"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గాయత్రి జలపాతాలు
గాయత్రి జలపాతం | |
---|---|
దస్త్రం:Gayatri Water.jpg | |
ప్రదేశం | తెలంగాణలో ఉనికి |
అక్షాంశరేఖాంశాలు | 19°1′N 78°35′E / 19.017°N 78.583°ECoordinates: 19°1′N 78°35′E / 19.017°N 78.583°E |
రకం | జలపాతం |
మొత్తం ఎత్తు | 363 మీటర్లు |
గాయత్రి జలపాతాలు నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న అనేక జలపాతాల్లో ఒక జలపాతం. ఈ గాయత్రి జలపాతాలు ఆదిలాబాద్ జిల్లా లోని నేరడిగొండ మండలంలో ఉన్నాయి. సుమారు 70 మీటర్ల ఎత్తునున్న రాతికొండ నుంచి కిందకు జాలువారుతున్న ఈ జలపాత అందాలు చూసినవారిని మైమరపిస్తున్నాయి.[1]
నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య గుండి అనే వాగు ప్రవహిస్తుంది. మండలంలోని తర్నం బీ గ్రామ శివారు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ప్రకృతి సిద్ధంగా వెలిసింది. ఎంతో సహజసిద్ధంగా ఏర్పడిన వాగులు, కొండకోనల్లో నుంచి బజార్ హత్పూర్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల అటవీ ప్రాంతాల గుట్టలపై నుంచి ప్రవహస్తున్న నీరు గ్రాయత్రిగా రాతి శిలలపై నుంచి పారుతోంది.
ఈ జలపాతం తెలంగాణ లోనే అతి ఎత్తైనా జలపాతం. దీని ఎత్తు 363 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎత్తునుండి జాలువారే జలదారాల చప్పుడు సంగీతాన్ని మరిపించే విధంగా ఉంటుంది. జలపాత నీటి బిందువులు శీతాకాలంలో హిమచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ లో పడే మంచుబిందువులను తలపిస్తుంటాయి.
ప్రీ ప్రపంచ కప్ వాటర్ రాఫెల్లింగ్ పోటీలు
తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వాటర్ రాపెల్లింగ్ పోటీలను నిర్వహిస్తుంటారు. 2011 నుంచి దేశవ్యాప్తంగా ఈ పోటీలు సాగుతున్నాయి. గతంలో కుంటాల జలపాతం వద్ద రాఫ్టింగ్, బెలూనింగ్, క్యాపింగ్ టెంబ్స్ పోటీలు ఏర్పాటు చేశారు. అయితే కుంటాల జలపాతం చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. దీని ఎత్తు కేవలం 135 అడుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో సాహసికుల కన్ను ఎత్తైన గాయత్రి జలపాతం పైన పడింది. ఇది ఎత్తైన జలపాతం కావడంతో ప్రీ ప్రపంచ కప్ వాటర్ రాఫెల్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 12 కేటగిరీల్లో ఈ పోటీలు కొనసాగుతాయి. తాళ్ల సాయంతో జలపాతం పైకి ఎక్కడం, అదే విధంగా అపసవ్య దిశలో దిగడం, కళ్లకు గంతలు కట్టుకుని తాళ్ల సాయంతో ఎక్కడం ఇలా అన్ని రకాలుగా పోటీలు నిర్వహించారు.
దాదాపు మూడు వందల మంది జాతీయ, అంతర్జాతీయ ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో 12 నుంచి 16 సంవత్సరాల వరకు జూనియర్ బాలబాలికలు, 17 నుంచి 50 సంవత్సరాల వరకు సీనియర్ పురుషులు, మహిళల బృందాలు, 50 సంవత్సరాలు దాటిన వారితో వెటరన్ బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 12 మంది ఉండి, మొత్తం 25 బృందాలు పోటీల్లో పాల్గొన్నాయి. సెప్టెంబర్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి.[2]
ఎలా చేరుకోవాలి
గాయత్రి జలపాతానికి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలో ఈ జలపాతం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్, అక్కడి నుంచి నేరేడిగొండకు చేరుకొని అక్కడి నుంచి తర్నం గ్రామానికి చేరుకోవాలి. కాలి నడకన దాదాపు ఐదు కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. వెంట గైడ్ను తీసుకువెళ్తే తప్ప ఈ జలపాతం చేరుకోలేం. జలపాతం కింది ప్రాంతానికి వెళ్లాలంటే రాళ్లతో కూడిన ప్రమాదకరమైన ఒర్రె నుంచి వెళ్లాలి.[3]
మూలాలు
- ↑ కనువిందు చేస్తున్న గాయత్రి జలపాతం
- ↑ మరాఠి. "అందాల నెలవు.. సాహసాల కొలువు". marathi.annnews.in. Retrieved 17 October 2016.
- ↑ కనువిందు చేస్తున్న గాయత్రి జలపాతం