"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గొంగిడి సునీత

From tewiki
Jump to navigation Jump to search
గొంగిడి సునీత
గొంగిడి సునీత

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014, 2018
నియోజకవర్గము ఆలేరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1969-08-16) 16 ఆగష్టు 1969 (వయస్సు 51)
ఆలేరు, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి గొంగిడి మహేందర్ రెడ్డి

గొంగిడి సునీత తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. ఆలేరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ప్రభుత్వ విప్ గా ఉంది.[1]

జననం - విద్యాభ్యాసం

సునీత 1969, ఆగస్టు 16న నరసింహాయ్య యాదవ్, సరళ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలో జన్మించింది.[2] బి.కాం. వరకి చదువుకుంది.

రాజకీయ ప్రస్థానం

2001, జూన్ 4 న రాజకీయాలలోకి ప్రవేశించి, యాదగిరిగుట్ట ఎం.పి.టి.సి.గా ఎన్నికైంది. అటుతర్వాత యాదగిరిగుట్ట ఎం.పి.పి.గా పనిచేసింది. 2006 నుండి 2011 వరకు వంగపల్లికి సర్పంచ్ గా పనిచేసింది. 2014 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థైన బూడిద భిక్షమయ్య గౌడ్ పై 34వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.[3] 2018లో అదే నియోజకవర్గం నుండి గెలుపొందింది.[4][5]

నిర్వహించిన పదవులు

 1. 2001 - యాదగిరిగుట్ట ఎం.పి.టి.సి.
 2. 2001 - ఎం.పి.పి.
 3. 2002 - తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా కార్యదర్శి
 4. 2004 - రాష్ట్ర కార్యదర్శి
 5. 2006 నుండి 2011 - వంగపల్లికి సర్పంచ్
 6. 2009 నుండి 2014 - పొలిట్ బ్యూరో సభ్యురాలు
 7. 2014 - ఆలేరు ఎమ్మెల్యే
 8. 2018 - ఆలేరు ఎమ్మెల్యే[6][7]

వివాహం

సునీత 1990 మే 25న గొంగిడి మహేందర్ రెడ్డిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (అంజలి, హర్షిత).

మూలాలు

 1. "DC discusses if women in state Cabinet can ensure social justice". దక్కన్ క్రానికల్. 21 December 2014. Retrieved 19 April 2017.
 2. మై నేత ఇన్ఫో. "GONGIDI SUNITHA". myneta.info. Retrieved 19 April 2017.
 3. "Alair Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Alair, Telangana". Elections.in. Retrieved 19 April 2017.
 4. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
 5. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (12 December 2018). "అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
 6. 10టివీ (17 January 2019). "దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
 7. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 January 2019). "ముందుగా మహిళా ఎమ్మెల్యేలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).