గుండెదడ

From tewiki
Jump to navigation Jump to search

మామూలుగా గుండె యొక్క స్తందనలను మనం గుర్తించలేము. గుండెదడ (Palpitation) అనగా తన గుండె తనలో వేగముగా కొట్టుకొంటున్నట్లు తోచుట. సాధారణంగా ఆందోళనగా ఉన్నప్పుడు, వ్యాయామం తరువాత కొందరిలో ఇది కొంతసేపు ఉంటుంది. గుండెదడ చాలాకాలంగా నిరంతరంగా ఉండేటట్లైతే వ్యాధుల గురించి ఆలోచించాలి.

కారణాలు

  • మానసిన ఒత్తిడి :
  • రక్తహీనత : దీనివలన శరీర కణజాలాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గి దానిమూలంగా ఆయాసం, గుండెదడ వస్తాయి. ముఖ్యంగా శ్రమ చేసినప్పుడు వీటిలో గుండెనొప్పి కూడా రావచ్చును.
  • విటమిన్ లోపాలు : విటమిన్ బి లోపం వల్ల వచ్చే బెరిబెరి అనే వ్యాధిలో గుండెదడ రావచ్చు.
  • థైరాయిడ్ గ్రంధి వ్యాధులు : థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పనిచేసే హైపర్ థైరాయిడిజం లో అనూహ్యమైన రీతిలో బరువు తగ్గి, విరేచనాలు, ఆకలి ఎక్కువగా వేయడం, గుండెదడ కనిపిస్తాయి.
  • మెనోపాజ్ సమస్యలు : కొందరు స్త్రీలలో బహిష్టులాగిపోయే దశలో హార్మోన్ ల విడుదలలో లోపం ఏర్పడడం వలన రక్తప్రసరణ గతి తప్పి గుండెదడ అనుభవమవుతుంది.
  • మందుల దుష్ఫలితాలు : ఉబ్బసం కోసం వాడే కొన్ని మందులు దీనికి కారణం కావచ్చు.
  • గుండె జబ్బులు : గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమవడం, గుండె కండరాలు బలహీనమవడం వంటి స్థితులలో గుండెదడ రావచ్చును.

నడక దివ్యౌషధం

రోజూ కనీసం అరగంటపాటు నడవటం గుండెకు దివ్యౌషధం.నడక క్యాలరీలను కరిగిస్తుంది.ఇది ఖర్చులేని వ్యాయామం. రక్తనాళాలు పూడిపోయే ముప్పును నివారిస్తుంది. రక్తంలో చక్కెర పాళ్లను పెంచుతుంది. ఎముకలు పెలుసు బారటాన్ని అడ్డుకుంటుంది. మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.