చంద్రమోహన్

From tewiki
Jump to navigation Jump to search
చంద్రమోహన్
దస్త్రం:ChandraMohanActor.jpg
జననం
మల్లంపల్లి చంద్రశేఖర రావు [1]

(1945-05-23) 1945 మే 23 (వయస్సు 76)
విద్యబి. ఎస్. సి, బాపట్ల వ్యవసాయ కళాశాల
వృత్తినటుడు
జీవిత భాగస్వాములుజలంధర
పిల్లలుఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులు
  • మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి (తండ్రి)
  • శాంభవి (తల్లి)
పురస్కారాలునంది అవార్డు

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.[2] 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.

జీవిత సంగ్రహం

చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఈయన వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.

చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు.

ఈయన భార్య పేరు జలంధర. ఈమె మంచి రచయిత్రి. కొన్ని కథా సంకలనాలను కూడా వెలువరించింది.

పురస్కారములు

  • 2005 : అతనొక్కడే సినిమా కోసం ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది పురస్కారం పొందారు.
  • 2021 - తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు - మొట్టమొదటి సరిగా 14 దేశాల నుండి రచయుతలు 108 చంద్ర మోహన్ గారు నటించిన చిత్రా విశ్లేషణ.

నటించిన కొన్ని చిత్రాలు

మూలాలు

  1. Andhrajyothy (23 May 2021). "80 ఏళ్ళ సమ్మోహనుడు". www.andhrajyothy.com. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.
  2. "chandramohan: అవన్నీ పుకార్లు.. నమ్మకండి - senior actor chandramohan clarifies on rumours about his health". www.eenadu.net. Archived from the original on 2021-05-25. Retrieved 2021-05-25.
  3. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.

బయటి లింకులు