"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గారె

From tewiki
Jump to navigation Jump to search
నోరూరించే మసాలా వడ

గారెలు లేదా వడలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి[1]. దీనిని కొబ్బరి పచ్చడితో గాని, వేరుశనగ పప్పు పచ్చడితో గాని, శనగ పప్పు పచ్చడితో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.

గారెలు అంటే..

గారెలు అంటే..మనకు ఎక్కువగా గుర్తొచ్చేది మినపగారెలే.

గారెలు - తయారు చేయడం చాలా సులభం

నిజం చెప్పాలంటే గారెలు తయారు చెయ్యడం చాలా సులభం. అసలు వంటేమీ రాని వారు కూడా చాలా చక్కగా, రుచికరంగా గారెలు తయారు చేసుకోవచ్చు. మీ స్నేహితులకీ, బంధుమిత్రులకీ రుచి చూపించి ‘ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి..’ అనిపించవచ్చు.h

రకాలు

ఆవడలు

చిట్కాలు

గారెలు మరింత రుచిగా ఉండుటకు నూతనంగా కొన్ని మార్పులు చేస్తున్నారు.

మూలాలు