"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చిన్ముద్ర

From tewiki
Jump to navigation Jump to search

బొటనవేలు, చూపుడు వేలు చివరలు కలిసి, మిగిలిన మూడు వేళ్లను నిటారుగా ఉంచితే దానిని చిన్ముద్ర అని అంటారు. ధ్యాన సమయంలో ఆధ్యాత్మిక శక్తి బయటకు ప్రసరించకుండా ఈ ముద్ర ఆపుతుంది[1]. ‘చిన్ముద్ర’ అనగా బొటన వ్రేలిపై చూపుడు వ్రేలుని నిలిపి ఉంచటం. బొటన వ్రేలుని భగవంతుడిగానూ, చూపుడి వ్రేలిని జీవుడిగానూ భావించి కలిపి, మిగిలిన మూడు వ్రేళ్ళనూ అహంకార, భ్రమ, చెడు ప్రవృత్తులుగా భావించి దూరంగా పెట్టాలనేదే ఈ ముద్రం అర్థం. చిన్ముద్ర జ్ఞాన స్వరూపానికి సంకేతం[2].

ప్రయోజనం

రక్తపోటునివారణ, సకారాత్మక ఆలోచనలు, జ్ఞాపకశక్తి, చూపు పెరుగుదలకు, కాళ్ళకి నీరు బడితే నివారిస్తుంది. ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధ బరుస్తుంది. ఇది ధ్యానముద్ర.

మూలాలు

  1. "చిన్ముద్ర అనగా ఏమిటి?-Andhravilas-Latest Telugu Movie News, Movie Gossips-Tollywood headlines with videos, photo galleries". Andhravilas. Retrieved 2020-04-15.[permanent dead link]
  2. "శివనామస్మరణం జన్మధన్యం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-04-15.[permanent dead link]