"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఘటకేసర్

From tewiki
Jump to navigation Jump to search

ఘటకేసర్, తెలంగాణ రాష్ట్రములోని మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

ఈ మండలం రంగారెడ్డి జిల్లా తూర్పున, నల్గొండజిల్లా సరిహద్దులో ఉంది.ఇది మేజర్ గ్రామ పంచాయతి.

2008 పంచాయతి ఎన్నికలు

అక్టోబర్ 6, 2008న జరిగిన పంచాయతి ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలబడగా నవ తెలంగాణ ప్రజా పార్టీ బలపర్చిన మేకల సుజాత నర్సింగరావు గెలుపొందింది.[2] సుజాత 3840 ఓట్లు సాధించగా, తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి నాగమణికి 2653 ఓట్లు లభించాయి.[3] కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సుజాత దాసుకు 2255 ఓట్లు, విజయలక్ష్మికి 141 ఓట్లు లభించాయి.

గ్రామ జనాభా

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 19763, పురుషులు 10167, స్త్రీలు 9596, ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 2185, అక్షరాస్యులు 14288.[4]

సమీప గ్రామాలు

యానంపేట్ 2 కి.మీ., కొండాపూర్ 2 .కి., మీ., ఔషాపూర్ 3 కి.మీ., అంకుష్ పూర్ 4 కి.మీ., కొర్రెముల్ 4 కి.మీ., దూరంలో ఉన్నాయి.

విద్యాసంస్థలు

 1. చైతన్య జూనియర్ కాలేజ్, ఘటకేసర్
 2. గురుకుల్ జూనియర్ కాలేజ్, ఘటకేసర్
 3. ఆనందజోతి జూనియర్ కాలేజ్, ఘటకేసర్
 4. శ్రీచైతన్య డిగ్రీ కళాశాల, ఘటకేశర్.
 5. విజ్ఞాన స్కూల్, ఘటకేసర్,
 6. అభూపతి హై స్కూల్, ఘటకేసర్
 7. మండల పరిషద్ పాఠశాల.ఘటకేసర్[4]

మండలంలోని పట్టణాలు

 • ఘటకేసర్ (ct)

మూలాలు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, తేది 07-10-2008.
 3. సాక్షి దినపత్రిక, రంగారెడ్డి ఫుల్ అవుట్, తేది 07-10-2008
 4. 4.0 4.1 http://www.onefivenine.com/india/villages/Rangareddi/Ghatkesar/Ghatkesar

వెలుపలి లింకులు