గోవాడ (అద్దంకి)

From tewiki
Jump to navigation Jump to search


గోవాడ
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

గోవాడ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం లోని గ్రామం.[1]

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప పట్టణాలు

విద్యుత్తు సౌకర్యo

గోవాడ పంచాయతీ సాధునగర్ వద్ద, 1.3 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని, 2015,మార్చి-19వ తేదీ నాడు వినియోగంలోనికి తెచ్చారు. ఈ కేంద్రం వలన గోవాడ, చినకొత్తపల్లి, సాధునగర్, శ్రీనివాసనగర్, చక్రాయపాలెం, గోపాలపురం, వెంపరాల, ఉప్పలపాడు, మైలవరం గ్రామాలతో సహా మొత్తం 15 గ్రామాలకు లబ్ధి చేకూరడమేగాక, ఆ గ్రామాలలో లో-వోల్టేజి సమస్య తీరిపోగలదు. [4]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పుట్టా పద్మావతీదేవిసాంబశివరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గెల్లా సింగయ్య ఎన్నికైనారు. [2]
  2. 10లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో, ఈ గ్రామ పంచాయతీకి నూతన భవన నిర్మాణానికై, 2015,నవంబరు-15వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు. [5]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

గోవాడ గ్రామంలోని కోదండరామస్వామి వారి ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. [3]

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం

శ్రీ పోలేరుమాత - ఆంకాళపరమేశ్వరి - శ్రీ పోతురాజుస్వామివారల ఆలయం

గ్రామస్థులంతా ఏకతాటిపై నిలబడి, 8 లక్షల విరాళాలు సేకరించి, ఈ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించినారు. నూతన ఆలయంలో గోపుర శిఖర, కలశ, శిలా విగ్రహ స్థిర ప్రతిష్ఠా మహోత్సవం 2017,జూన్-18వతేదీ ఉదయం 8-01 కి శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి గోవాడతోపాటు, బల్లికురవ, అద్దంకి, సంతమాగులూరు మండలాల నుండి, గ్రామస్థుల బంధువులు పెద్దసంఖ్యలో తరలి వచ్చినారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు

2013 - గత ఏడాది పసుపు, జొన్న వ్యాపారంలో నష్టాలు చవిచూసి కూరగాయల పంట పండించడానికి పూనుకున్న గ్రామాలలో గోవాడ ఒకటి. గోవాడ రైతులు పండిస్తున్న కూరగాయాల సాగులో ప్రధానమైనవి. టమాటా, వంకాయలు, మిరపకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, దోసకాయలు, కొత్తిమీర, మెంతికూర, చిక్కుడుకాయలు, గోబీపువ్వు, ఆకు కూరలు మొదలైనవి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం,వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

1.మాకినేని వెంకయ్య (మాజీ సర్పంచి) 2.మాకినేని యేడుకొండలు, ట్,డి,పి, లీడర్

గ్రామ విశేషాలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.

[1]

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,జులై-25; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,ఏప్రిల్-9; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మార్చి-20; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,నవంబరు-16; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జూన్-19; 2వపేజీ.