMID 15918265. |access-date= requires |url= (help)CS1 maint: multiple names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 26. Plante M, Renaud MC, Hoskins IA, Roy M (2005). "Vaginal radical trachelectomy: a valuable fertility-preserving option in the management of early-stage cervical cancer. A series of 50 pregnancies and review of the literature". Gynecol. Oncol. 98 (1): 3–10. doi:10.1016/j.ygyno.2005.04.014. PMID 15936061. Retrieved 2007-12-01.CS1 maint: multiple names: authors list (link)
 27. Roy M, Plante M, Renaud MC, Têtu B (1996). "Vaginal radical hysterectomy versus abdominal radical hysterectomy in the treatment of early-stage cervical cancer". Gynecol. Oncol. 62 (3): 336–9. doi:10.1006/gyno.1996.0245. PMID 8812529. Retrieved 2007-12-01.CS1 maint: multiple names: authors list (link)
 28. Dargent D, Martin X, Sacchetoni A, Mathevet P (2000). "Laparoscopic vaginal radical trachelectomy: a treatment to preserve the fertility of cervical carcinoma patients". Cancer. 88 (8): 1877–82. doi:10.1002/(SICI)1097-0142(20000415)88:8<1877::AID-CNCR17>3.0.CO;2-W. PMID 10760765. |access-date= requires |url= (help)CS1 maint: multiple names: authors list (link)
 29. Schlaerth JB, Spirtos NM, Schlaerth AC (2003). "Radical trachelectomy and pelvic lymphadenectomy with uterine preservation in the treatment of cervical cancer". Am. J. Obstet. Gynecol. 188 (1): 29–34. doi:10.1067/mob.2003.124. PMID 12548192. |access-date= requires |url= (help)CS1 maint: multiple names: authors list (link)
 30. "FDA Approves First Drug Treatment for Late-Stage Cervical Cancer". U.S. Food and Drug Administration. 2006-06-15. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 31. Tiro JA, Meissner HI, Kobrin S, Chollette V (2007). "What do women in the U.S. know about human papillomavirus and cervical cancer?". Cancer Epidemiol. Biomarkers Prev. 16 (2): 288–94. doi:10.1158/1055-9965.EPI-06-0756. PMID 17267388. Retrieved 2007-12-01.CS1 maint: multiple names: authors list (link)
 32. 32.0 32.1 "What Are the Key Statistics About Cervical Cancer?". American Cancer Society. 2008-03-26. Retrieved 2008-08-19. Cite error: Invalid <ref> tag; name "ACS Key Stats" defined multiple times with different content
 33. Saslow D, Runowicz CD, Solomon D; et al. (2002). "American Cancer Society guideline for the early detection of cervical neoplasia and cancer". CA: a cancer journal for clinicians. 52 (6): 342–62. PMID 12469763. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 34. Willis BH, Barton P, Pearmain P, Bryan S, Hyde C (2005). "Cervical screening programmes: can automation help? Evidence from systematic reviews, an economic analysis and a simulation modelling exercise applied to the UK". Health technology assessment (Winchester, England). 9 (13): 1–207, iii. PMID 15774236. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 35. Naucler P, Ryd W, Törnberg S; et al. (2007). "Human papillomavirus and Papanicolaou tests to screen for cervical cancer". N. Engl. J. Med. 357 (16): 1589–97. doi:10.1056/NEJMoa073204. PMID 17942872. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 36. http://www.thelancet.com/journals/lancet/article/PIIS0140-6736(09)61248-4/fulltext
 37. "EU approves cervical cancer jab". BBC. 2006-09-22. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 38. "GSK's HPV Vaccine 100% Effective For Four Years, Data Show". Medical News Today. MediLexicon International Ltd. 2006-02-27. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 39. "Cancer jab 'stops 75% of deaths'". BBC. 2006-09-04. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 40. McNeil C (2006). "Who invented the VLP cervical cancer vaccines?". J. Natl. Cancer Inst. 98 (7): 433. doi:10.1093/jnci/djj144. PMID 16595773. Retrieved 2007-12-01.
 41. Cornelis J.A. Hogewoning, Maaike C.G. Bleeker; et al. (2003). "Condom use Promotes the Regression of Cervical Intraepithelial Neoplasia and Clearance of HPV: Randomized Clinical Trial". International Journal of Cancer. 107: 811–816. doi:10.1002/ijc.11474. PMID 14566832. Explicit use of et al. in: |author= (help)
 42. "Semen 'may fuel cervical cancer'". BBC. 2006-08-31. Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 43. "Semen can worsen cervical cancer". Medical Research Council (UK). Retrieved 2007-12-02. Cite has empty unknown parameter: |coauthors= (help)
 44. 44.0 44.1 Sedjo RL, Roe DJ, Abrahamsen M; et al. (2002). "Vitamin A, carotenoids, and risk of persistent oncogenic human papillomavirus infection". Cancer Epidemiol. Biomarkers Prev. 11 (9): 876–84. PMID 12223432. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 45. 45.0 45.1 45.2 Giuliano AR, Siegel EM, Roe DJ; et al. (2003). "Dietary intake and risk of persistent human papillomavirus (HPV) infection: the Ludwig-McGill HPV Natural History Study". J. Infect. Dis. 188 (10): 1508–16. doi:10.1086/379197. PMID 14624376. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 46. 46.0 46.1 Yeo AS, Schiff MA, Montoya G, Masuk M, van Asselt-King L, Becker TM (2000). "Serum micronutrients and cervical dysplasia in Southwestern American Indian women". Nutrition and cancer. 38 (2): 141–50. doi:10.1207/S15327914NC382_1. PMID 11525590.CS1 maint: multiple names: authors list (link)
 47. Michaëlsson K, Lithell H, Vessby B, Melhus H. (2003). "Serum Retinol Levels and the Risk of Fracture". NEJM. 348 (4): 287–294. doi:10.1056/NEJMoa021171. PMID 12540641.CS1 maint: multiple names: authors list (link)
 48. 48.0 48.1 Goodman MT, Shvetsov YB, McDuffie K; et al. (2007). "Hawaii cohort study of serum micronutrient concentrations and clearance of incident oncogenic human papillomavirus infection of the cervix". Cancer Res. 67 (12): 5987–96. doi:10.1158/0008-5472.CAN-07-0313. PMID 17553901. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 49. Kwaśniewska A, Tukendorf A, Semczuk M (1997). "Content of alpha-tocopherol in blood serum of human Papillomavirus-infected women with cervical dysplasias". Nutrition and cancer. 28 (3): 248–51. PMID 9343832.CS1 maint: multiple names: authors list (link)
 50. Piyathilake CJ, Henao OL, Macaluso M; et al. (2004). "Folate is associated with the natural history of high-risk human papillomaviruses". Cancer Res. 64 (23): 8788–93. doi:10.1158/0008-5472.CAN-04-2402. PMID 15574793. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 51. Kwaśniewska A, Tukendorf A, Goździcka-Józefiak A, Semczuk-Sikora A, Korobowicz E (2002). "Content of folic acid and free homocysteine in blood serum of human papillomavirus-infected women with cervical dysplasia". Eur. J. Gynaecol. Oncol. 23 (4): 311–6. PMID 12214730.CS1 maint: multiple names: authors list (link)
 52. Sedjo RL, Papenfuss MR, Craft NE, Giuliano AR (2003). "Effect of plasma micronutrients on clearance of oncogenic human papillomavirus (HPV) infection (United States)". Cancer Causes Control. 14 (4): 319–26. doi:10.1023/A:1023981505268. PMID 12846362.CS1 maint: multiple names: authors list (link)
 53. Giuliano AR, Papenfuss M, Nour M, Canfield LM, Schneider A, Hatch K (1997). "Antioxidant nutrients: associations with persistent human papillomavirus infection". Cancer Epidemiol. Biomarkers Prev. 6 (11): 917–23. PMID 9367065.CS1 maint: multiple names: authors list (link)
 54. Chen D, Auborn K (1999). "Fish oil constituent docosahexa-enoic acid selectively inhibits growth of human papillomavirus immortalized keratinocytes". Carcinogenesis. 20 (2): 249–54. doi:10.1093/carcin/20.2.249. PMID 10069461.
 55. "Cervical Cancer". Cervical Cancer: Cancers of the Female Reproductive System: Merck Manual Home Edition. Merck Manual Home Edition. Retrieved 2007-03-24.
 56. Committee on Practice Bulletins-Gynecology (2002). "ACOG practice bulletin. Diagnosis and treatment of cervical carcinomas, number 35, May 2002". Obstetrics and gynecology. 99 (5 Pt 1): 855–67. PMID 11978302.
 57. "Cervical Cancer". Cervical Cancer: Pathology, Symptoms and Signs, Diagnosis, Prognosis and Treatment. Armenian Health Network, Health.am.
 58. "Cervical cancer statistics and prognosis". Cancer Research UK. Retrieved 2007-03-24.
 59. http://www.papscreen.org.au/
 60. World Health Organization (2006). "Fact sheet No. 297: Cancer". Retrieved 2007-12-01. Unknown parameter |month= ignored (help)
 61. మూస:Web cite
 62. SEER cancer statistics
 63. http://info.cancerresearchuk.org/cancerstats/types/cervix/mortality/
 64. http://info.cancerresearchuk.org/cancerstats/types/cervix/mortality/
 65. Noni MacDonald, Matthew B. Stanbrook, and Paul C. Hébert (September 9, 2008). "Human papillomavirus vaccine risk and reality". CMAJ. 179 (6). doi:10.1503/cmaj.081238. Retrieved 2008-11-17.CS1 maint: multiple names: authors list (link)
 66. http://www.papscreen.org.au/browse.asp?ContainerID=c15
 67. "NCCC National Cervical Cancer Coalition". Retrieved 2008-07-01.
 68. Menczer J (2003). "The low incidence of cervical cancer in Jewish women: has the puzzle finally been solved?" (PDF). Isr. Med. Assoc. J. 5 (2): 120–3. PMID 12674663. Archived from the original (PDF) on 2012-08-21. Retrieved 2007-12-01.
 69. Heins Jr, HC (1958-10-01). "The possible role of smegma in carcinoma of the cervix". American Journal of Obstetrics & Gynecology. 76 (4): 726–33. PMID 13583012. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); |access-date= requires |url= (help)బాహ్య లింక్లు


మూస:Human papillomavirus మూస:Urogenital neoplasia