"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గువ్వల చెన్నడు

From tewiki
Jump to navigation Jump to search

క్రీ.శ 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు " గువ్వల చెన్నా" అనే మకుటంతో గువ్వలచెన్న శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక నీతిని , రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించినాడు. వేమన వలె అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు సాంఘిక దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు. "ఇల వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా" అంటాడు. తెలుగు పద్యం గొప్పదనాన్ని ఇలా వివరిస్తాడు.

గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!

కాలము

గువ్వల చెన్న శతక కర్తృత్వం గురించి, కవికాలాదుల గురించి చరిత్రలో నిర్థిష్టమైన అభిప్రాయం లేదు. శతక కవుల చరిత్రము రాసిన వంగూరి సుబ్బారావు అభిప్రాయం ప్రకారం ఈ శతకం 1600 ప్రాంతమువాడైన పట్టాభిరామ కవి కృతమని నిర్ణయించినాడు. దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. శతక నామావళి ననుసరించి గువ్వల చెన్నడు ఈ శతకాన్ని రాసినట్లు ఊహించవచ్చును. శతకమునందు ఉదహరించబడిన పాశ్చాత్య సంస్కృతి తెలుగువారిపై దాని ప్రభావం పరిశీలించిన పిదప ఈ శతకం బహుశా 18వ శతాబ్దినాటిదని భావించవచ్చు.[1]

మూలాలు

  1. "గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు - అచ్చంగా తెలుగు". www.acchamgatelugu.com. Retrieved 2020-08-25.


Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).