"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చక్రవాకం (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
చక్రవాకం
(1974 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం వి.మధుసూదన రావు
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ,
చంద్రకళ,
ఎస్.వి.రంగారావు,
నాగభూషణం,
రాజసులోచన
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం" ఆధారంగా, డి. రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా, శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు. ఎస్.వీ.ఆర్, జి.వరలక్ష్మి, వాణిశ్రీ, చంద్రకళ, రాజబాబు, శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలం కాలేదు. చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒక కారణంగా చెబుతారు.

కథ

వాణిశ్రీ, శోభన్ లు ప్రేమికులు. ఆస్తి వేరేవారికి పోరాదని శోభన్ వదిన జి.వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళకు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రేమికులు దూరం కావడం, కథానాయిక కష్టాలు పాలై తండ్రిని పోగొట్టు కొవడం, చివరికి ప్రేమికుల కలయిక చిత్రకథ.

పాటలు

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.