చిలకమర్తి సత్యనారాయణ

From tewiki
Jump to navigation Jump to search
చిలకమర్తి సత్యనారాయణ
దస్త్రం:Chilakamarthy SahtyaNarayana.jpg
జననంమార్చి 3, 1927
మరణం2004
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక రచయిత

చిలకమర్తి సత్యనారాయణ (మార్చి 3, 1927 - 2004) రంగస్థల నటుడు, రచయిత. సుప్రసిద్ధ నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం ఈయనకు పెదనాన్న.[1]

జననం - ఉద్యోగం

సత్యనారాయణ 1927, మార్చి 3న తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలో జన్మించాడు.

నాటకరంగ ప్రస్థానం

1956 వరకు ముంబాయిలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో ఆర్.ఎం. సింగ్, శంభుమిత్ర, రిత్వీఘటక్ వంటి ప్రముఖ నటుల దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. వారి ప్రోత్సాహంతో ఎ.కె. హంగల్, నత్యేకప్పు, బాలరాజ్ సహానీల సరసన హిందీ నాటకాలలో నటించాడు. అక్కడే గరికపాటి రాజారావు దగ్గర మేకప్ నేర్చుకున్నాడు.

నాటకాలు

నటించినవి:

 1. మనోవ్యధ (డాక్టరు పాత్ర)
 2. కన్యాశుల్కం (గిరీశం పాత్ర)
 3. కథకంచికి
 4. ఇంటిదీపం
 5. దైవశాసనం
 6. మాస్టర్జీ
 7. ఫణి
 8. ఒకే కుటుంబం
 9. చరిత్ర
 10. పద్మవ్యూహం

రచించినవి:

 1. క్రీనీడ (1964)
 2. కళాప్రపూర్ణ
 3. నటనాశిల్పం
 4. రంగస్థల శిల్పం

బహుమతులు

 • ఉత్తమ నటుడు - లలితకళాసమితి రాష్ట్రస్థాయి నాటిక పోటలు (1958) - లో కొర్రపాటి గంగాధరరావు మనోవ్యధ నాటకంలోని డాక్టరు పాత్ర
 • ఉత్తమ నటుడు - లలిత కళానికేతన్ (రాజమండ్రి) మొట్టమొదట నిర్వహించిన కన్యాశుల్కం ఆఖరి దృశ్యంలోని గిరీశం పాత్ర.
 • అనేక నాటకాల్లో పాత్రోచిత నటనకు ఉత్తమ నటుడిగా బహుమతులు

మరణం

సత్యనారాయణ 2004 లో మరణించాడు.

మూలాలు

 1. చిలకమర్తి సత్యనారాయణ, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.390.