గాదెవారిపల్లి

From tewiki
Jump to navigation Jump to search
గాదెవారిపల్లె
—  గ్రామం  —
గాదెవారిపల్లె is located in Andhra Pradesh
గాదెవారిపల్లె
గాదెవారిపల్లె
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E / 16.399201; 79.76738
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కారంపూడి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ దోర్ణాల బ్రహ్మారెడ్డి
పిన్ కోడ్ 522614
ఎస్.టి.డి కోడ్ 08649

గాదెవారిపల్లె, గుంటూరు జిల్లా కారంపూడి మండలం లోని ఒక గ్రామం. పిన్ కోడ్ నం. 522 614., ఎస్.టి.డి కోడ్ = 08649.

గ్రామ భౌగోళికం

  • కారంపూడి నుండి దాచేపల్లికి వెళ్ళె దారిలో చినకొదమగుండ్ల గ్రామం తర్వాత వస్తుంది. సుమారు 4,000 జనాభా ఉంటుంది.
  • ఈ గ్రామ శివార్లలో నాగులేరు ప్రవహించుచున్నది.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రం పరిధిలో పేటసన్నెగండ్ల, చింతపల్లె ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రి 1982కి పూర్వం పల్నాట ప్రధాన ఆసుపత్రి (మదర్ పి.హెచ్.సి) గా సేవలందించింది. అప్పట్లో 5 ఎకరాల సువిశాలమైన స్థలంలో, 6 పడకలతో, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, ప్రజలకు అందుబాటులో ఉండేటందుకు 9 క్వార్టర్లు, శస్త్ర చికిత్స గది, రక్తపరీక్షల కేంద్రాన్నీ నిర్మించారు. కాలాంతరంలో రూపురేఖలు కోల్పోయిన ఆసుపత్రిలో నూతనభవనం నిర్మించారు. ఆ తరువాత ఈ ఆసుపత్రి ప్రాభవం కోల్పోయింది. [4]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ దోర్ణాల బ్రహ్మారెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు, మొదటిసారి ఏర్పడిన కారంపూడి మండల సర్పంచిల సంఘానికి కార్యదర్శిగా ఎన్నికైనారు. [1] & [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

  1. శ్రీ రామాలయం.
  2. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015, మార్చి-18వ తేదీ నుండి 22వ తేదీ ఆదివారం వరకు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. [3]