"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చిలకా ఏతోడులేక (పాట)

From tewiki
Jump to navigation Jump to search
"చిలకా ఏతోడులేక"
200px
చిలకా ఏతోడులేక పాటలోని దృశ్యం
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణశుభలగ్నం (1994)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చిత్రంలో ప్రదర్శించినవారుజగపతిబాబు, ఆమని, రోజా

చిలకా ఏతోడు లేక పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించిన ఈ పాటను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1]

పాట నేపథ్యం

డబ్బుకోసం కట్టుకున్న భర్తను వేరే అమ్మాయికి అమ్ముకున్న భార్యకు తన భర్త, మాంగళ్యం విలువ తెలిసిన సందర్భంలో వచ్చే పాట.

పాటలోని సాహిత్యం

పల్లవి:
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//

చరణం 1:
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//

పురస్కారాలు

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
  2. కళాసాగర్ అవార్డు -1994
  3. మనస్విని అవార్డు -1994

మూలాలు

  1. "Chilaka Ye Thodu Lekha". www.amazon.com. Retrieved 2020-12-22.

వీడియో లింకులు

  1. యూట్యూబ్ లో పాట వీడియో
  2. యూట్యూబ్ లో ఈ పాట వీడియో