గోపురానిపాలెం

From tewiki
Jump to navigation Jump to search
గోపురానిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 262
 - 252
 - గృహాల సంఖ్య 192
పిన్ కోడ్ 521250
ఎస్.టి.డి కోడ్ 08676

గోపువానిపాలెం, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలం

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, తెనాలి, మచిలీపట్నం, పెడన

సమీప మండలాలు

వుయ్యూరు, పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

వుయ్యూరు, కూచిపూడి నుండే రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఐనపూరు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ మెరకనపల్లి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు.వీరు గ్రామంలోని ఏకైక ఎస్.సి.ఓటరు కావడంతో, ఎన్నిక లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరు గ్రామంలోని ఏకైక ఎస్.సి.ఓటరు కావడంతో, ఎన్నిక లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరు 2016, అక్టోబరు-30న పదవిలో ఉండగానే అనారోగ్యంతో కాలధర్మం చెందినారు. [4]&[5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

  1. శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజు రాత్రికి, స్వామివారి కళ్యాణంం కన్నులపండువగా నిర్వహించెదరు [2]
  2. శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2015, ఆగష్టు-23వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటా చల్దినైవేద్యాలను తయారుచేసుకొని, అమ్మవారు ఇంటిముందుకు వచ్చిన సమయంలో అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో వేడి చల్దినైవేద్యాలను పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 608.[3] ఇందులో పురుషుల సంఖ్య 311, స్త్రీల సంఖ్య 297, గ్రామంలో నివాసగృహాలు 174 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 202 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 514 - పురుషుల సంఖ్య 262 - 252 - గృహాల సంఖ్య 192

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Gopavanipalem". Archived from the original on 12 ఏప్రిల్ 2019. Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

వెలుపలి లింకులు

[2] ఈనాడు అమరావతి; 2015, మే-13; 38వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగష్టు-24; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మార్చి-4; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, అక్టోబరు-31; 2వపేజీ.