"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గుండుపాలెం

From tewiki
Jump to navigation Jump to search
గుండుపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి నిమ్మగడ్డ శిరీష
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషులు 940
 - స్త్రీలు 917
 - గృహాల సంఖ్య 626
పిన్ కోడ్ 521003
ఎస్.టి.డి కోడ్ 08672

గుండుపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 003., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

మచిలీపట్నం, పెడన.

సమీప మండలాలు

బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మచిలీపట్నం, కొత్త మాజేరు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. హర్ష జూనియర్ కాలేజి, అరిశేపల్లి.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

రక్షిత మంచినీటి పథకం

2010లో ఈ గ్రామానికి 35 లక్షల రూపాయల వ్యయంతో ఒక రక్షిత మంచినీటి పథకం నిర్మాణం ప్రారంభించి పూర్తిచేసారు. పథకంలో భాగంగా సంపు, పంప్ హౌస్, ఫిల్టర్ బెడ్ల నిర్మాణం, గ్రామ కూడళ్ళలో కుళాయిల ఏర్పాటు, పూర్తి అయినది. అయినా ఇంతవరకు ఈ పథకం అమలులోనికి రాలేదు. గ్రామస్థుల త్రాగునీటి వెతలు తీరలేదు. [3]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి నిమ్మగడ్డ శిరీష, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలలో భాగంగా, 2017, మే-22వతేదీ సోమవారంనాడు, స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. వేదపండితులు హనుమన్నామస్తోత్రపారాయణం చేసి, స్వామివారికి పలువురు భక్తుల పేరిట అభిషేకాలు నిర్వహించారు. కేశవ భక్తబృందం ఆధ్వర్యంలో పెద్దయెత్తున అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు ఐదు సంవత్సరాల నుండి ఈ ఆలయంలో ఈ ఉత్సవాలను పెద్దయెత్తున నిర్వహించుచున్న నేపథ్యంలోn చుట్టుప్రక్కల గ్రామాలయిన చిన్నాపురం, వెంకటాపురం, రుద్రవరం, సింహాచలం, నెలకుర్రు గ్రామాలనుండి భక్తులు విశేషసంఖ్యలో విచ్చేసి, అన్నసమారాధనను జయప్రదం చేసారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామానికి చెందిన తూమాటి మేఘనాధ్, పదవ తరగతి వరకు, గుండుపాలెం గ్రామంలోనే విద్యనభ్యసించి, తన తాతగారి గ్రామమయిన పెదముత్తేవిలో ఇంటరు చదువుచూ, జాతీయస్థాయి పోటీలలో ఎన్నో పతకాలు సాధించిన తన సోదరి స్ఫూర్తితో, వాలీబాల్ క్రీడపై మక్కువతో ఆ క్రీడలో శిక్షణపొంది, కళాశాల స్థాయి నుండియే, పలు పోటీలలో పాల్గొని, ఎన్నో పతకాలు స్వంతం చేసుకున్నాడు. విజయవాడ లయోలా కళాశాలలో డిగ్రీ చదివిన తరువాత, 2010-12 లో విశాఖపట్నంలోని సాయి స్పోర్ట్స్ పాఠశాలలో గూడా శిక్షణ తీసికొన్నాడు. అప్పటినుండి ఎన్నో రాష్ట్ర, జతీయస్థాయి పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి పలు పతకాలు కైవసం చేసుకోవడమేగాక, క్రీడా కోటలో, గత సంవత్సరం రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో సహాయకుడిగా ఉద్యోగం సంపాదించి, క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడు. [2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,857 - పురుషుల సంఖ్య 940 - స్త్రీల సంఖ్య 917 - గృహాల సంఖ్య 626;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2102.[2] ఇందులోపురుషుల సంఖ్య 1034, స్త్రీల సంఖ్య 1068, గ్రామంలో నివాసగృహాలు 577 ఉన్నాయి.

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Gundupalem". Retrieved 28 June 2016. External link in |title= (help)[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులు

[2] ఈనాడు అమరావతి; 2015, మే-22; 38వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, జూలై-15; 4వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, ఆగస్టు-15; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2017, మే-23; 4వపేజీ.