"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గాజు జీవులు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Transparent animals.png
గాజు జీవులు

ప్రకృతిలో ఎన్నో వింతలు, అద్భుతాలు ఉంటాయి. ఇటువంటి వింతలలో కొన్ని జీవులకు తమ శరీరం పారదర్శకంగా ఉంటుంది. వీటిని పారదర్శక జీవులు లేదా గాజు జీవులు అంటారు. ఈ జీవుల శరీర అంతర్భాగాలను మనం చూడవచ్చు. కొన్ని జీవులు శత్రువుల నుండి రక్షించుకొనుటకు తమ శరీరాన్ని పారదర్శకంగా మార్చే విశిష్ట లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇవి భూమిపై, జలాలలో కూడా ఉండవచ్చును. వీటిని ప్రకృతిలో వింతలుగా చెప్పుకోవచ్చును.

పారదర్శక కప్ప

ఈ కప్ప ఈక్విడార్ దీవులలో ఉంటుంది. దీనిని "గాజు కప్ప" అంటారు. ఇది వెనుజులా అడవులలో ఉంటుంది. వీటి శరీర అంతర్భాగాలను స్పష్టంగా చూడవచ్చు. వీటి చర్మం పారదర్శకంగా ఉంటుంది. వీటి అంతర్భాగంలో గల గ్రుడ్లను స్పష్టంగా చూడవచ్చు.

పారదర్శక కేవ్ క్రే ఫిష్

గుహలు అనేవి భూగ్రహంపై గల చీకటి ప్రదేశాలు. ఈ గుహలలో తగినంత వెలుతురు ఉండదు. ఈ గుహలలో ఏ పరికరంతో కూడా తగిన కాంతి కణాలను గుర్తించలేము. ఇలాంటి పరిస్థితులలో కొన్ని జీవులు చేపలు, సాలీళ్ళు, కీటకాలు, క్రే చేపలు వంటివి నివసిస్తుంటాయి. ఈ జంతువులు చీకటి ప్రదేశాలలో ఉండటానికి అలవాటు పడతాయి. అవి గుహల బయటి పరిసరాలలో ఇమడలేవు. ఇటువంటి జీవులకు కూడా శరీరం పారదర్శకంగా ఉంటుంది. వీటికి కళ్ళుగానీ, పిగ్మెంటేషన్ కానీ అవసరం లేదు.

పారదర్శక సీ కుకుంబర్

ఇవి మెల్లగా చలిస్తాయి. వీటి శరీరం మెత్తగా ఉండి క్రిందిభాగం గుల్లగా ఉంటుంది. సీ కుకుంబర్ అనే జీవులు ప్రాచీన వంశ పరంపర గల జీవులు. జీవ పరిణామ క్రమంలో కొన్ని వందల జాతులు ఉండేవి. కొన్ని సీ కుకుంబర్ జీవుల శరీర భాగాలు పారదర్శకంగా ఉంటాయి. వీటి గుండా కాంతి ప్రసరిస్తుంది.

పారదర్శక ఐస్ ఫిష్

అంటార్కిటికా, దక్షిణ అమెరికా సముద్ర ప్రాంతాల్లో గల శీతల నీటి ప్రవాహాలలో క్రోకోడైల్ ఐస్ ఫిష్, కోపెపోడ్స్, యితర చేపలు ఉంటాయి. ఇవి పారదర్శకమైన రక్తాన్ని కలిగి ఉంటాయి. ఎందువల్లనంటే వాటి రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు. వీటి రక్తంలో ఎరిథ్రోసైటిస్ కూడా ఉండక పోవచ్చు. వీటి శరీరంలో గల రక్తానికి ఆక్సిజను చర్మం ద్వారా అందుతుంది. ఇవి శీతలంగా మారినపుడు అధిక ఆక్సిజను నీటిలో కరిగిపోతుంది. ఇవి పారదర్శకంగా ఉంటాయి.

పారదర్శక ఏంఫీఫోడ్

వీటిని ఫ్రోనిమా అని అంటారు.ఈ జలచరాలను ఈ మధ్యనే పర్వత శ్రేణులలోని అధిక లోతుగా గల ప్రాంతాలలో కనుగొన్నారు. ఇవి ఉత్తర అట్లాంటిక్ లో ఉంటాయి. ఈ జీవులు విచిత్ర ప్రవర్తనను కలిగి ఉంటాయి. వీటి శరీర భాగాలన్నీ పారదర్శకంగా ఉండి అవి అదృశ్యమైనట్టు కనిపిస్తాయి.

పారదర్శక స్క్యీడ్

ఇ దక్షిణ అర్థ గోళంలో గల సముద్రాలలో కనిపిస్తాయి. ఈ గాజు స్క్యీడ్ సున్నిత అవయవాలను కలిగి ఉంటుంది. జలాలలో సంచరించే హెడ్జ్‌హాగ్ వలె యివి బంతిలా తిరిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి కూడా పారదర్శకంగా ఉంటాయి.

గాజు చేప

శరీరమంతా గాజులా కనిపిస్తున్న ఈ చేపను ఈ మధ్యనే కనుగొన్నారు. దీని పేరు సైనోవేటర్ నాక్టివేజ్ . దీనిలో మొదటి పదానికి నీలం కడుపు అనీ, రెండవ పదానికి రాత్రి తిరిగేదని అర్థము. పెద్ద కళ్ళు, నాలుగు పళ్ళు, నీలం రంగు పొట్టతో విచిత్రంగా ఉంటుంది. దీని పొడవు 17 మిల్లీ మీటర్లు ఉంటుంది. ఇది జాన్ ఉపనది జిగోనిగ్రోలో కనుగొనబడింది.

సముద్ర దేవత

దీనిని ఏంజెల్ ఫిష్ అంటారు. పారదర్శక మైన శరీరం రెండు రెక్కలతో చూడటానికి దేవకన్యలా ఉంటుంది. ఆర్కిటిక్ సముద్రంలో ఉండే దీని తలపై కొమ్ములాంటి అమరిక ఉండటం విశేషం.

ఇతర లింకులు