"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గవర
గవర బీ.సి.డి.గ్రూపు కులం. చెరకు గానుగ ఆడించి, వండి, బెల్లం తయారు చేస్తారు. విశాఖ జిల్లాలో [1]గవర కులస్తులు ఎక్కువ. చెరకు తోటల్లోని గడలు పడిపోకుండా ఆకులతో ఒకదానితో ఒకటి మెలిపెట్టి జడకట్టడంలో వీరు ప్రసిద్ధి. చెరకు నరకడం, చెరకు తోటల్లో పనిచేయడం వీరి వృత్తి. క్రమంగా చెరకు సాగునుంచి తప్పుకున్న గవర కులస్తులు చెరకు నుంచి బెల్లం తయారు చేయడాన్ని జీవనాధారంగా ఎంచుకున్నారు. ఆ రోజుల్లో చెరకు గానుగలను ఆడించేవారు. వీటి కోసం పశపోషణ కూడా చేసేవారు. గానుగలో ఆడించగా వచ్చిన చెరకు రసాన్ని స్టీలు బిందెల్లో పట్టి పెద్ద పెద్ద పెనంలో చేర్చి వేడి చేసేవారు. చిక్కబడిన తర్వాత బెల్లంగా మారేది. పాకం సరిగ్గా పట్టకపోతే పాడైపోతుంది ప్రస్తుతం రంగు కోసం, పొంగు రాకుండా హైడ్రస్, యూరియా వంటి కెమికల్స్ వాడుతు న్నారు. పైతెట్టు తీసేస్తే బెల్లం రంగులో కొంత తేడా కనిపించేంది. తీయకపోతే నల్లగా వచ్చేది. పొంగు వస్తే మంటను తగ్గించడం, ఆ తర్వాత పెంచడం చేసేవారే తప్ప ఇప్పట్లా పూర్వం కెమికల్ వాడేవారు కాదు. అప్పట్లో మొలాసిస్ కూడా తీసేవారు కాదు. చెరకు రసం తీయగా మిగిలిన పిప్పిని వంట చెరకుగానే వాడేవారు. ఈ నేపథ్యంలో బడా కంపెనీలు రంగ ప్రవేశం చేయడంతో వీరు మరోసారి జీవనోపాధిని కోల్పోయారు. బతుకు తెరువు కోసం దొరికిన పని చేసుకుని జీవిస్తున్నారు. వీరు ఎక్కడున్నా గ్రూపులు గ్రూపులుగా జీవిస్తారు. కనుకనే శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, తడ మండలాలు, విజయనగరంలోని కొంత భాగం, తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలం, ఏలూరు, విజయవాడ, విశాఖల్లో గవర కులస్తులు కనిపిస్తారు. తమ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ ప్రతినిధులను గెలిపించే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. మంత్రి కొణతల రామకృష్ణ, శాసనమండలిలో టీడీపీ ఫ్లొర్లీడర్ దాడి వీరభద్రరావు ఈ సామాజికవర్గం నుంచి ఎన్నికైనవారే. శ్రీ గౌరీ గవర సేవా సంఘం వారు మాది వ్యవసాయ ఆధారిత కులం కావున బీసీ-డీ నుం చి బీసీ-ఏ లోకి మార్చాలి...' అంటున్నారు. రాష్ర్టంలో గవర జనాభా 20 లక్షలు అని అంచనా.
శ్రీ గౌరీ దేవి పేరు మీద గౌరి కులం ఏర్పడినది తదనంతరం అధి గవర గా మారినది అందుకే వీరు నివసించు ప్రదేశంలలో ప్రతి సంవత్సరం శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సమ్ చేస్తూ వుంటారు. వీటిలో అనకాపల్లి లో వేల్పుల వీధి, గవరపాలెం , అలాగే మునగపాక , కశింకోట , చూచుకొండ, కస్పా జగన్నాధపురం గ్రామాలలో జరిగే శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సమ్ ప్రసిద్ది గాంచినది.