"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గులాబీ నూనె
![]() | ఈ వ్యాసం లేదా విభాగం పెద్ద విస్తరణ / పునర్వ్యవస్థీకరణ మధ్యలో ఉంది. మీరూ దీన్లో దిద్దుబాట్లు చేసి, దీని నిర్మాణంలో భాగం పంచుకోండి. ఈ వ్యాసంలో లేదా విభాగంలో చాల రోజులుగా దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తొలగించండి. ఈ article లో చివరిసారిగా Script error: No such module "Time ago". మార్పుచేర్పులు చేసారు. చేసినవారు: [[User:imported>Palagiri|imported>Palagiri]] ([[User talk:imported>Palagiri|talk]] | [[Special:Contributions/imported>Palagiri|contribs]]). (పర్జ్ చెయ్యండి) |
గులాబీ | |
---|---|
Rosa bracteata | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | రోసా |
జాతులు | |
Between 100 and 150, see list |
గులాబీ నూనె ఒక ఆవశ్యక నూనె.గులాబీ నూనె సుగంధ భరితమైన సువాసనను కల్గి వుండును.అందుచే గులాబీ నూనెను సుగంధ తైలం అనికూడా అంటారు.గులాబీ నూనెను గులాబీ అత్తరు అనికూడా అంటారు.అత్తరు అనేది అరబ్భీ పదం. అత్తరు అనగా అరబ్బిలో సుగంధ తైలం. గులాబీ నూనెను ఆంగ్లంలో రోజ్ ఆయిల్ అంటారు. గులాబీ నూనెను కేవలం సుగంధద్రవ్యంగా/పెర్ఫ్యూమ్ గా మాత్రమే కాకూడా వైద్యములో కూడా ఉపయోగిస్తారు.గులాబీ తైలాన్ని గులాబీ పూల రెక్కల నుండి ఉత్పత్తి చేస్తారు.గులాబీ పూలల్లో పలురకాలు వున్నవి.గులాబీ తైలాన్ని ఎక్కువగా డమాస్క్ రోజ్ నుండి ఇంకా మరికొన్ని రకాల నుండి సేకరిస్తారు.
Contents
పేరు వేనుక నేపధ్యం
గులాబీకి ఆంగ్ల పదమైన రోజ్(rose)అనే మాట గ్రీకు లోని రోడేన్ నుండి తీసుకోబడినది.రోడెన్ అనగా ఎరుపు\పింకు అని ఆర్థం. పురాతన గులాబీ కెంపు వర్ణంలో వుండటం వలన ఆపేరు వచ్చింది. అనిసెన్నా అనే పెరిసియన్ భూతిక శాస్త్రవేత్త మొదట గులాబీ నుండి నూనెను స్వేదనక్రియ వలన ఉత్పత్తి చేసినట్లు తెలుస్తున్నది.1612లోనే పెరిసియా లోని శిరాజ్ లో గులాబీ డిస్టీలరు వున్నట్లు తెలుస్తున్నది.పెళ్ళి వేడుకల్లో సంతోష సూచకంగా గులాబీ పూలరెక్కలను మండపంలో చల్లేవారు.గులాబీని ప్రేమకి అప్యాయతకు గుర్తుగా,స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.[1]
మొదటగా భారత దేశంలో గులాబీ నూనె తయారీ
గులబీ అత్తరు లేదా గులాబీ తయారి గురించి ఒక కథ ప్రచారంలో వున్నది.సుల్తాను షాజహాన్ పెళ్లి సమయంలో పూలతోట చుట్తు వున్న కందకంలోని నీళ్లలో గులాబీ పూలరెక్కులను చల్లరట సువాసనకై.ఎండవేడీకి నీళ్ళూ వేడెక్కి, ఆవేడికి పూలలోని నూనె పూలరెక్కలనుండి బయటికి వచ్చి నీళ్ళమీద వెదజల్లిందట.తేలియాడి మరింత పరిమళం పరిసరాలలో వ్యాపించింది.నీళ్ళలో విహారానికి వెళ్ళిన నవదంపతులు అదు గమనించి,ఆనూనెను పరిచారకులతో ఆనూనెను సేకరింప చేసారత.ఆవిధంగా గులాబీ అత్తరు తయారు చెయ్యడం బారతదేశంలో మొదలైనది.[2]
గులాబీ మొక్క
గులాబీ రోజేసియే కుటుంబానికి చెందిన పొద వంటి మొక్క ముళ్ళు కల్గ్గి వుండును.ఆకుల అంచులు చీలి ముదురు ఆకుపచ్చగా వుండును.గులాబీలో దాదాపు 250 రకాలు వున్నవి.గులాబీ బహువార్షిక మొక్క.దాదాపు 10-30 ఏళ్ళు పూల దిగుబడి ఇచ్చును.మొదటి సంవత్సరం పూష్పించదు.రెండవ సంవత్సరం కొద్దిగా పూలు పూచును.మూడో సంవత్సరం నుండి పూల దిగుబడి మొదలగును.అర ఎకర నేలలో 5 వేలమొక్కలను పెంచవచ్చు. సీజనుకు పూల దిగుబడి రెండు వేల పౌండ్ల పూలు. ఒక పౌండు నూనెకు 10వేల పౌండ్ల పూలు అవసరం. గులాబీ మొక్క పూర్తి వివరాలకై ప్రధాన వ్యాసంగులాబిచూడండి
సాగు
డమాస్కస్ రోజ్ ను సిరియా, బల్గేరియా, టర్కీ, రష్యా, పాకిస్తాన్, భారతదేశం, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ మరియు చైనాలలో అధికంగా సాగు చేస్తారు. క్యాబేజీ రోజ్ ను మోరోకో,ఫ్రాన్స్,మరియు ఈజిప్టు లలో సాగు చేస్తారు.[2]
గులాబీ తైలం ఉత్పాదక దేశాలు
ఒకప్పుడు గులాబీ నూనెను ఉత్పత్తి చెయ్యడం లో ఇండియా,పర్షియా,సిరియా,మరియు ఒట్తోమన్ సామ్రాజ్యం పేరేనిక గన్నవి. [[బల్గేరియా] లోని కజన్లక్ నగరానికి సమీపంలోని రోజ్ వ్యాలీ ప్రపంచంలోని అత్తరు ఉత్త్పతి స్థావరాలలో పేరెన్నిక కన్నది.ఇండియాలో మధ్య ప్రదేశ్ లోని కనౌజ్ అత్తరుల తయారీకి ప్రసిద్ది .
గులాబీ తైలం
గులాబీ నూనె రంగు లేకుండా లేదా లేత పసుపు రంగులో వుండును. కొన్నిసార్లు ఆకుపచ్చని చాయను కూడా కల్గి వుండును.ఆహాల్లదకరమైన సువాసన కల్గి వుండును. గులాబీ తైలం చిక్కని ద్రవం.180 పౌండ్ల గులాబీలను స్వేదన క్రియ చేస్తే(60,000 పూలు) ఒక ఔన్సు(29.57మీ.లీ)గులాబీ తైలం/అత్తరు ఉత్పత్తి అగును.అనగా ఒక లీటరు అత్తరుకు 40 టన్నుల పూలు కావాలి.[1]. గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనె కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.సాధారణ ఉష్ణోగ్రత వద్ద తెల్లని స్పటికాలు వున్న ద్రవంగా మారును.కొద్దిగా వేడి చేసిన స్పటికాలు మాయమగును.ఇడిచిక్కని ద్రవం.ఒక చుక్క నూనె రావటానికి ముప్పై పూలు లేదా రెండువేల పూరెక్కలు కావాలి.21 0C కన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద గులాబీ నూనెలో తెల్లని స్పటికరణ జరుగును.
నూనె భౌతిక గుణాలు
వరుస సంఖ్య | గుణం | విలువల మితి |
1 | రంగు | లేత పసుపు |
2 | ఘనిభవించు పాయింట్ | 18=23.50C |
3 | విశిష్ట గురుత్వం 20/150C | 0.856-0.870 |
4 | వక్రీభవన సూచిక | 1.452-1.48 |
5 | దృశ్య భ్రమణం | మైనస్ 1నుండి మైనస్ 40 వరకు |
నూనెలోని రసాయనపదార్థాలు
గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనె కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి. గులాబీ నూనెలో దాదాపు 300 రకాల రసాయన సమ్మెళనాలు వున్నవి ఇవి ఆల్కహాలులు,పినోల్లు,అల్డిహైడులు,తదితరాలు.గులాబీ నూనెలో వుండు ప్రధాన రసాయన సమ్మేళనాలు సిట్రోనెల్లోల్, జెరానియోల్, నేరోల్, లినలూల్, పినైల్ ఇథైల్ ఆల్కహాల్, ఫార్నేసోల్,స్టేయారోప్టెన్, ఆల్ఫా పినెన్,బీటా పినేన్,ఆల్ఫా- టేర్పినోన్, లిమోనేన్, p-సైమెన్, కాంపెన్,బీటా-కారియో పైలేన్,నేరాల్,సెట్రోనేలైల్ అసిటేట్,యూజనోల్,మిథైల్ యూజనోల్,రోజ్ ఆక్సైడ్,ఆల్ఫా-డమస్ సేనోన్,బీటా- డమస్ సేనోన్,బెంజాల్డిహైడ్,బైంజైల్ ఆల్కహాల్,రోడినైల్ అసిటెట్ మరియు పినైల్ ఇథైల్ ఫార్మాట్ వున్నవి.[2]
డమస్కస్ గులాబీ నూనె లో సిట్రోనెల్లోల్, పినైల్ ఇథనోల్, జెరానియోల్. నేరోల్. ఫోర్నెసోల్, స్టేర్పోనేన్ ఎక్కువ ప్రమాణంలో వుండగా,స్వల్పం ప్రమాణంలో నోనలోల్,లినలూల్,నోననల్,పినైల్ ఆసిటాల్డిహైడ్, సిట్రాల్, కార్వోన్, సిట్రోనెలైల్ అసిటేట్, 2-పినైల్ మిథైల్ ఆసిటెట్, మైథైల్ యూజనోల్, యూజనోల్, మరియు రోజ్ ఆక్సైడ్లులు వున్నవి.[1] గులాబీ నూనె ఉత్పత్తికై ప్రధానంగా డమాస్కస్ రోజ్(damascena) మరియు క్యాబేజీ రోజ్(centifolia)పూలను ఉపయోగిస్తారు. గులాబీ నూనెకు ప్రత్యేకమైన వాసనకు కారణం నూనెలోవున్న బెటా డమస్ సేనోన్,బెటా డమస్ కోన్,బెటా అయినోన్,మరియు రోజ్ ఆక్సైడ్,ఇవన్నీ నూనెలో 1% కన్నా తక్కువగా వున్న నూనె వాసనను ప్రభావితంచేసేవిఇవే.
- డమస్కస్ గులాబీ నూనెలోని వున్న కొన్ని ముఖ్య రసాయనాల శాతం పట్టిక(అంతర్జాతీయ ప్రామాణాల ప్రకారం(ISO9842-2003)[3]
వరుస సంఖ్య | సమ్మేళనం | శాతం |
1 | సిట్రోనెల్లోల్ | 20-34 |
2 | నేరోల్ | 5-15 |
3 | జెరానియోల్ | 15-22 |
4 | పారఫీన్స్C17 | 1.0-2.5 |
5 | పారఫీన్స్C19 | 8.0-15 |
6 | పారఫీన్స్C21 | 3.0-5.5 |
నూనె సంగ్రహణం
గులాబీలనుండి నూనెను ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.పూలను ఉదయం 8 గంటలలోపు సేకరిస్తారు.పూలనుండి అత్తరు దిగుమతి శాతం 0.02 -0.05 %. డిస్టిలేసను చేయుటకు ఇచ్చు నీటి ఆవిరి/స్టీము ఉష్ణోగ్రత మరింత ఎక్కువ లేకుండ జాగ్రత్త వహించాలి.లేనిచో గులాబీ నూనెలోని సువాసనపాడై ఫొయి నాసికరం నూనె ఏర్పడును.[1]. గులాబి తైలాన్ని కేవలం స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారనే కాకుండా సాల్వెంట్ ఎజ్సుటాక్సను/ద్రావణి సంగ్రహణ పద్ధతిలో హెక్సేను లేదా పెంటెన్ అను హైడ్రోకార్బను ద్రవాన్ని ఉపయోగించి సంగ్రహణ చెస్తారు. మరో సంగ్రహణ విధానం లిక్విడ్ కార్బను ఏక్సుట్రాక్సను మరియు సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ సంగ్రహణ విధానం.ద్రవ కార్బన్ డయాక్సైడ్ మరియు సూపర్క్రిటిక కార్బన్ డయాక్సైడ్ విధానాలు కేవలం ప్రయోగశాల పరిసోధనల స్థాయిలో వున్నవి.వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు. గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనెల కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.
ఆవిరి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె సంగ్రహణం
సాంప్రదాయ పద్ధతిలో సాధారణంగా రాగి పాత్రలో గులాబీ పూలను,నీటిని తీసుకుని వేడీ చేస్తారు.ఈ స్వేదన క్రియ 50-105 నిమిషాలు వుండవచ్చును.ఆవిరిగా మారిన పూలలోని రసాయనాలు మరియు నీటి ఆవిరి ఒక గొట్టం ద్వారా కండెన్సరుకు వెళ్ళి చల్లబడి, ద్రవీకరణ చెందును.ద్రవీకరణ చెందిన నీటి,నూనె మిశ్రమాన్ని ఒక సెటిలింగు టాంకులో /పాత్ర లో సేకరిస్తారు.నూనె నీటి పైభాగాన ప్రత్యేక మట్టంగా ఏర్పడును. సెటిలింగు పాత్రలో జమ అయిన నీట్లో, నీటిలో కరుగు స్వాభావం వున్న గులాబీ పూల రసాయనాలు కరగి వుండును.ఈ నీరు కొన్ని గులాబీ వాసన కారక రసాయనాలను(పెనే ఇథైల్ ఆల్కహాల్ వంటివి) కలిగి వుండును.అందుచే ఈ నీటిని తిరిగి స్వేదనక్రియచేసి ఆ రసాయన సమ్మేళనాలను వేరు చేసి తిరిగి నూనెలో కలిపేదరు, లేదా నీటిని రోజ్ వాటరు/పన్నీరు గా అమ్మకం చేస్తారు.
సాల్వెంట్ ఎక్సుట్రాక్సను విధానం
సాల్వెంట్ ఎక్సుట్రాక్సను విధానంలో కూడా గులాబీ పూల నుండి అత్తరును సంగ్రహిస్తారు.ఈ ప్రక్రియలో హెక్సేను అను హైడ్రోకార్బను ను ద్రావణిగా ఉపయోగిస్తారు.ఈవిధానంలో నూనెలో సుగంధరసాయన సమ్మేళనాలతో పాటు మైనం మరియు రంగు కారకాలు కూడా సంగ్రహింపబడును. ఈసంగ్రహణ సారాన్ని కాంక్రీట్ అంటారు.వాక్యూమ్ లో (పీడన రహిత స్థితి )లో సాల్వెంట్+కాంక్రీట్ మిశ్రమాన్ని డిస్టిలుచేసి సాల్వెంట్ను వేరు చేస్తారు,ఇప్పుడు కాంక్రీట్ అనబడే చిక్కని పదార్థాన్ని ఆల్కహాల్ లో 40-50°Cవద్ద కరగిస్తారు.ఇప్పుడు ఆల్కహాల్ మిశ్రమాన్ని -5°C వరకు శీతలీకరణ చేస్తారు.తక్కువ ఉష్ణోగ్రత వద్ద మైనపు పదార్హాలు అవక్షేపంగా ఆల్కహాల్ అడుగు భాగంలో చేరును,పైనున్న ఆల్కహల్ ను జాగ్రత్తగా ఫిల్టరు చేసి సేకరించిన అల్కహాల్_నూనె పదార్థాన్ని,తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి మిశ్రమం నుంది ఆల్కహాల్ ను వేరుచేస్తారు. అల్కహాల్ తొలగించిన పదార్థాన్నిఅబ్సొల్యుట్ అంటారు.
నూనె సంగ్రహణకై పూలను తాజాగా సూర్యోదయం కంటే ముందు కోసి.ఆలస్యంచేయ్యకుండా నూనె సంగ్రహణ చేస్తారు.
గులాబీ నూనె వాడకం ముందు జాగ్రత్తలు
గులాబీ తైలం విషగుణాలులేని,ఇరిటేసన్ కల్గించని సురక్షితమైన సుగంధ తైలం.
గులాబీ నూనె- వైద్యపరమైన గుణాలు
- గులాబీ నూనె వ్యాకులత నివారిణిగా,వాపును తగ్గించే మందుగా,యాంటిసెప్టిక్ మందుగా,శూలరోగమును పోగొట్టే మందుగా, వైరస్ నాశనిగా,వీర్యవృద్ధికరమైనమందుగా,కండరాల సంకోచశీల మందుగా,సూక్ష్మక్రిమి?బాక్టిరియా నాశనిగా,రుతుస్రావాన్ని క్రమబద్దికరించు ఔషదంగా పని చేయును.[1]
- గులాబీ అత్తరును సుగంధ తైలంగా నేరుగా ఉపయోగిస్తారు
- ఇతర సుగంధ నూనెల్లో మిశ్రమం చేస్తారు.
బయటి వీడియోల లింకులు
ఇవికూడా చూడండి
ములాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Damask Rose essential oil information". essentialoils.co.za. https://web.archive.org/web/20180127060638/https://essentialoils.co.za/essential-oils/rose.htm. Retrieved 21-08-2018.
- ↑ 2.0 2.1 2.2 "essential oil of rose". cdn1.hubspot.com. https://web.archive.org/web/20180821082453/https://cdn1.hubspot.com/hub/193476/rose_valentine_ebook_1-31-13v2.pdf?_hsenc=p2ANqtz--k718U_tSVGyy_NdVsqMbx0g8hi5cHfqAE5bnVSp10FByThS5bIxWNV9V9p2pI_0OPqpvoorXTi3RoIJptBeswECfdSw&_hsmi=7425197. Retrieved 21-08-2018.
- ↑ "Rosa damascena essential oils: a brief review about chemical composition and biological properties". tpr.iau-shahrood.ac.ir. https://web.archive.org/web/20180421073911/http://tpr.iau-shahrood.ac.ir/article_532669_d72d2686983cb5dbbb7e721834197c7c.pdf. Retrieved 22-08-2018.