"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గోల్కొండ వజ్రం

From tewiki
Jump to navigation Jump to search
గ్రేట్ మొగల్ డైమండ్ ప్రతి రూపం

ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలలో గోల్కొండ వజ్రం ఒకటి. గోల్కొండ గనుల్లో బయట పడ్డ ఈ వజ్రం ఒకప్పుడు హైదరాబాదు చివరి నిజాం వద్ద ఉండేది. 2013 ఏప్రిల్ 17న న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ 76 క్యారెట్ల వర్ణరహిత వజ్రం 211 కోట్ల రూపాయల ధర పలికింది.[1] క్లారిటీ, కట్‌, క్యారెట్‌ అనే మూడు అంశాల్లో ఎంతో విశిష్టత ఉన్న ఈ వజ్రానికి ఆర్చ్‌డ్యూక్‌ జోసెఫ్‌ డైమండ్‌ అని పేరు పెట్టారు. ఈ వజ్రానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వజ్రం హైదరాబాద్‌లోని గోల్కొండ కోట సమీప గనుల్లో బయట పడింది. 1993లో దీనిని వేలం వేసినప్పుడు దాదాపు 57 కోట్ల రూపాయలు పలికింది. ఆర్క్‌డ్యూక్‌ డైమండ్‌తో పాటు ప్రసిద్ధి చెందిన డ్రెస్‌డెన్‌ గ్రీన్‌ డైమండ్‌, హోప్‌ డైమండ్‌, గోల్కొండ గనుల్లో లభించినవే.

చరిత్ర

భారతదేశంలోని రెండు ప్రధాన సముద్ర ఓడరేవులైన సూరత్, మచిలీపట్నం మధ్య గోల్కొండ సుల్తానేట్ ఉంది.ఈ పట్టణం వజ్రాలకు వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయబడింది.కుతుబ్ షాహి పాలకుల ఆధ్వర్యంలో, గోల్కొండ కోట సమీపంలో వజ్రాల అభివృద్ధికి చేయబడింది. వజ్రాల వ్యాపారంలో పాల్గొన్న శ్రామిక శక్తి ఆకాలంలో సుమారు 100,000 మంది వరకు ఉండేవారు. మధ్యయుగ వజ్రాల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులను ఆకర్షించింది.ఇప్పటి పాలకలు వారికి సౌకర్యాలను ఏర్పాటు చేసారు.వ్యాపారులు ఉండటానికి,వ్యాపారం చేయడానికి, ముఖ్యంగా యూరప్,మధ్య ఆసియా నుండి ప్రయాణించేవారికి తగిన భద్రత కల్పించారు.2016 నవంబర్ 5 ది హిందూ దిన పత్రిక, (మను ఎస్. పిళ్ళై ) ప్రకారం , ప్రఖ్యాత ఫ్రెంచ్ యాత్రికుడు, ఆభరణాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్, గోల్కొండలోని ఒక చెరశాలలో ఉంచిన గ్రేట్ టేబుల్ డైమండ్ అనే ఫ్లాట్ డైమండ్‌ను చూసినట్లు పేర్కొన్నారు.[2] 'గోల్కొండ డైమండ్స్'లో ప్రెంచ్ దేశానికి చెందిన జీన్ డి థెవెనోట్, ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఉన్నారు.[3]

గోల్కొండ వజ్రాలు భారతదేశానికి చెందిన వజ్రాలు. ఇవి ఆ కాలంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో తవ్వినవి.కుతుబ్ షాహి రాజవంశం (గోల్కొండ సుల్తానులు) పాలనలో (16వ శతాబ్దం -17 వ శతాబ్దం) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది పరివాహక తీర ప్రాంతాన ఉన్న బెల్లంకొండ మండలానికి చెందిన కోళ్లూరు ప్రాంతంలో గనుల నుండి సేకరించి, కత్తిరించటానికి హైదరాబాదు నగరానికి రవాణా చేయబడ్డాయి.వాటికి మెరుగు పెట్టడం, దాని విలువ మదింపు కట్టడం,అమ్మకం లాంటి లావాదేవీలకు హైదరాబాదులోని గోల్కొండ ఒక వజ్రాల వాణిజ్య కేంద్రంగా స్థిరపడింది.19 వ శతాబ్దం చివరి వరకు, ప్రపంచంలోని అతిపెద్ద అత్యుత్తమమైన వజ్రాల వాణిజ్యకెేంద్రాలలో గోల్కొండ మార్కెట్ ఒకటిగా గుర్తించబడింది.ఆ విధంగా 'గోల్కొండ డైమండ్' అనే పురాణ పేరు గోల్కొండకు పర్యాయపదంగా మారింది.

కోహినూర్ డైమండ్

కోహినూర్ వజ్రానికి ప్రతిరూపం

భారత దేశానికి చెందిన అన్ని వజ్రాలలో రంగులేని కోహినూర్ డైమండ్ అత్యంత విలువగలది.ఇది అత్యంత ప్రసిద్ధిచెందిన కోళ్లూరు మైన్ నుండి సేకరించందని చరిత్ర ద్వారా తెలుస్తుంది.[4][5][6]కోళ్లూరు మైన్ అత్యంత ప్రసిద్ధ వజ్రాల గనులలో ఒకటి.కోహినూర్ డైమండ్ ప్రస్తుతం ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ యాజమాన్యంలో ఉంది. గోల్కొండ వజ్రాల వాణిజ్య కేంద్రాలలో ఇతరదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ ఉత్పత్తి,వ్యాపార లావాదేవీలు నిర్వహించాయి.వాటిలో బ్లూ హోప్ (యునైటెడ్ స్టేట్స్), పింక్ డారియా-ఇ-నూర్ (ఇరాన్), ఓర్లోవ్ (రష్యా),వైట్ రీజెంట్ (ఫ్రాన్స్), డ్రెస్డెన్ గ్రీన్ (జర్మనీ) ఉన్నాయి.వాటితోపాటు భారత దేశానికి చెందిన నిజాం, జాకబ్, ఫ్లోరెంటైన్ ఎల్లో, అక్బర్ షా, మొగల్ రాజులు రంగులేని వజ్రాలు ఉత్పత్తి చేసారు.దక్షిణ భారతదేశంలో కృష్ణా నది చుట్టూ ఇతర గనులు కూడా ఉన్నాయి. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (22 అక్టోబర్ 2016) ప్రకారం, హైదరాబాద్ ఆధారిత చరిత్రకారుడు, ముహమ్మద్ సఫిల్లా అంచనా ప్రకారం గోల్కొండలోని అన్ని గనుల నుండి 12 మిలియన్ క్యారెట్లు ఉంటుందని తెలుస్తుంది.[7]

మూలాలు

  1. https://www.thehindu.com/news/international/golconda-diamond-fetches-world-record-price/article4095621.ece
  2. https://www.nytimes.com/2011/03/18/fashion/18iht-acaj-diamonds-18.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-22.
  4. "Koh-i-Noor: Six myths about a priceless diamond". BBC News (in English). 2016-12-09. Retrieved 2020-07-22.
  5. "The Koh-I-Noor Diamond". Worthy (in English). 2019-06-24. Archived from the original on 2020-07-02. Retrieved 2020-07-22.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-22.
  7. "Famed golconda diamonds may still fetch record prices". The New Indian Express. Retrieved 2020-07-22.

వెలుపలి లంకెలు