"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గోలి వర్ష

From tewiki
Jump to navigation Jump to search

చదువుకు సంబంధించి ఇరవై ఏళ్లుగా ఒక్క గైర్‌హాజర్‌ కూడా లేకుండా ఎల్.కె.జి నుండి బి.టెక్ వరకు 100 శాతం హాజరు నమోదు చేసుకున్న విద్యార్థిని గోలి వర్ష. వంద శాతం హాజరు నమోదు చేసుకున్ని రికార్డు సృష్టించిన వర్ష "వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌"లోను, "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌"లోను చోటు దక్కించుకుంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ రికార్డును నమోదు చేసే ముందు స్వయంగా వర్ష చదివిన స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి వర్ష హాజరును తనిఖీ చేశారు. అలాగే వండర్ బుక్ ప్రతినిధులు కూడా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి నిర్ధారించుకున్న తర్వాతే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లో వర్ష పేరును నమోదు చేశారు. వర్ష హాజరు విషయంలోనే కాక ఇతర విషయాలలోను తన ప్రతిభను చాటుకునేది. చక్కగా చిత్రాలు గీయగల వర్ష తన అత్యుత్తమ ప్రతిభతో రాష్ట్ర ప్రభుత్వ "బాలరత్న" అవార్డును అందుకుంది. తైక్వాండోలో రెండు రాష్ట్రస్థాయి పతకాలను గెలుపొందింది. వర్ష "మెక్‌డొనాల్డ్ లిటిల్ మిస్ హైదరాబాద్"గా, టైమ్స్ ఆఫ్ ఇండియా ""స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌"గా కూడా ఎంపికైంది.

మూలాలు

  • ఈనాడు దినపత్రిక - 25-10-2014 - (20 ఏళ్లు... ఒక్క ఆబ్సెంట్ లేదు!)