"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గాంధీజనసంఘం(గ్రామం)

From tewiki
Jump to navigation Jump to search

"గాంధీజనసంఘం(గ్రామం)" శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన గ్రామం.[1]

గాంధీజనసంఘం(గ్రామం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం సంగం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గాంధీజనసంఘం గ్రామం, జిల్లాలో పెద్ద గిరిజన గ్రామం. జనాభా=1,056. నెల్లూరు గాంధీగా పరిగణించే శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య పంతులు , 1940 దశకంలో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అప్పటివరకూ చెట్టుకొకరు, పుట్టకొకరుగా తిరుగుతున్న గిరిజనులను ఇక్కడకు చేర్చి, గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి పరిస్థితుల ప్రకారం, వీరికి ప్రాథమిక పాఠశాలను మాత్రమే ఏర్పాటుచేశారు. అప్పటి నుండి 1997 వరకూ ఇక్కడ కేవలం పాఠశాల మాత్రమే ఉండేది. ఆ పరిస్థితులలో, సంగం మండలం పడమటిపాళెం వాసియైన శ్రీ తుమ్మల భక్తవత్సలరెడ్డి , కేవలం ప్రాథమిక విద్యాభ్యాసం తోనే చదువులు ఆగిపోకూడదనీ, ఉన్నత విద్యాభాసం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలనీ ఆశించారు. వీరి కృషి ఫలితంగా, 1995, మే నెల 12 న, ఉన్నత పాఠశాల ఏర్పడింది. అనంతరం పాఠశాలకు అవసరమైన స్థలాన్ని వీరు కొనుగోలుచేసి, భవన నిర్మాణానికి తనవంతు విరాళం అందజేశారు. ఈ రకంగా గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పడింది. ప్రస్తుతం 10 గదులున్నవి. న్యూయార్కులో వైద్యుడిగా పనిచేస్తున్న ఈయన, ప్రతియేటా ఇక్కడకు వచ్చి, పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తుంటారు. గత ఏడాది వచ్చినప్పుడు, పాఠశాలకు అవసరమైన ఇన్వర్టరునూ, నీటిశుద్ధి యంత్రాన్నీ విరాళంగా అందజేశారు. ఆ రకంగా వీరు గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [1]

గామ ప్రముఖులు

  • మల్లి మస్తాన్ బాబు ప్రపంచప్రసిద్ధిచెందిన పర్వాతారోహకుడు. ఈయన పేరు గిన్నెస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ లో నమోదయినది.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

ఆరోగ్య సంరక్షణ

మంచినీటి వసతి

రోడ్దు వసతి

విద్యుద్దీపాలు

తపాలా సౌకర్యం

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)


మూలాలు

[1] ఈనాడు నెల్లూరు; జనవరి-13,2014; 8వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.