"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చరిగొండ ధర్మన్న

From tewiki
Jump to navigation Jump to search

చరిగొండ ధర్మన్న పాలమూరు జిల్లాకు చెందిన కవి. చరికొండ గ్రామానికి చెందిన[1] ధర్మన్న జనన, మరణ సంవత్సరాలపై కచ్చితమైన ఆధారం లేదు కాని అతని రచనలు, మంత్రి పోషణల ప్రకారం జీవితకాలం క్రీ.శ.1480-1530గా నిర్ణయించారు. పూర్వం చరిగొండ సీమగా పిలుబడి ప్రస్తుతం కల్వకుర్తి మండలంలో ఉన్న చారికొండ గ్రామానికి చెందిన ధర్మన్న "చిత్రభారతం" కావ్యం ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఈ కావ్యాన్ని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన పెద్దన మంత్రికి అంకితం ఇవ్వడం వల్ల అతడిని ఆ జిల్లావాడుగా పరిగణించడం జరిగింది.[2] షితాబుఖానుగా పేరుపొందిన సీతాపతి మంత్రి ఎనుమలూరి పెద్దన పోషణలో ఉండి ఈ కావ్యాన్ని రచించాడు.[3] ధర్మన్న రచించిన చిత్రభారతం 8 ఆశ్వాసాల ప్రబంధం. ఇందలి కథ చిత్రవిచిత్రమైనది. అందుకే గ్రంథానికి ఆ పేరుపెట్టబడింది. చరిగొండ ధర్మన్న వంటి కవులను సాహిత్యకారులు పట్టింకోలేరు.[4] ధర్మన్న గంటకు వందపద్యాలు చెప్పగలిగే అవధాన విద్యాప్రవీణుడని అతని పద్యాలే చెబుతాయి. ధర్మన్న ‘శతలేఖిన్యవధాన పద్యరచనా సంధాన సురవూతాణ చిహ్నిత నాయుడు, శతఘంట సురవూతాణుడు’ అన్న బిరుదులు గలవాడు. గంటకు నూరు పద్యాలు అల్ల గలిగిన శతావధాని అని దీని అర్థం.[5] 17వ శతాబ్దిలో జ్యోతిష్యరత్నాకరం రచించిన చరిగొండ హోన్నయ్య కూడా ధర్మన్న వంశీయుడు. ఈయన రాసిన చిత్ర భారతము పద్యకావ్యం ప్రసిద్ధి చెందినది.

ప్రాచుర్యం

  • ధర్మన్న రచించిన చిత్రభారతం కావ్యాన్ని పళ్లె వేంకట సుబ్బారావు 1920ల్లో సంగ్రహం చేసి వచనంగా మలిచి ప్రచురించారు. దీనిని 1922లో నాటి విద్యాశాఖ విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా, 1925 ట్రెయింగ్ స్కూళ్ల హైయర్ గ్రేడ్ పరీక్షకు పాఠ్యగ్రంథంగానూ నిర్ణయించారు.[6]

బయటి లింకులు

మూలాలు

  1. తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఎస్వీ రామారావు, పేజీ 58
  2. పాలమురు సాహితీ వైభవం, రచన ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 17
  3. http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=9&ContentId=231506
  4. సమగ్రాంధ్ర సాహిత్యం, ఆరుద్ర
  5. http://www.namasthetelangaana.com/Editorials/story.asp?category=1&subCategory=7&ContentId=111356
  6. చిత్రభారతము(రెండవకూర్పు పీఠిక):మూ.చరిగొండ ధర్మన్న, వచనం.పళ్లె వెంకట సుబ్బారావు:1923

మూస:నాగర్‌కర్నూల్ జిల్లా కవులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).