"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గోళాకార దర్పణాలు,ప్రతిబింబాలు

From tewiki
Jump to navigation Jump to search

గోళాకార దర్పణం ముందుంచిన వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో ప్రయోగంద్వారా కనుక్కోకొవచ్చు. కాని పరావర్తన సూత్రాల సహాయంతో జ్యామితీయ నిర్మాణం వలన ప్రతిబింబ స్థానం తెలుసుకోవడం అనుకూలంగా ఉంటుంది.

వివరణ

J నుండి బయలుదేరి ప్రధానాక్షానికి సమాంతరంగా పోతున్నకాంతి కిరణం JA పరావర్తనం చెందుతుంది.[1]

గోళాకార దర్పణం
దస్త్రం:పుటాకార దర్పణం లో ప్రతిబింబం ఏర్పడుట.jpg
పుటాకార దర్పణం లో ప్రతిబింబం ఏర్పడుట

పుటాకార దర్పణమైతే పతము లో చూపినట్టు ఈ పరావర్తన కిరణం ప్రధాన నాభి F లోంచి పోతుందని,కుంభాకార దర్పణమైతే ప్రధాన నాభి నుండి వస్తున్నట్లు కనిపిస్తుంది. అట్లాగే J నుంచి బయలుదేరి వక్రతాకేంద్రం C వైపు పోతున్న కాంతి కిరణం దర్పణం మీద లంబపతనం చెంది అదే మార్గం లో వెనక్కి ప్రయాణిస్తుంది.పతములలో ఈ రెండు పరావర్తన కిరణాల ఖండన బిందువు Gవస్తువు J యొక్క ప్రతిబింబం అవుతుంది. కుంభాకార దర్పణం లో పరావర్తన కిరణాల ను వెనక్కి పొడి గించటం వలన ఏర్పడే ఖండనబిందువు G వస్తువు Jయొక్క మిధ్యా ప్రతిబింబం అవుతుంది.

దస్త్రం:కుంభాకార దర్పణం లో ప్రతిబింబం ఏర్పడుట.jpg
కుంభాకార దర్పణం లో ప్రతిబింబం ఏర్పడుట

అట్లాగే OJ మీద ఇతర బిందువుల ప్రతిబింబాలు IG మీద ఉంటాయని చూపవచ్చు. అందువలన వస్తువు OJ యొక్క ప్రతిబింబం IG అవుతుంది.ఈ నిర్మాణంవలన ప్రతిబింబం స్థానమే కాక దాని పరిమాణము, స్వభావం కూడా తెలుస్తాయి. దీని వలన వస్తువు దూరము, ప్రతిబింబం దూరము,నాభ్యంతరాలకు గల సంబంధాన్ని కనుక్కొవచ్చు.

గోళాకార దర్పణం

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం- భౌతిక శాస్త్రం పాఠ్య పుస్తకం

బయట లంకెలు